SNP
Wasim Jaffer, Punjab Kings: ఐపీఎల్ 2025కి ముందు పంజాబ్ కింగ్స్ తమ హెడ్ కోచ్‌గా భారత మాజీ క్రికెటర్‌ను నియమించుకోనుంది. మరి ఆ క్రికెటర్ ఎవరో ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
Wasim Jaffer, Punjab Kings: ఐపీఎల్ 2025కి ముందు పంజాబ్ కింగ్స్ తమ హెడ్ కోచ్‌గా భారత మాజీ క్రికెటర్‌ను నియమించుకోనుంది. మరి ఆ క్రికెటర్ ఎవరో ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
SNP
ఐపీఎల్ 2025 ఆరంభానికి ఇంకా చాలా సమయం ఉన్నా.. అన్ని ఫ్రాంచైజ్‌లు తమ టీమ్స్‌ను రీబిల్డ్ చేసుకోవడంపై ఫోకస్ పెట్టాయి. ఐపీఎల్ 2024లో దారుణంగా విఫలమైన కొన్ని జట్లు అయితే.. పూర్తిగా ప్రక్షాళన చేసి.. కొత్త ఆటగాళ్లతో పాటు, కొత్త కోచింగ్ స్టాఫ్‌తో ఐపీఎల్ 2025 బరిలోకి దిగాలని భావిస్తున్నాయి. ముఖ్యంగా పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజ్ తన హెడ్ కోచ్‌ను మారుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆ జట్టు హెడ్ కోచ్‌గా ఉన్న ట్రెవర్ బేలిస్‌ను ఇంటికి పంపి.. అతని స్థానంలో ఓ దిగ్గజ క్రికెటర్‌ను బరిలోకి దింపేందుకు చూస్తోంది.
టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్ మాజీ క్రికెటర్ వసీం జాఫర్‌ను తమ హెడ్ కోచ్‌గా నియమించుకునేందుకు పంజాబ్ కింగ్స్ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. జాఫర్ గతంలో పంజాబ్ కింగ్స్‌కు బ్యాటింగ్ కోచ్‌గా కూడా చేశాడు. అయితే.. ఐపీఎల్ ఆరంభ ఏడాది 2008 నుంచి ఉన్నా.. పంజాబ్ కింగ్స్ ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ గెలవలేదు. ఎంతో మంది కెప్టెన్లను, కోచ్‌లను మార్చినా.. టీమ్ జెర్సీ, లోగో, పేరు.. ఇలా ఎన్ని మార్పులు చేసినా.. పంజాబ్ తలరాత మాత్రం మారడం లేదు. కానీ, ఐపీఎల్ 2025లో ఎలాగైనా కప్పు కొట్టాలనే పట్టుదలతో ఆ టీమ్ మేనేజ్‌మెంట్ ఉన్నట్లు తెలుస్తోంది.
అందుకోసం చేయాల్సిన మార్పులు, తీసుకోవాల్సిన చర్యలను ఇప్పటి నుంచే వేగవంతం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే జాఫర్‌ను హెడ్ కోచ్‌గా నియమించనున్నట్లు క్రికెట్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే.. పంజాబ్ అనే కాదు.. లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ కూడా హెడ్ కోచ్‌లను మార్చి, వారి స్థానంలో కొత్త హెడ్ కోచ్‌లను నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్‌గా టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్‌ను తీసుకుంటారని కూడా వార్తలు వస్తున్నాయి. ఆ విషయం పక్కనపెడితే.. పంజాబ్ హెడ్ కోచ్‌గా వసీం జాఫర్ వస్తే ఎలా ఉంటుందో.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Former India opener Wasim Jaffer set to be named as Punjab Kings head coach
📷: IPL#IPLT20 #IPL2025 #PBKS #WasimJaffer #PunjabKings pic.twitter.com/N6dm1oEklC
— SportsTiger (@The_SportsTiger) July 26, 2024