రోహిత్‌ ప్లేస్‌లో పాండ్యా కెప్టెన్‌గా వస్తే.. అతనికే సపోర్ట్‌ చేశాం: బుమ్రా

Hardik Pandya, Jasprit Bumrah, IPL 2024: టీమిండియా స్టార్‌ ఆలౌండర్‌ హార్ధిక్‌ పాండ్యా ఐపీఎల్‌ 2024లో రోహిత్‌ ప్లేస్‌లో ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా వచ్చినప్పుడు అతనికే సపోర్ట్‌ చేశామంటూ బుమ్రా వెల్లడించాడు. దాని గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

Hardik Pandya, Jasprit Bumrah, IPL 2024: టీమిండియా స్టార్‌ ఆలౌండర్‌ హార్ధిక్‌ పాండ్యా ఐపీఎల్‌ 2024లో రోహిత్‌ ప్లేస్‌లో ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా వచ్చినప్పుడు అతనికే సపోర్ట్‌ చేశామంటూ బుమ్రా వెల్లడించాడు. దాని గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్ధిక్‌ పాండ్యా జీవితం.. ఐపీఎల్‌ 2024 నుంచి టీ20 వరల్డ్‌ కప్‌ 2024 మధ్య చాలా కఠినంగా సాగింది. ఐపీఎల్‌ 2024 సీజన్‌కి ముందు గుజరాత్‌ టైటాన్స్‌ నుంచి అతను తన పాత టీమ్‌ ముంబై ఇండియన్స్‌లోకి రావడం, వచ్చీ రావడంతో రోహిత్‌ శర్మ స్థానంలో కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడంతో.. ముంబై ఇండియన్స్‌ ఫ్యాన్స్ హార్ధిక్‌పై విరుచుకుపడ్డాడు. రోహిత్‌ను కాదని పాండ్యాకు కెప్టెన్సీ ఇవ్వడాన్ని వాళ్లు తట్టుకోలేకపోయారు. అక్కడి నుంచి పాండ్యాపై సోషల్‌ మీడియాలో దారుణంగా ట్రోలింగ్‌ చేశారు.. స్టేడియంలో కూడా అతను కనిపిస్తే చాలు బో అని మొత్తుకుంటూ పాండ్యాను ఘోరంగా అవమానించారు.

అలాంటి సమయంలో హార్ధిక్‌ పాండ్యాకు తామంతా మద్దతుగా ఉన్నామంటూ టీమిండియా స్టార్‌ క్రికెటర్‌, ముంబై ఇండియన్స్‌ ఆటగాడు జస్ప్రీత్‌ బుమ్రా వెల్లడించాడు. అలాంటి ట్రోలింగ్‌ను ఎవరూ ఎంకరేజ్‌ చేయరు. మేమంతా పాండ్యాకు సపోర్ట్‌ ఇచ్చాం.. కానీ, కొన్నింటిని మనం కంట్రోల్‌ చేయలేం. అవి అలా జరుగుతాయి అంతే అంటూ పాండ్యాపై జరిగిన ట్రోలింగ్‌ గురించి స్పందించాడు బుమ్రా. అయితే.. టీ20 వరల్డ్‌ కప్‌ 2024 తర్వాత సీన్‌ అంతా మారిపోయిందని అన్నాడు.

ఐపీఎల్‌ 2024 సమయంలో పాండ్యాను ట్రోల్‌ చేసిన వాళ్లే.. టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో అతని ప్రదర్శన చూసిన తర్వాత చప్పట్లు కొడుతూ మెచ్చుకున్నారని అన్నాడు. ఆ టీ20 వరల్డ్‌ కప్‌ గెలవడంతో పాండ్యా ఎంతో కీలక పాత్ర పోషించాడని, ముఖ్యంగా సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో చివరి ఓవర్‌లో పాండ్యా అద్భుతంగా బౌలింగ్‌ వేశాడని అన్నాడు. హెన్రిచ్‌ క్లాసెన్‌, డేవిడ్‌ మిల్లర్‌లను అవుట్‌ చేసి.. భారత్‌కు విజయాన్ని అందించాడని తెలిపాడు. ఇక ఆ టోర్నీలో 144 పరుగులతో పాటు 11 వికెట్ల తీసి.. ఒక ఆల్‌రౌండర్‌గా సూపర్‌ పెర్ఫార్మెన్స్‌తో తనను ధ్వేషించిన వారందరిని అభిమానులుగా మార్చుకున్నాడని బుమ్రా పేర్కొన్నాడు. మరి పాండ్యా గురించి బుమ్రా చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments