వన్డే ప్రపంచ కప్ మరొకొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. కానీ అందరి చూపు మాత్రం అక్టోబర్ 14వ తారీఖు మీదే ఉంది. ఆ రోజున అహ్మదాబాద్ వేదికగా.. దాయాదుల పోరు జరగబోతోంది. ఇండియా-పాక్ మ్యాచ్ అంటేనే ఓ యుద్దాన్ని తలపిస్తుంది అనడంలో సందేహం లేదు. ఇక ఈ మ్యాచ్ కోసం ఇరుదేశాల ప్రేక్షకులే కాకుండా.. యవత్ ప్రపంచం ఎదురుచూస్తోంది. ఈ క్రమంలోనే పాక్ జట్టు పరువును నిలబెట్టి మరీ తీశాడు పాక్ దిగ్గజం వకార్ యూనిస్. ప్రపంచ కప్ లో ఇదే అత్యంత ప్రాధాన్యత కలిగిన మ్యాచ్ గా వకార్ యూనిస్ అభిప్రాయ పడ్డాడు. పాక్ జట్టు టీమిండియా కంటే వీకైన జట్టు అని చెప్పుకొచ్చాడు.
పాక్ దిగ్గజం, మాజీ ఆటగాడు వకార్ యూనిస్ సొంత జట్టు పరువును నిలువునా తీశాడు. వరల్డ్ కప్ లో భాగంగా తర్వలో జరగబోయే ఇండియా-పాక్ మ్యాచ్ గురించి ఓ ఛానల్ లో మాట్లాడాడు వకార్ యూనిస్. అతడు మాట్లాడుతూ..”వరల్డ్ కప్ లో టీమిండియా జట్టుతో పోల్చితే.. పాక్ జట్టు చాలా బలహీనమైన టీమ్. భారత్ తో పాక్ టీమ్ సరితూగదు. అయితే జాగ్రత్తగా ఆడితే.. టీమిండియాను ఓడించడం కష్టమేమి కాదు. టీమిండియా కంటే పాక్ చాలా వీక్ టీమ్ కాబట్టి ఆచి తూచి ఆడితేనే గెలుస్తుంది. పైగా సొంత దేశంలో ఆడటం భారత్ కు బలం. లక్షమంది సొంత అభిమానుల మధ్య మ్యాచ్ ఆడటం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. అభిమానుల అరుపులు, ఈలలు ఆటగాళ్లను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తాయి” అంటూ చెప్పుకొచ్చాడు వకార్ యూనిస్. ఇక పాక్ స్టార్ బౌలర్ నసీమ్ షా రూపంలో పాక్ కు కోలుకోలేని దెబ్బ తగిలిందని వకార్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుత కాలంలో టీమిండియా వరల్డ్ క్లాస్ టీమ్ గా కనబడుతోందని వకార్ కితాబిచ్చాడు. మరి టీమిండియా కంటే పాక్ వీట్ టీమ్ అన్న వకార్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.