Somesekhar
షమర్ జోసెఫ్.. సంవత్సరం క్రితం సెక్యూరిటీ గార్డుగా పనిచేసిన ఇతడు, నేడు విండీస్ క్రికెట్ లో ఓ హీరో. 27 సంవత్సరాల తర్వాత వెస్టిండీస్ కు చరిత్రాత్మక విజయాన్ని అందించిన పోరాట యోధుడైన జోసెఫ్ లైఫ్ స్టోరీని ఓసారి పరిశీలిద్దాం.
షమర్ జోసెఫ్.. సంవత్సరం క్రితం సెక్యూరిటీ గార్డుగా పనిచేసిన ఇతడు, నేడు విండీస్ క్రికెట్ లో ఓ హీరో. 27 సంవత్సరాల తర్వాత వెస్టిండీస్ కు చరిత్రాత్మక విజయాన్ని అందించిన పోరాట యోధుడైన జోసెఫ్ లైఫ్ స్టోరీని ఓసారి పరిశీలిద్దాం.
Somesekhar
సాధించడానికి ఓ లక్ష్యం.. సాధించాలన్న తపన ఉంటే చాలు, మనిషి ఎంతైనా చేయగలడు. కోరికతో పాటుగా కృషి, పట్టుదల ఉంటే ఆ వ్యక్తిని ప్రపంచంలో ఎవ్వరూ ఆపలేరు. ఎన్ని కష్టాలు వచ్చినా.. పట్టువదలని విక్రమార్కుడిలా తమ కలలను నెరవేర్చుకుంటారు కొందరు. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే వ్యక్తి కూడా ఇలాంటి వాడే. అతడే ‘షమర్ జోసెఫ్‘.. ప్రపంచ క్రికెట్లో ఇప్పుడు ఇతడో సంచలనం. ఆస్ట్రేలియా జట్టును వారి గడ్డపైనే గడగడలాడించిన వెస్టిండీస్ హీరో. అయితే ఇప్పుడు హీరోగా వెలుగొందుతున్న జోసెఫ్ జీవితంలో ఎన్నో కష్టనష్టాలు ఉన్నాయి. సంవత్సరం క్రితం సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహించిన జోసెఫ్.. ఇప్పుడు విండీస్ క్రికెట్ లో హీరో. మరి ఆసీస్ ను వణికించిన ఈ పోరాట యోధుడి లైఫ్ స్టోరీని ఓసారి పరిశీలిద్దాం పదండి.
షమర్ జోసెఫ్.. 1999 ఆగస్టు 31న వెస్టిండీస్ లోని గయానాలోని బరాకరా అనే ఓ చిన్న గ్రామంలో జన్మించాడు. చిన్నతనం నుంచే అతడికి క్రికెట్ అంటే పిచ్చి. కానీ కుటుంబ పరిస్థితులు క్రికెట్ కలలను మనసులోనే దాచిపెట్టుకునేలా చేశాయి. జోసెఫ్ కు ముగ్గురు అక్కాచెల్లెళ్ళు, ఐదుగురు సోదరులు ఉన్నారు. తను ఊహ తెలిసినప్పటి నుంచి విండీస్ దిగ్గజ ఆటగాళ్లు అయిన ఆంబ్రోస్, కోర్ట్నీ వాల్ష్ లను ఆరాధిస్తూ పెరిగాడు. తన గ్రామంలో టేప్ బాల్, నిమ్మకాయాలు, జామ పండ్లతో బౌలింగ్ చేయడం ప్రాక్టీస్ చేసేవాడు. బరాకరాలో దీనిని జంగిల్-ల్యాండ్ క్రికెట్ అని పిలుస్తారు. కానీ.. కుటుంబ పరిస్థితులు దారుణంగా ఉండటంతో.. తన తండ్రితో కలిసి ఫ్యాక్టరిలో పనికివెళ్లాడు.
ఈ క్రమంలోనే జరిగిన ఓ సంఘటన జోసెఫ్ ను న్యూ ఆమ్ స్టర్ డామ్ కు చేర్చింది. ఇది జోసెఫ్ జీవితాన్ని మలుపుతిప్పిన ఘటన. అమ్ స్టర్ డామ్ లో సెక్యూరిటీ గార్డ్ గా విధుల్లోకి చేరాడు. దీంతో తన డ్రీమ్ అయిన క్రికెట్ కు సమయం కేటాయించలేకపోయాడు. కానీ సమయం దొరికినప్పుడల్లా ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే విండీస్ క్రికెటర్ రొమారియో షెపర్డ్ ద్వారా క్రికెట్ లోకి అడుగుపెట్టాడు. అతడే జోసెఫ్ ను గయానా క్రికెట్ జట్టుకు పరిచయం చేశాడు. ఇక అప్పటి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు ఈ విండీస్ స్టార్ బౌలర్. డివిజన్ క్రికెట్ లో అద్భుతమైన గణాంకాలతో అందరిని ఆశ్చర్యపరిచాడు.
దీంతో అతి తక్కువ కాలంలోనే ఫస్ట్ క్లాస్ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు షమర్. అక్కాడా రాణించడంతో.. సంవత్సరం తిరగక ముందే.. జాతీయ జట్టు నుంచి పిలుపు వచ్చింది. ఏకంగా ఆసీస్ తో జరిగే టెస్ట్ సిరీస్ కోసం ఇతడిని ఎంపిక చేసింది విండీస్ క్రికెట్ బోర్డ్. తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయకుండా జోసెఫ్ రాణించాడు. తొలి టెస్ట్ లోనే తొలి బాల్ కే స్టీవ్ స్మిత్ లాంటి స్టార్ బ్యాటర్ ను అవుట్ చేసి అందరికి షాకిచ్చాడు. అదీకాక ఆ మ్యాచ్ లో 5 వికెట్లు తీసి తన సత్తా ఏంటో చాటిచెప్పాడు. ఇక రెండో టెస్ట్ లో ఏకంగా తన విశ్వరూపమే చూపాడు. ఈ మ్యాచ్ లో రెండో ఇన్నింగ్స్ లో ఏకంగా 7 వికెట్లు పడగొట్టి ఆసీస్ నడ్డివిరిచి.. విండీస్ జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.
అరంగేట్రంలోనే ఆసీస్ లాంటి పెద్ద జట్టును వణికించిన జోసెఫ్ ఇప్పుడు విండీస్ క్రికెట్ లో ఓ హీరో. సెక్యూరిటీ గార్డ్ నుంచి జాతీయ జట్టులో చోటు సంపాదించడమే కాకుండా.. 27 సంవత్సరాల తర్వాత టీమ్ కు రికార్డు విజయం అందించాడు. ప్రస్తుతం షమర్ జోసెఫ్ పై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. ఇక్కడు మరో విషయం గురించి ప్రస్తావించుకోవాలి. ఈ మ్యాచ్ లో ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్ విసిరిన బంతికి జోసెఫ్ కాలి బొటన వేలికి తీవ్రంగా గాయం అయ్యింది. అంతటి గాయాన్ని సైతం లెక్కచేయకుండా.. తన జట్టు కోసం పోరాటం కొనసాగించి.. విజయం సాధించిన వీరుడు షమర్ జోసెఫ్. సెక్యూరిటీ గార్డు నుంచి ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి అడుగుపెట్టిన జోసెఫ్ జీవితం ఎందరికో స్ఫూర్తి. ఇక ఆసీస్ ను వారి గడ్డపైనే వణికించి.. ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్న జోసెఫ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Shamar Joseph, the hero West Indies needed to revive itself. What a win over Australia, at Gabba.🔥 #AUSvWIpic.twitter.com/xwqKdtLB6J
— Keh Ke Peheno (@coolfunnytshirt) January 28, 2024