iDreamPost
android-app
ios-app

మోడ్రన్‌ డే క్రికెట్‌ అంటూ పరువుపోగొట్టుకున్న పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌!

  • Published May 31, 2024 | 4:05 PM Updated Updated May 31, 2024 | 4:05 PM

Babar Azam, Modern Day Cricket, ENG vs PAK: టీ20 వరల్డ్‌ కప్‌కి ముందు బాబర్‌ ఆజమ్‌ మోడ్రన్‌ డే క్రికెట్‌ అంటూ తన పరువును తానే తీసుకున్నాడు. మరి అదేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

Babar Azam, Modern Day Cricket, ENG vs PAK: టీ20 వరల్డ్‌ కప్‌కి ముందు బాబర్‌ ఆజమ్‌ మోడ్రన్‌ డే క్రికెట్‌ అంటూ తన పరువును తానే తీసుకున్నాడు. మరి అదేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

  • Published May 31, 2024 | 4:05 PMUpdated May 31, 2024 | 4:05 PM
మోడ్రన్‌ డే క్రికెట్‌ అంటూ పరువుపోగొట్టుకున్న పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌!

టీ20 వరల్డ్‌ కప్‌ 2024కి ముందు పాకిస్థాన్‌ జట్టుకు ఏదీ కలిసి రావడం లేదు. గట్టి ప్రిపరేషన్‌ దొరుకుతుందని ఇంగ్లండ్‌తో నాలుగు టీ20ల సిరీస్‌ ఆడిన పాకిస్థాన్‌.. రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. మరో రెండు మ్యాచ్‌లు రద్దు అయ్యాయి. ఒక విధంగా చెప్పాలంటే.. చెత్త క్రికెట్‌తో పరువుపోగొట్టుకుంది. అంతకుముందు న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన టీ20 సిరీస్‌లోనూ పాకిస్థాన్‌ టీమ్‌ పెద్ద ప్రదర్శన చేయలేదు. ఇంత దారుణమైన ప్రదర్శన చేస్తూ కూడా పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ మాట్లాడే మాటలు మరింత పరువుపోగొట్టేలా ఉన్నాయి.

ఇంగ్లండ్‌తో లండన్‌ వేదికగా జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో పాకిస్థాన్‌ చిత్తుగా ఓడింది. ఓటమి తర్వాత ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ మాట్లాడుతూ.. ‘మేం మోడ్రన్‌ క్రికెట్‌ ఆడాం.. మిగతా జట్లు ఎలా ఆడుతున్నాయో అలానే మేం కూడా ఆడాం’ అంటూ పేర్కొన్నాడు. ఇక్కడ మోడ్రన్‌ క్రికెట్‌ అంటే అర్థం ఏంటంటే.. వేగంగా ఆడటం. ముఖ్యంగా టీ20 క్రికెట్‌లో బ్యాటర్లు ఎలాగైతే ఫియర్‌లెస్‌ క్రికెట్‌ ఆడుతూ.. పవర్‌ప్లేలో ఎక్కువ రన్స్‌ చేస్తున్నారో.. తాము కూడా అలాగే చేశాం అంటూ బాబర్‌ ఆజమ్‌ పేర్కొన్నాడు. ఇంగ్లండ్‌పై నాలుగో టీ20లో పాక్‌ ఓపెనర్లుగా వచ్చిన రిజ్వాన్‌, బాబర్‌ పవర్‌ ప్లే 6 ఓవర్లో 59 పరుగులు చేశాడు. దీన్ని మోడ్రన్‌ క్రికెట్‌గా బాబర్‌ అభివర్ణించాడు. కానీ, ఇంగ్లండ్‌ పవర్‌ ప్లేలో 78 పరుగులు చేసింది. ఇది అసలైన మోడ్రన్‌ క్రికెట్‌ అంటూ బాబర్‌ను క్రికెట్‌ అభిమానులు ట్రోల్‌ చేస్తున్నారు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్థాన్‌ 19.5 ఓవర్లలో 157 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. ఓపెనర్లు రిజ్వాన్‌ 23, బాబర్‌ ఆజమ్‌ 36, వన్‌డౌన్‌లో వచ్చిన ఉస్మాన్‌ ఖాన్‌ 38 పరుగులు చేసి రాణించారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో మార్క్‌ వుడ్‌ 2, ఆదిల్‌ రషీద్‌ 2, లవింగ్‌స్టోన్‌ 2 వికెట్లు పడగొట్టి రాణించారు. ఆర్చర్‌, జోర్దాన్‌, మొయిన్‌ అలీ తలో వికెట్‌ తీసుకున్నారు. 158 పరుగుల టార్గెట్‌ను ఇంగ్లండ్‌ 15.3 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు ఫిల్‌ సాల్ట్‌ 45, జోస్‌ బట్లర్‌ 39 పరుగులతో రాణించారు. ఈ విజయంతో నాలుగు టీ20ల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది ఇంగ్లండ్‌. మరి ఈ మ్యాచ్‌ తర్వాత పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ మాట్లాడిన మోడ్రన్‌ డే క్రికెట్‌ గురించి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.