SNP
Wasim Akram, IND vs PAK, T20 World Cup 2024: ఇండియాపై ఓటమి తర్వాత పాక్ జట్టుపై విమర్శల వర్షం కురుస్తోంది. తాజాగా పాక్ దిగ్గజ క్రికెటర్ తమ సొంత జట్టులోని కొంతమంది ఆటగాళ్ల పరువుతీసేలా మాట్లాడాడు. దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం..
Wasim Akram, IND vs PAK, T20 World Cup 2024: ఇండియాపై ఓటమి తర్వాత పాక్ జట్టుపై విమర్శల వర్షం కురుస్తోంది. తాజాగా పాక్ దిగ్గజ క్రికెటర్ తమ సొంత జట్టులోని కొంతమంది ఆటగాళ్ల పరువుతీసేలా మాట్లాడాడు. దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం..
SNP
టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓటమిని ఆ దేశ మాజీలు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆదివారం న్యూయార్క్‌లోని నసావు క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో పాక్ 6 పరుగులు తేడాతో భారత్ చేతిలో ఓటమి పాలైన విషయం తెలిసిందే. టీమిండియాను 119 పరుగుల స్వల్ప స్కోర్‌కే ఆలౌట్ చేసినా కూడా పాక్ మ్యాచ్ గెలవలేకపోయింది. టీమిండియా బౌలింగ్ ఎటాక్ ముందు.. పాకిస్థాన్ బ్యాటింగ్ లైనప్ అసలు నిలువలేకపోయింది. ఒక్క రిజ్వాన్ తప్పితే.. ఏ ఒక్క పాక్ బ్యాటర్ కూడా భారత బౌలింగ్ ఎటాక్‌ను సమర్థవంతంగా ఆడలేదు. దాంతో.. 20 ఓవర్లు ఆడినా కేవలం 120 పరుగులు చేయలేక ఓటమి చవిచూసింది పాకిస్థాన్. ఈ ఓటమిని పాక్ క్రికెట్ అభిమానులు, మాజీలు అవమానంగా భావిస్తున్నారు.
ఈ క్రమంలోనే పాకిస్థాన్ దిగ్గజ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ క్రికెట్ టీమ్‌లో కొంతమంది పదేళ్లుగా క్రికెట్ ఆడుతున్నా.. వారికి అసలు గేమ్ ప్లాన్ లేదని, క్రికెట్ ఎలా ఆడాలో కూడా తెలియదంటూ పాక్ ఆటగాళ్ల పరువుతీసేలా మాట్లాడాడు. ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్‌లో పాక్ బ్యాటర్లు గేమ్ ప్లాన్ లేకుండా ఆడి మ్యాచ్‌ను పొగొట్టారంటూ మండిపడ్డాడు. ముఖ్యంగా ఓపెనర్ మొహమ్మద్ రిజ్వాన్, ఇఫ్తికార్ అహ్మద్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. బాగా ఆడకుంటే తమకు ఏం అవుతుందిలే అనే ఫీలింగ్‌లో పాక్ ఆటగాళ్లు ఉన్నారని, కోచ్‌లను కాకుండా టీమ్‌ను మార్చిపడేయాలని అక్రమ్ పేర్కొన్నాడు.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. వికెట్ల కోసమే బుమ్రాను రంగంలోకి దింపాడని, ఆ విషయం రిజ్వాన్‌కు కూడా తెలసని.. కానీ, బుమ్రాను జాగ్రత్తగా ఆడకుండా, అతని బౌలింగ్‌లో షాట్లకు వెళ్లి వికెట్ సమర్పించుకున్నాడని, బుమ్రాను కాస్త జాగ్రత్తగా ఒళ్లు దగ్గరపెట్టుకుని ఆడి ఉంటే.. మ్యాచ్ ఫలితం మరోలా ఉండేదని అక్రమ్ పేర్కొన్నాడు. రిజ్వాన్ పదేళ్ల నుంచి టీమ్‌లో ఉన్నాడని.. బుమ్రా బౌలింగ్ చేస్తున్న కీలక సమయంలో కాస్త జాగ్రత్తగా ఆడి వేరే బౌలార్‌ను ఎటాక్ చేయాలనే గేమ్ ప్లాన్ కూడా అతని తెలియదని అన్నాడు. ఇక ఇఫ్తికార్ అహ్మద్‌కు లెగ్ సైడ్ తప్పింతే ఇంకేం ఆడటం రాదని ఎద్దేవా చేశాడు. వసీం అక్రమ్ చేసిన వ్యాఖ్యలపై పాక్ క్రికెట్ అభిమానులు కూడా ఏకీభవిస్తున్నారు. మరి అక్రమ్ కామెంట్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Wasim Akram said “These players have taken Pakistan cricket for granted. I want to support this team, but it’s getting embarrassing now. We need to get rid of this lot, and bring in new players. They think they can’t be replaced” 🇵🇰💔💔#PAKvsIND #INDvsPAK #T20WorldCup pic.twitter.com/9cmvfZ0vij
— Farid Khan (@_FaridKhan) June 10, 2024