SNP
ఐపీఎల్‌తో పాకిస్థాన్ సూపర్ లీగ్‌ను పలువురు పోలుస్తూ ఉంటారు. కొన్ని మంది పాక్ ఆటగాళ్లు అయితే.. ఏకంగా పీఎస్‌ఎల్‌ను పెద్ద లీగ్ అంటూ ఉంటారు. వారందరికీ దిమ్మతిరిగేలా పాక్ దిగ్గజ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
ఐపీఎల్‌తో పాకిస్థాన్ సూపర్ లీగ్‌ను పలువురు పోలుస్తూ ఉంటారు. కొన్ని మంది పాక్ ఆటగాళ్లు అయితే.. ఏకంగా పీఎస్‌ఎల్‌ను పెద్ద లీగ్ అంటూ ఉంటారు. వారందరికీ దిమ్మతిరిగేలా పాక్ దిగ్గజ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
SNP
క్రికెట్ ప్రపంచంలో ఐపీఎల్ ఒక సంచలనం. ఎన్నో విశేషాలకు, వివాదాలకు, అద్భుతాలకు కేంద్ర బిందువు. స్టార్ ఆటగాళ్లపై కోట్ల వర్షం కురిపించడంతో పాటు కొత్త ఆటగాళ్లను ప్రపంచానికి పరిచయం చేసే గొప్ప స్టేజ్. అలాగే వ్యాపారులకు కనక వర్షం కురిపిస్తూ.. బీసీసీఐకి కోట్లు పొదిగే బంగారు బాతు. ఇలా ఐపీఎల్ అంటే.. సంచలనాలకు కేరాఫ్ అడ్రస్. రిచ్ క్యాష్ లీగ్‌గా ఐపీఎల్‌కు పేరుంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా టీ20 లీగ్స్‌లో ఐపీఎల్ నంబర్ వన్‌గా ఉంది. ఇలాంటి లీగ్‌లో ఆడేందుకు ప్రపంచంలోని స్టార్ ఆటగాళ్లంతా పోటీ పడుతుంటారు. ఇక యువ క్రికెటర్లు అయితే ఐపీఎల్‌లో ఆడటం ఒక గోల్‌గా పెట్టుకుంటారంటే అతిశయోక్తి కాదు.
ఐపీఎల్‌కి ఉన్న ఫాలోయింగ్ చూసి.. ప్రపంచంలో చాలా టీ20 లీగ్స్ పుట్టుకొచ్చాయి. ఎన్ని వచ్చిన ఐపీఎల్‌ను కొట్టలేకపోయాయి. ఐపీఎల్ సక్సెస్ చూపి.. కరేబియన్ ప్రీమియర్ లీగ్, లంక ప్రీమియర్ లీగ్, పాకిస్థాన్ సూపర్ లీగ్, సౌతాఫ్రికా టీ20 లీగ్, యూఏఈ వేదికగా ఇంటర్నేషనల్ లీగ్ టీ20, ఇంగ్లండ్ ది హండ్రెడ్ ఇలా చాలా లీగ్స్ ప్రారంభం అయ్యాయి. కానీ, ఏ లీగ్ కూడా కనీసం ఐపీఎల్‌లో సగం కూడా కాలేకపోయాయి. అది ఐపీఎల్ రేంజ్. అయినా కూడా కొంతమంది పాకిస్థాన్ ఆటగాళ్లు.. ఐపీఎల్‌ను తక్కువ చేసి మాట్లాడుతూ.. తమ పాకిస్థాన్ సూపర్ లీగ్ గొప్పదంటూ ప్రగల్భాలు పలుకుతుంటారు. కానీ, పాకిస్థాన్ దిగ్గజ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ మాత్రం అలా హెచ్చులకు పోకుండా వాస్తవాలను ఒప్పుకున్నాడు.
అక్రమ్ మాట్లాడుతూ.. ఐపీఎల్, పీఎస్‌ఎల్‌ను పోల్చడం సరికాదు. ఐపీఎల్ చాలా పెద్ద లీగ్, అలాగే పీఎస్‌ఎస్ సైతం పాకిస్థాన్‌కు చాలా పెద్ద లీగ్. నేను ఐపీఎల్‌లో, అలాగే పీఎస్‌ఎల్‌లోనూ పనిచేశారు. ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే.. ఐపీఎల్ చాలా పెద్దది., పీఎస్‌ఎల్.. పాకిస్థాన్‌కి మినీ ఐపీఎల్ అంటూ వసీం అక్రమ్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్‌లో వసీం అక్రమ్ కోల్‌కత్తా నైట్ రైడర్స్‌కు బౌలింగ్ కోచ్‌గా పనిచేసిన విషయం తెలిసిందే. అలాగే పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో కూడా పలు టీమ్స్‌కు కోచ్‌గా పనిచేశాడు. మరి వసీం అక్రమ్ లాంటి దిగ్గజ క్రికెటరే పీఎస్‌ఎల్ కంటే ఐపీఎల్ పెద్దదని ఒప్పుకున్న తర్వాత అయినా సరే కొంతమంది అర్థంలేని కామెంట్స్ చేయడం ఆపేస్తారని ఆశిద్దాం. మరి అక్రమ్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
“I’ve been part of both the PSL and IPL. Comparing them is tough because the IPL is huge, while the PSL is like a smaller version in Pakistan.” – Wasim Akram #WasimAkram #IPL #PSL pic.twitter.com/i2of4e1Sjh
— Anas Chudhary (@anas_chudharyy) December 30, 2023