వెస్టిండీస్ టీ20 వరల్డ్ కప్ టీమ్ ప్రకటన.. కప్పు కొట్టకుండా వీళ్లను ఆపగలరా?

టీ20 వరల్డ్ కప్-2024కు ఆతిథ్యం ఇస్తున్న వెస్టిండీస్ తమ స్క్వాడ్​ను ప్రకటించింది. ఆ టీమ్​లోని ఒక్కో ప్లేయర్​ పేరు చెబితే వణికిపోవడం ఖాయం. ఇంత స్ట్రాంగ్​గా ఉన్న విండీస్​ను కప్పు కొట్టకుండా ఆపగలగడం చాలా కష్టంగానే కనిపిస్తోంది.

టీ20 వరల్డ్ కప్-2024కు ఆతిథ్యం ఇస్తున్న వెస్టిండీస్ తమ స్క్వాడ్​ను ప్రకటించింది. ఆ టీమ్​లోని ఒక్కో ప్లేయర్​ పేరు చెబితే వణికిపోవడం ఖాయం. ఇంత స్ట్రాంగ్​గా ఉన్న విండీస్​ను కప్పు కొట్టకుండా ఆపగలగడం చాలా కష్టంగానే కనిపిస్తోంది.

క్రికెట్ లవర్స్ ఇప్పుడు ఐపీఎల్-2024 మాయలో ఉన్నారు. క్యాష్ రిచ్ లీగ్ గ్రూప్ దశ ముగింపునకు చేరుకుంది. ప్రతి జట్టు దాదాపుగా 10 మ్యాచ్​లు ఆడేసింది. గ్రూప్ స్టేజీ ముగిశాక ప్లేఆఫ్స్, ఆ తర్వాత ఫైనల్​తో టోర్నీ కంప్లీట్ అవుతుంది. అయితే ఐపీఎల్​ ముగిసిన వెంటనే టీ20 వరల్డ్ కప్ రూపంలో ఆడియెన్స్​కు మరింత వినోదం లభించనుంది. మెగా టోర్నీ కోసం ఇప్పటికే చాలా టీమ్స్ తమ స్క్వాడ్స్​ను ప్రకటించాయి. ప్రపంచ కప్​కు ముందు ఒకట్రెండు టీ20 సిరీస్​లు ఆడేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నాయి. ఈ తరుణంలో మెగా టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న వెస్టిండీస్ తమ వరల్డ్ కప్ జట్టును అనౌన్స్ చేసింది. ఆ టీమ్​లోని ఆటగాళ్ల పేర్లను చూస్తే ఎవ్వరికైనా వెన్నులో వణుకు పుట్టాల్సిందే.

విండీస్ 15 మంది సభ్యులతో కూడిన వరల్డ్ కప్ స్క్వాడ్​ను ప్రకటించింది. ఈ టీమ్​కు రోమాన్ పావెల్ కెప్టెన్​గా వ్యవహరించనున్నాడు. అతడితో పాటు స్టార్ ఆల్​రౌండర్ ఆండ్రూ రస్సెల్, నికోలస్ పూరన్, షిమ్రాన్ హెట్​మెయిర్, అల్జారీ జోసెఫ్, జాన్సన్ చార్లెస్, రోస్టన్ ఛేజ్, జేసన్ హోల్డర్, షై హోప్, అకీల్ హొస్సేన్, షమర్ జోసెఫ్, బ్రాండన్ కింగ్, గుడకేశ్ మోతీ, షెర్ఫేన్ రూథర్​ఫర్డ్, రొమారియో షెఫర్డ్ జట్టులో చోటు దక్కించుకున్నారు. కరీబియన్ టీమ్ నిండా ఆల్​రౌండర్లే ఉన్నారు. వీళ్లందరికీ బ్యాట్​తో విధ్వంసం సృష్టించడం వెన్నతో పెట్టిన విద్య. పూరన్, రస్సెల్, హెట్​మెయిర్, పావెల్​.. ఇలా ఒకర్ని మించిన పించ్ హిట్టర్ మరొకరు. కొడితే బాల్ బౌండరీ లేదా సిక్స్​కు వెళ్లాల్సిందే అనేలా విరుచుకుపడతారు.

వెస్టిండీస్ వరల్డ్ కప్ స్క్వాడ్​ మీద సోషల్ మీడియాలో నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. ఇదేం టీమ్ సామి.. మొత్తం రాక్షసులతో నింపేశారుగా అని కామెంట్స్ చేస్తున్నారు. వీళ్లను తట్టుకొని నిలబడటం ఏ టీమ్ బౌలర్లకైనా అసాధ్యమేనని.. కప్పు కొట్టకుండా కరీబియన్ జట్టును ఆపడం కష్టమేనని అంటున్నారు. బౌలింగ్ కంటే బ్యాటింగ్ సూపర్బ్​గా ఉందని, సొంత గ్రౌండ్స్​లో ఆడనుండటం ఆ టీమ్​కు మరింత బలం చేకూర్చుతుందని చెబుతున్నారు. బౌలింగ్ యూనిట్ కూడా రాణిస్తే విండీస్​కు తిరుగుండదని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ జట్టులో సునీల్ నరైన్ లాంటి వరల్డ్ క్లాస్ స్పిన్నర్ ఒక్కడే మిస్సయ్యాడని అంటున్నారు. మరి.. విండీస్ స్క్వాడ్​పై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

Show comments