iDreamPost
android-app
ios-app

T20 World Cup 2024: షాకింగ్.. టీ20 వరల్డ్ కప్ కు స్టార్ క్రికెటర్ దూరం!

  • Published May 28, 2024 | 4:10 PM Updated Updated May 28, 2024 | 4:10 PM

గాయం కారణంగా ఓ స్టార్ ఆల్ రౌండర్ టీ20 ప్రపంచ కప్ టోర్నీ మెుత్తానికే దూరమైయ్యాడు. ఈ విషయాన్ని ఆ క్రికెట్ బోర్డ్ కూడా ధృవీకరించింది. ఆ ప్లేయర్ ఎవరు? ఆ వివరాల్లోకి వెళితే..

గాయం కారణంగా ఓ స్టార్ ఆల్ రౌండర్ టీ20 ప్రపంచ కప్ టోర్నీ మెుత్తానికే దూరమైయ్యాడు. ఈ విషయాన్ని ఆ క్రికెట్ బోర్డ్ కూడా ధృవీకరించింది. ఆ ప్లేయర్ ఎవరు? ఆ వివరాల్లోకి వెళితే..

T20 World Cup 2024: షాకింగ్.. టీ20 వరల్డ్ కప్ కు స్టార్ క్రికెటర్ దూరం!

టీ20 వరల్డ్ కప్ 2024 కోసం అన్ని జట్లు అస్త్రశస్త్రాలతో సిద్ధమైయ్యాయి. 20 టీమ్స్ పాల్గొంటున్న ఈ మెగా టోర్నీ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. వెస్టిండీస్, అమెరికా దేశాలు సంయుక్తంగా ఈ వరల్డ్ కప్ కు ఆతిథ్యం ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని జట్లు గాయాలతో ఇబ్బందులు పడుతున్నాయి. తాజాగా గాయం కారణంగా ఓ స్టార్ ఆల్ రౌండర్ టోర్నీ మెుత్తానికే దూరమైయ్యాడు. ఈ విషయాన్ని ఆ క్రికెట్ బోర్డ్ కూడా ధృవీకరించింది. ఆ ప్లేయర్ ఎవరు? తెలుసుకుందాం పదండి.

టీ20 వరల్డ్ కప్ ముందు వెస్టిండీస్ టీమ్ కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్వదేశంలో టోర్నీ జరగడం, జట్టులోని ప్లేయర్లు ఫామ్ లో ఉండటంతో.. టైటిల్ ఫేవరెట్ గా వెస్టిండీస్ బరిలోకి దిగబోతోంది. ఈ క్రమంలోనే విండీస్ జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ జాసన్ హోల్డర్ గాయం కారణంగా వరల్డ్ కప్ మెుత్తానికే దూరమైయ్యాడు. కౌంటీ క్రికెట్ లో వోర్సెస్టర్ షైర్ కు ప్రాతినిథ్యం వహిస్తున్నప్పుడు అతడికి గాయమైంది. ఆ గాయం నుంచి హోల్డర్ ఇంకా కోలుకోకపోవడం, ఎప్పుడు కోలకుంటాడో తెలీకపోవడంతో.. అతడిని వరల్డ్ కప్ కు దూరం చేశామని విండీస్ చీఫ్ సెలెక్టర్ డెస్మండ్  హేన్స్ స్పష్టం చేశాడు.

టీ20 వరల్డ్ కప్ లో జాసన్ హోల్డర్ లేకపోవడం కచ్చితంగా మాకు తీరని లోటేనని, అతడు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు చీఫ్ సెలెక్టర్ చెప్పుకొచ్చాడు. ఇక హోల్డర్ ప్లేస్ లో లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ఒబెడ్ మెక్ కాయ్ ను టీమ్ లోకి తీసుకుంది. జట్టునిండా హార్ట్ హిట్టర్లు, ఆల్ రౌండర్లు ఉండటంతో.. టైటిల్ ఫేవరెట్ గా విండీస్ బరిలోకి దిగుతోంది. ఈ క్రమంలో జాసన్ హోల్డర్ లాంటి స్టార్ ఆల్ రౌండర్ దూరం కావడం విండీస్ కు బిగ్ షాక్ అనే చెప్పాలి. ఇక ప్రపంచ కప్ లో తన తొలి మ్యాచ్ లో పుపువా న్యూగినియాతో జూన్ 2న తలపడనుంది.

వెస్టిండీస్ టీమ్:

రోవ్ మన్ పావెల్(కెప్టెన్) అల్జారీ జోసెఫ్(వైస్ కెప్టెన్), రోస్టన్ చేజ్, జాన్సన్ చార్లెస్, షమర్ జోసెఫ్, హెట్మెయర్, నికోలస్ పూరన్, బ్రండన్ కింగ్, షై హోప్, ఆండ్రీ రస్సెల్, రొమారియో షెఫర్డ్, ఒబెడ్ మెక్ కాయ్, అకేల్ హోసెన్, గూడాకేశ్ రూథర్ ఫొర్డ్.

ఇదికూడా చదవండి: IND vs PAK: భారత్-పాక్ మ్యాచ్‌కు డేంజరస్ పిచ్! ఇక మనకి కోహ్లీనే దిక్కు!