iDreamPost
android-app
ios-app

కోహ్లీని 5 బాల్స్ లో ఔట్ చేస్తా.. పసికూన బౌలర్ పిల్లబచ్చా మాటలు!

  • Author Soma Sekhar Published - 07:18 PM, Fri - 29 September 23
  • Author Soma Sekhar Published - 07:18 PM, Fri - 29 September 23
కోహ్లీని 5 బాల్స్ లో ఔట్ చేస్తా.. పసికూన బౌలర్ పిల్లబచ్చా మాటలు!

మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న క్రికెట్ మహా సంగ్రామానికి జట్లు సిద్దమవుతున్నాయి. ఇప్పటికే దాదాపు వరల్డ్ కప్ లో పాల్గొనే అన్ని జట్లు తమ తమ సభ్యుల పేర్లను ప్రకటించాయి. పనిలోపనిగా ప్రాక్టీస్ కూడా మెుదలు పెట్టాయి. ఇక ఈ మెగాటోర్నీకి నెలరోజుల ముందుగానే భారత గడ్డపై అడుగుపెట్టింది పసికూన నెదర్లాండ్స్ టీమ్. తమ ప్లాన్ లో భాగంగా భారత ఆటగాళ్లను నెట్ బౌలర్లుగా ఉపయోగించుకుంటూ.. ఇక్కడి పరిస్థితులను అర్దం చేసుకునే పనిలో పడింది డచ్ టీమ్. కాగా.. నవంబర్ 12న టీమిండియాతో తలపడబోతోంది నెదర్లాండ్స్ టీమ్. ఈ క్రమంలోనే టీమిండియా రన్ మెషిన్ ను 5 బంతుల్లో అవుట్ చేస్తానని హెచ్చరించాడు నెదర్లాండ్స్ ఆల్ రౌండర్ లోగాన్ వాన్ బీక్. ప్రస్తుతం అతడు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

వరల్డ్ కప్ 2023 క్వాలిఫయర్స్ లో నెదర్లాండ్స్ అదరగొట్టింది. వెస్టిండీస్ ను ఇంటికి పంపించి.. వరల్డ్ కప్ లో బెర్త్ ను సంపాదించింది. ఇక ప్రపంచ కప్ కోసం నెలరోజుల ముందుగానే టీమిండియాలో అడుగుపెట్టింది డచ్ టీమ్. భారత ఆటగాళ్లను నెట్ బౌలర్లుగా ఉపయోగించుకుంటూ.. ఇక్కడి పరిస్థితులను పరిశీలిస్తోంది. కాగా.. వరల్డ్ కప్ లో భాగంగా నవంబర్ 12న బెంగళూరులో టీమిండియాతో తలపడబోతోంది నెదర్లాండ్స్ టీమ్. ఇక ఈ మ్యాచ్ కోసం డచ్ టీమ్ ఇప్పటి నుంచే ప్రత్యేక వ్యూహాలను రచిస్తున్నట్లు ఆ జట్టు ఆల్ రౌండర్ లోగాన్ వాన్ బీక్ చెప్పుకొచ్చాడు. మరీ ముఖ్యంగా కింగ్ విరాట్ కోహ్లీ కోసం పక్కా ప్లాన్స్ రెడీ చేస్తున్నాను అంటూ పిల్లబచ్చా మాటలు మాట్లాడాడు.

“విరాట్ కోహ్లీని అవుట్ చేయడానికి ప్రణాళికలు రెడీ చేశాము. అతడిని కేవలం 5 బంతుల్లోనే అవుట్ చేస్తాను. తొలి రెండు బాల్స్ ఔట్ స్వింగ్ వేసి.. ఆ తర్వాత బాల్ స్లో కట్టర్ వేస్తాను. అయితే ఈ బాల్ ను కోహ్లీ ఫోర్ కొడతాడు. అప్పుడు నేను చికాకు పడ్డట్లు నటించి.. మా కెప్టెన్ తో మాట్లాడి, ఫీల్డింగ్ వైపు చూపిస్తాను. కానీ ఆ వైపు బాల్ వెయ్యను. వేరే వైపు వేసిన బాల్ ను కూడా కోహ్లీ ఫోర్ కొడతాడు. ఆ తర్వాత బంతికి నేను దేవుణ్ణి మెుక్కి.. కోహ్లిని ఔట్ చేస్తాను” అంటూ తన ప్లాన్ ను పూసగుచ్చినట్లు చెప్పాడు లోగాన్ వాన్ బీక్.

ప్రస్తుతం ఇతడి వ్యాఖ్యలు వైరల్ గా మారడంతో.. సోషల్ మీడియా వేదికగా డచ్ ఆల్ రౌండర్ ను ట్రోల్ చేస్తున్నారు. పసికూన జట్లకు బౌలింగ్ చేసినంత ఈజీ కాదు.. విరాట్ కు బౌలింగ్ చేయడం. అతడు మీదపడితే ఓ యుద్ధమే.. అంటూ డచ్ బౌలర్ కు వార్నింగ్ ఇస్తున్నారు విరాట్ ఫ్యాన్స్. ఇక మరికొందరు ఇలాంటి పిల్లబచ్చా మాటలు విరాట్ ఎన్ని విని ఉంటాడు అంటూ సోషల్ మీడియా వేదికగా రాసుకొస్తున్నారు. మరి 5 బాల్స్ లో విరాట్ ను ఔట్ చేస్తానన్న డచ్ ఆల్ రౌండర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet