SNP
Shahid Afridi, IND vs PAK, Champions Trophy 2025: భారత క్రికెట్‌కి తామేంతో సపోర్ట్ చేశామంటూ పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ సంచలన స్టేట్‌మెంట్ ఇచ్చాడు. మరి ఆయన చేసిన సపోర్ట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Shahid Afridi, IND vs PAK, Champions Trophy 2025: భారత క్రికెట్‌కి తామేంతో సపోర్ట్ చేశామంటూ పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ సంచలన స్టేట్‌మెంట్ ఇచ్చాడు. మరి ఆయన చేసిన సపోర్ట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
SNP
అవకాశం ఉన్నా లేకపోయినా.. ఇండియన్ క్రికెట్, ఇండియన్ క్రికెటర్లపై ఏదో ఒక కామెంట్ చేస్తుంటారు పాకిస్థాన్ ఆటగాళ్లు. కారణం ఏదైనా సరే.. భారత క్రికెట్‌పై ఏదో ఒక మాట అనేస్తూ.. వార్తల్లో నిల్చే ప్రయత్నం చేస్తుంటారు. ఈ మధ్య కాలంలో ఈ ధోరణి బాగా పెరిగిపోయింది. తాజాగా పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ కూడా అలాంటి ఒక స్టేట్‌మెంట్ ఇచ్చాడు. తమను చంపుతామని బెదిరింపులు వచ్చినా కూడా మేం ఇండియా వెళ్లి క్రికెట్ ఆడి.. ఇండియన్ క్రికెట్‌కు సపోర్ట్ చేశామంటూ వెల్లడించాడు. మరి అఫ్రిదీ ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశాడో ఇప్పుడు చూద్దాం..
వచ్చే ఏడాది ప్రతిష్టాత్మక ఐసీసీ ఈవెంట్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 జరగనుంది. అది కూడా పాకిస్థాన్ వేదికగా నిర్వహించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. కానీ, టీమిండియా పాకిస్థాన్‌కు వెళ్తుందా లేదా అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. 2009 నుంచి భారత క్రికెట్ జట్టు పాకిస్థాన్‌లో పర్యటించడంలేదు. పైగా ఈ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు కూడా జరగడం లేదనే విషయం తెలిసిందే. కేవలం ఐసీసీ ఈవెంట్స్‌లోనే ఇండియా-పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయి.
ఇండియాలో వరల్డ్ కప్స్ జరిగితే పాకిస్థాన్ వచ్చి ఆడుతోంది కానీ.. పాకిస్థాన్‌లో ఏదైన టోర్నీ జరిగితే మాత్రం టీమిండియాను బీసీసీఐ పంపడం లేదు. భద్రతా కారణాల దృష్ట్యా భారత జట్టును పాకిస్థాన్‌కు పంపలేమని బీసీసీఐ చెబుతోంది. కానీ, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాత్రం.. టీమిండియా తమ దేశానికి రావాల్సిందే అంటూ పట్టుబడుతోంది. లాహోర్‌లో టీమిండియాకు గట్టి భద్రత ఏర్పాటు చేస్తామంటూ పేర్కొంది. కానీ, బీసీసీఐ మాత్రం ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించాలని, దుబాయ్ లేదా శ్రీలంకలో టీమిండియా మ్యాచ్‌లు ఏర్పాటు చేయాలంటూ ఇప్పటికే ఐసీసీకి బీసీసీఐ సూచించింది. అయితే.. పీసీబీ మాత్రం హైబ్రిడ్ మోడల్‌కు అస్సలు ఒప్పుకోవడం లేదు. ఈ క్రమంలోనే పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు.. టీమిండియా తన దేశంలో పర్యటించాలని కోరుకుంటున్నారు. అందుకే అఫ్రిదీ సైతం.. తమకు కూడా బెదిరింపులు వచ్చినా.. ఇండియాకు వచ్చిన క్రికెట్ ఆడి.. ఇండియన్ క్రికెట్ ఎదుగుదలకు సపోర్ట్ చేశామని, అలాగే ఇండియా కూడా ఛాంపియన్స్ ట్రోఫీ కోసం తమ దేశానికి రావాలని అన్నాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
We supported India 🇮🇳 and played cricket there despite threats, if they don’t want relations to improve them don’t come for Champions Trophy : Shahid Afridi pic.twitter.com/1JTqFRF9wc
— ٰImran Siddique (@imransiddique89) July 29, 2024