SNP
క్రికెట్ ప్రపంచాన్ని శోక సంద్రంలో ముంచుతూ.. ఇద్దరు లెజెండరీ క్రికెటర్లు ఒకే రోజు మృతి చెందారు. ఈ విషయాన్ని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు అధికారికంగా ధృవీకరించింది.
క్రికెట్ ప్రపంచాన్ని శోక సంద్రంలో ముంచుతూ.. ఇద్దరు లెజెండరీ క్రికెటర్లు ఒకే రోజు మృతి చెందారు. ఈ విషయాన్ని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు అధికారికంగా ధృవీకరించింది.
SNP
ఒకే రోజు ఇద్దరు మాజీ క్రికెటర్లు మృతి చెందడంతో.. క్రికెట్ ప్రపంచం శోకసంద్రంలో మునిగిపోయింది. పైగా ఆ ఇద్దరు లెజెండరీ క్రికెటర్లు వెస్టిండీస్‌కు చెందిన వారే. దీంతో.. కరేబియన్ క్రికెట్ తీవ్ర విషాదంలో ఉంది. వెస్టిండీస్ మాజీ స్పిన్నర్ క్లైడ్ బట్స్(65) శుక్రవారం రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా.. మరో దిగ్గజ మాజీ క్రికెటర్ జో సోలమన్(95) అనారోగ్యంతో కన్నుమూశారు. ఇద్దరు దిగ్గజ మాజీ క్రికెటర్లు ఒకే రోజు మృతి చెందడం.. సగటు క్రికెట్ అభిమాని చేత కన్నీళ్లు పెట్టిస్తోంది. వీరిద్దరి మృతి క్రికెట్ ప్రపంచానికి తీరని లోటని క్రికెటర్లు, క్రికెట్ అభిమానులు పేర్కొంటున్నారు.
గయానాకు చెందిన జో సోలమన్ వెస్టిండీస్ టీమ్‌లో కీలక బ్యాటర్‌గా కొనసాగారు. 1958 నుంచి 1965 మధ్య కాలంలో 27 టెస్టులు ఆడిన సోలమన్ 34 సగటుతో 1326 పరుగులు చేశారు. ఇక క్లైడ్ బట్స్ 1980ల్లో వెస్టిండీస్ జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చారు. అప్పటి వరకు పేస్‌బౌలింగ్‌కు అడ్డాగా ఉన్న వెస్టిండీస్‌కు.. బట్స్ రాకతో స్పిన్ బలం కూడా పెరిగింది. అయితే.. బట్స్ కరేబియన్ టీమ్ తరఫున కేవలం 7 మ్యాచ్‌లు మాత్రమే ఆడినప్పటికీ.. మంచి ప్రదర్శన కనబర్చారు. కానీ, బట్స్‌కు దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన రికార్డు ఉంది. దేశవాళీ క్రికెట్‌లో 87 ఫస్ట్ క్లాస్, 32 లిస్ట్-ఏ మ్యాచ్‌ల్లో గయానా తరఫున ఆడారు బట్స్. ఇక అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత.. కామెంటేటర్‌గా కొనసాగారు. 2000వ ఏడాదిలో విండీస్ టీమ్‌కు చీఫ్ సెలెక్టర్‌గా కూడా పని చేశారు. ఇప్పుడు ఈ ఇద్దరు దిగ్గజ క్రికెటర్లు మృతితో ప్రస్తుతం క్రికెట్ లోక గబోయింది.
Clyde Butts’ tragic demise resulted from a car accident near Eccles, East Bank Demerara.https://t.co/1ONG6dvzmX
— CricTracker (@Cricketracker) December 9, 2023