iDreamPost
android-app
ios-app

టీమిండియాను ఓడిస్తామంటున్న నెదర్లాండ్స్‌! ఇంత ధైర్యానికి కారణం?

  • Published Nov 09, 2023 | 12:47 PM Updated Updated Nov 09, 2023 | 12:47 PM

వరుస విజయాలతో దూసుకెళ్తున్న టీమిండియా.. తమ చివరి లీగ్‌ మ్యాచ్‌ ఆడేందుకు రెడీ అవుతుంది. పసికూన నెదర్లాండ్స్‌తో ఆదివారం బెంగళూరులో మ్యాచ్‌ జరగనుంది. అయితే.. ఈ మ్యాచ్‌లో భారత్‌ను ఓడిస్తామంటూ నెదర్లాండ్స్‌ కెప్టెన్‌ షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు. మరి అతని ధైర్యానికి కారణం ఏంటో చూద్దాం..

వరుస విజయాలతో దూసుకెళ్తున్న టీమిండియా.. తమ చివరి లీగ్‌ మ్యాచ్‌ ఆడేందుకు రెడీ అవుతుంది. పసికూన నెదర్లాండ్స్‌తో ఆదివారం బెంగళూరులో మ్యాచ్‌ జరగనుంది. అయితే.. ఈ మ్యాచ్‌లో భారత్‌ను ఓడిస్తామంటూ నెదర్లాండ్స్‌ కెప్టెన్‌ షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు. మరి అతని ధైర్యానికి కారణం ఏంటో చూద్దాం..

  • Published Nov 09, 2023 | 12:47 PMUpdated Nov 09, 2023 | 12:47 PM
టీమిండియాను ఓడిస్తామంటున్న నెదర్లాండ్స్‌! ఇంత ధైర్యానికి కారణం?

ఈ వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో టీమిండియా ఎదురులేని శక్తిగా దూసుకెళ్తొన్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు అన్ని మ్యాచ్‌ల్లో విజయం సాధించి.. ఓటమి ఎరుగని జట్టుగా ఉంది. అందరి కంటే ముందే సెమీస్‌కు అర్హత సాధించి భారత జట్టు.. తమ చివరి లీగ్‌ మ్యాచ్‌కు సిద్ధంగా ఉంది. ఈ ఆదివారం పసికూన నెదర్లాండ్స్‌తో రోహిత్‌ సేన తమ చివరి లీగ్‌ మ్యాచ్‌ ఆడనుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌, సౌతాఫ్రికా లాంటి హేమాహేమీ లాంటి జట్లను కొట్టేసిన టీమిండియాకు నెదర్లాండ్స్‌ పెద్ద సమస్య కాదు. కానీ, ఆ జట్టును కూడా తక్కువ అంచనా వేయకూడదు. ఎందుకంటే.. ఈ వరల్డ్‌ కప్‌లో నెదర్లాండ్స్‌ సౌతాఫ్రికాను ఓడించిన విషయం తెలిసిందే.

అలా అని నెదర్లాండ్స్‌ గురించి మరీ అంత ఎక్కువగా కూడా ఆలోచించాల్సిన పనిలేదు. ఎందుకంటే ప్రస్తుతం టీమిండియా ఉన్న ఫామ్‌లో నెదర్లాండ్స్‌ అద్భుతాలు చేయడం అసాధ్యం. పైగా మన జట్టు సౌతాఫ్రికాలా ఛోకర్స్‌ కాదు. అయినా కూడా నెదర్లాండ్స్‌ కెప్టెన్‌ కాన్ఫిడెన్స్‌ను మెచ్చుకోవాలి. పెద్ద పెద్ద టీమ్స్‌ను మట్టికరిపిస్తున్న టీమిండియాను చూస్తూ కూడా ఆ జట్టుపై రాణిస్తాం, ఓడిస్తామంటూ భారీ భారీ స్టేట్‌మెంట్స్‌ను పాస్‌ చేస్తున్నాడు. సరే క్రికెట్‌లో ఆ మాత్రం కాన్ఫిడెన్స్‌ ఉంటే తప్పు లేదు కానీ, ప్రస్తుతం టీమిండియాను నెదర్లాండ్స్‌ ఓడించడం దాదాపు అసాధ్యమే. సెమీస్‌కి ముందు భారత జట్టుకు మంచి ప్రాక్టీస్‌ తప్ప మరొకటి కాదు.

కాగా, నెదర్లా​ండ్స్‌ జట్టు బుధవారం ఇంగ్లండ్‌తో జరిగిన నామమాత్రపు మ్యాచ్‌లో చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌ తర్వాత డచ్‌ కెప్టెన్‌ ఎడ్వర్డ్స్ మాట్లాడుతూ.. ‘బంతితో మ్యాచ్‌ను సరిగా స్టార్ట్‌ చేయలేకపోయాం. ఆ తర్వాత మా బౌలర్లు పుంజుకున్నారు. కానీ చివర్లో మళ్లీ పట్టు తప్పిపోయింది. ఇక బ్యాటుతో మాది పాత కథే. ఇది చాలా మంచి పిచ్. మేం కొన్ని ప్రయోగాలు చేశాం కానీ.. ఇంగ్లండ్ అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. అయితే.. ఈ ఓటమిని మర్చిపోయి.. టీమిండియాపై రాణించి వారిని ఓడించే ప్రయత్నం చేస్తాం’ అంటూ పేర్కొన్నాడు. ఇక ఈ ఆదివారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో భారత్‌-నెదర్లాండ్స్‌ మధ్య ఈ వరల్డ్‌ కప్‌ టోర్నీలోనే చిట్టచివరి లీగ్‌ జరగనుంది. మరి టీమిండియా ఓడిస్తామనే ఉద్దేశంతో నెదర్లాండ్స్‌ కెప్టెన్‌ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.