iDreamPost
android-app
ios-app

శత్రుదుర్బేధ్యంగా భారత టీ20 వరల్డ్‌ కప్‌ టీమ్‌! ఇతన్ని సెలెక్టర్‌ చేయాలనే డిమాండ్‌!

  • Published Apr 30, 2024 | 11:12 AM Updated Updated Apr 30, 2024 | 11:12 AM

Wasim Jaffer, T20 World Cup 2024: టీ20 వరల్డ్‌ కప్‌ 2024 దగ్గరికి వస్తుండటంతో.. టీమిండియా ఎంపిక ఎలా ఉంటుందనే విషయంపై అందరిలో ఆందోళన నెలకొంది. ఈ టైమ్‌లో అదరిపోయే స్క్వౌడ్‌ను ప్రకటించాడు టీమిండియా మాజీ క్రికెటర్‌. ఆ టీమ్‌ను ఓ సారి చూద్దాం..

Wasim Jaffer, T20 World Cup 2024: టీ20 వరల్డ్‌ కప్‌ 2024 దగ్గరికి వస్తుండటంతో.. టీమిండియా ఎంపిక ఎలా ఉంటుందనే విషయంపై అందరిలో ఆందోళన నెలకొంది. ఈ టైమ్‌లో అదరిపోయే స్క్వౌడ్‌ను ప్రకటించాడు టీమిండియా మాజీ క్రికెటర్‌. ఆ టీమ్‌ను ఓ సారి చూద్దాం..

  • Published Apr 30, 2024 | 11:12 AMUpdated Apr 30, 2024 | 11:12 AM
శత్రుదుర్బేధ్యంగా భారత టీ20 వరల్డ్‌ కప్‌ టీమ్‌! ఇతన్ని సెలెక్టర్‌ చేయాలనే డిమాండ్‌!

ఈ ఏడాది జూన్‌లో వెస్టిండీస్‌, అమెరికా సంయుక్త వేదికగా టీ20 వరల్డ్‌ కప్‌ 2024 ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీ కోసం ఇప్పటికే అన్ని టీమ్స్‌ రెడీ అయిపోతున్నాయి. న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు ఇప్పటికే తమ వరల్డ్‌ కప్‌ టీమ్‌ను అలాగే జెర్సీని కూడా ప్రకటించింది. అలాగే సౌతాఫ్రికా క్రికెట్‌ బోర్డు కూడా తమ వరల్డ్‌ కప్‌ జెర్నీని రివీల్‌ చేసింది. ప్రస్తుతం ఇండియాలో ఐపీఎల్‌ జోరుగా సాగుతోంది. ఒక వైపు ఐపీఎల్‌ క్రికెట్‌ అభిమానులకు వినోదం పంచుతూ.. దూసుకెళ్తుంటే. మరోవైపు టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, భారత చీఫ్‌ సెలెక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ వరల్డ్‌ కప్‌ టీమ్‌ ఎంపికపై ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే చాలా మంది మాజీ క్రికెటర్లు తమ వరల్డ్‌ కప్‌ టీమ్స్‌ అంచనాలను వెల్లడిస్తున్నారు. టీమిండియా మాజీ క్రికెటర్‌ వసీం జాఫర్‌ సైతం తన వరల్డ్‌ కప్‌ టీమ్‌ను ప్రకటించాడు.

15 మందితో కూడిన స్క్వౌడ్‌తో టీ20 వరల్డ్‌ కప్‌ టీమ్‌ను ప్రకటించాడు. ఈ టీమ్‌పై సోషల్‌ మీడియాలో మంచి స్పందన వస్తోంది. వసీం జాఫర్‌ సెలెక్షన్‌ అదిరిపోయిందని, ఇలాంటి టీమ్‌తో కనుక టీమిండియా వరల్డ్‌ కప్‌ వేటకు వెళ్తే కప్పు కచ్చితంగా మనదే అంటూ క్రికెట్‌ అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా పేర్కొంటున్నారు. వసీం జాఫర్‌ను భారత చీఫ్‌ సెలెక్టర్‌గా నియమించాలనే డిమాండ్‌కూడా వ్యక్తం అవుతుంది. మరి జాఫర్‌ ప్రకటించిన టీమ్‌లో ఎవరెవరు ఉన్నారో ఇప్పుడు చూద్దాం.. కెప్టెన్‌ రోహిత్‌ శర్మను ప్రకటించాడు. జాఫర్‌. ఐదుగురు బ్యాటర్లు, ముగ్గురు ఆల్‌రౌండర్లు, ఇద్దరు వికెట్‌ కీపర్లు, ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు పేసర్లతో టీమ్‌ సమతుల్యంగా ఉంది. రోహిత్‌ శర్మతో పాటు యశస్వి జైస్వాల్‌, విరాట్‌ కోహ్లీ, రింకూ సింగ్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ను బ్యాటర్లుగా ఎంపిక చేశాడు.

అలాగే ఆల్‌రౌండర్ల జాబితాలో హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, శివమ్‌ దూబేలను టీమ్‌లోకి తీసుకున్నాడు. ఇక ఇద్దరు వికెట్‌ కీపర్లు కమ్‌ బ్యాటర్లుగా రిషభ్‌ పంత్‌, సంజు శాంసన్‌లను ఎంపిక చేశాడు. యుజ్వేంద్ర చాహల్‌, కుల్దీప్‌ యాదవ్‌లను స్పిన్నర్ల కోటాలో ఎంపిక చేసి.. కుల్‌చా కాంబినేషన్‌ను చాలా కాలం తర్వాత గుర్తుచేశాడు. ఇక ముగ్గురు పేసర్లుగా జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్‌ సిరాజ్‌, అర్షదీప్‌ సింగ్‌ను స్క్వౌడ్‌లోకి తీసుకున్నాడు. ఈ 15 మంది నుంచి ప్లేయింగ్‌ ఎలెవన్‌ను ఎంపిక చేయడం చాలా తేలిక అవుతుందని, టీమ్‌ కూడా స్ట్రాంగ్‌ ఉంటుందని క్రికెట్‌ అభిమానులు భావిస్తున్నారు. అయితే.. కొంతమంది క్రికెట్‌ ఫ్యాన్స్‌ మాత్రమ ఫామ్‌లో లేని పాండ్యా, జడేజాలను ఎంపిక చేయడంపై విమర్శలు గుప్పిస్తున్నారు. రియాన్‌ పరాగ్‌కు అవకాశం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. మరి వసీం జాఫర్‌ ప్రకటించిన భారత టీ20 వరల్డ్‌ కప్‌ టీమ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.