21 ఏళ్లుగా ఇండియాపై గెలుపు లేదు! అయినా వారిదే పైచేయి

రోహిత్‌ శర్మ సారథ్యంలోని టీమిండియా ప్రస్తుతం వెస్టిండీస్‌ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. టెస్ట్‌, వన్డే, టీ20 సిరీస్‌లు ఆడేందుకు కరేబియన్‌ గడ్డపై అడుగుపెట్టిన భారత జట్టు.. తొలి టెస్టులో ఘన విజయం సాధించి.. శుభారంభం చేసింది. ఈ రెండు జట్ల మధ్య ఈ రోజు(గురువారం) రెండో టెస్ట్‌ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో కూడా విజయం సాధించి సిరీస్‌ను క్లీన్‌ స్వీప్‌ చేయాలని టీమిండియా భావిస్తుంటే.. కనీసం ఈ టెస్ట్‌ అయినా గెలిచి 21 ఏళ్ల చెత్త రికార్డును బ్రేక్‌ చేద్దామని విండీస్‌ పట్టుదలతో ఉంది.

ఆ రికార్డ్‌ ఏంటంటే.. టీమిండియాపై వెస్టిండీస్‌ 21 ఏళ్లుగా ఒక్కటంటే ఒక్క టెస్ట్‌ మ్యాచ్‌ కూడా గెలవలేదు. ఎప్పుడో 2002లో చివరి సారిగా భారత్‌పై వెస్టిండీస్‌ టెస్ట్‌ మ్యాచ్‌లో విజయం సాధించింది. ఆ తర్వాత మళ్లీ గెలుపు ముఖం చూడలేదు. గతమెంతో ఘనం అన్న రితీలో ఒకప్పుడు క్రికెట్‌ ప్రపంచాన్ని సాధించిన వెస్టిండీస్‌ ఇప్పుడు అధపతాళానికి పడిపోయింది. ఆ జట్టు పరిస్థితి ఎంత దారుణంగా మరిందంటే.. కనీసం వరల్డ్ కప్‌ టోర్నీలో ఆడేందుకు అర్హత కూడా సాధించలేని పరిస్థితి వచ్చింది.

అయినా కూడా టీమిండియాపై టెస్టుల్లో ఇప్పటికీ పైచేయిగా ఉంది. భారత్‌-వెస్టిండీస్‌ మధ్య ఇప్పటి వరకు 99 టెస్టు మ్యాచ్‌లు జరిగితే.. అందులో 30 సార్లు వెస్టిండీస్‌ విజయం సాధించింది. టీమిండియా కేవలం 23 సార్లు గెలుపుపొందింది. 46 మ్యాచ్‌లు డ్రాగానే ముగిసాయి. ఇలా విజయాల పరంగా ఇప్పటికీ విండీస్‌ అప్పర్‌ హ్యాండ్‌గా ఉంది. అయితే.. రెండో టెస్టులో టీమిండియా విజయం సాధిస్తే.. విజయాల సంఖ్యలో అంతరం కాస్త తగ్గనుంది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: యూవీ దెబ్బకు అతని కెరీర్‌ క్లోజ్‌ అనుకున్నారు! కానీ, చరిత్ర సృష్టించాడు

Show comments