Somesekhar
Sunil Narine: కేకేర్ వర్సెస్ రాజస్తాన్ మ్యాచ్ ముగిసిన తర్వాత సునీల్ నరైన్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు విండీస్ కెప్టెన్ రోవ్ మన్ పావెల్. ఏడాదిగా నరైన్ బతిమిలాడుతున్నాను అంటూ..
Sunil Narine: కేకేర్ వర్సెస్ రాజస్తాన్ మ్యాచ్ ముగిసిన తర్వాత సునీల్ నరైన్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు విండీస్ కెప్టెన్ రోవ్ మన్ పావెల్. ఏడాదిగా నరైన్ బతిమిలాడుతున్నాను అంటూ..
Somesekhar
సునీల్ నరైన్.. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లో ఎవ్వరి నోట విన్నా ఈ ఆటగాడి పేరే వినపడుతోంది. అంతలా అతడి విధ్వంసం కొనసాగుతోంది ఈ సీజన్ లో. ఇక తాజాగా రాజస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో తన విశ్వరూపం చూపాడు నరైన్. 56 బంతుల్లో 13 ఫోర్లు, 6 సిక్సులతో 109 పరుగులు చేశాడు. దీంతో కేకేఆర్ టీమ్ 223 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అయినప్పటికీ.. జోస్ బట్లర్ వీరోచిత శతకం ముందు కేకేఆర్ టీమ్ తలొంచకతప్పలేదు. ఇక ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత సునీల్ నరైన్ గురించి విండీస్ కెప్టెన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అతడిని ఏడాది నుంచి బతిమాలుతున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. అసలు కథ ఏంటంటే?
వెస్టిండీస్ క్రికెట్ టీమ్ లో ఎంతో మంది డేంజరస్ ప్లేయర్లు ఉన్నారు. ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, కీరన్ పొలార్డ్, నికోలస్ పూరన్ ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ బాగానే ఉంది. కానీ ఊరు గొప్ప పేరు దిబ్బ అన్నట్లుగా తయ్యారు అయ్యింది విండీస్ క్రికెట్ టీమ్ పరిస్థితి. గత కొంతకాలంగా పేవల ప్రదర్శనతో కరేబియన్ జట్టు పరిస్థితి దారుణంగా తయ్యారు అయ్యింది. అదీకాక టీ20 వరల్డ్ కప్ 2024 దగ్గరపడుతోంది. జూన్ లో ఈ మెగాటోర్నీ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో సునీల్ నరైన్ లాంటి స్టార్ ప్లేయర్ ను జట్టులోకి తీసుకోవాలని ఎవరైనా భావిస్తారు. క్రమంలోనే కోల్ కత్తా-రాజస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ అనంతరం సునీల్ నరైన్ గురించి విండీస్ కెప్టెన్ పావెల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
పావెల్ మాట్లాడుతూ..”సునీల్ నరైన్ ను వెస్టిండీస్ జట్టులోకి తీసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. నరైన్ బెస్ట్ ఫ్రెండ్ ను కూడా దీని గురించి మాట్లాడమని చెప్పాను. పొలార్డ్, బ్రావో, పూరన్ కూడా నరైన్ ను ఒప్పించమని గత సంవత్సర కాలంగా అడుగుతూనే ఉన్నాను. కానీ ఎవ్వరు చెప్పిన నరైన్ వినిపించుకోవడం లేదు. టీ20 వరల్డ్ కప్ కు జట్టును ఎంపిక చేసే టైమ్ లోగానైనా వారు అతడిని ఒప్పిస్తారని ఆశగా ఎదురుచూస్తున్నాను” అంటూ పావెల్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం పావెల్ రాజస్తాన్ రాయల్స్ తరఫున ఆడుతున్నాడు. కాగా.. 2019 ఆగస్టు తర్వాత వెస్టిండీస్ టీమ్ తరఫున ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడలేదు. గతేడాది నవంబర్ లో నరైన్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. చూడాలి మరి బుజ్జగింపులకు నరైన్ మనసు కరుగుతుందో? లేదో?
West Indies T20 captain Rovman Powell is doing everything he can to get Sunil Narine back for the T20 World Cup 🙏 #T20WC pic.twitter.com/d5sYIN4Y10
— ESPNcricinfo (@ESPNcricinfo) April 16, 2024