SNP
SNP
శ్రీలంక స్టార్ స్పిన్నర్ వనిందు హసరంగా అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ.. షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు వెల్లడించాడు. వన్డే, టీ20 ఫార్మాట్లలో ఎక్కువ కాలం కొనసాగేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. 2020లో అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన హసరంగా పెద్దగా టెస్ట్ క్రికెట్ ఆడలేదు. ఆడిన కొన్ని మ్యాచ్‌ల్లోనూ పెద్దగా ప్రభావం చూపలేదు. అయితే.. లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్‌లో మాత్రం అతనో ప్రమాదకరమైన స్పిన్నర్‌గా, ఆల్‌రౌండర్‌గా ఉన్నాడు.
తన కెరీర్‌లో కేవలం నాలుగు టెస్టులు మాత్రమే ఆడిన హసరంగా.. 4 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. అది కూడా ఒక్క మ్యాచ్‌లోనే తీశాడు. అలాగే 196 పరుగులు కూడా చేశాడు. అందులో ఒక హాఫ్ సెంచరీ ఉంది. టెస్టుల కంటే పరిమిత ఓవర్ల క్రికెట్‌లోనే హసరంగా చాలా ఎఫెక్టివ్‌గా ఉన్నాడు. దాన్నే మరింత మెరుగ్గా చేసేందుకు సాంప్రదాయ క్రికెట్‌కు పూర్తిగా గుడ్‌బై చెప్పాడు. పైగా మరో రెండు నెలల్లో వన్డే వరల్డ్ కప్ ఉండటంతో హసరంగా దానిపై ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. గతేడాది జరిగిన ఆసియా కప్‌లో శ్రీలంక ఛాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఆసియా కప్ కోసం లంక సిద్ధం అవుతుంది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగుతున్న లంక.. టైటిల్‌ను నిలబెట్టుకుని.. వన్డే వరల్డ్ కప్‌కు రెట్టించిన ఉత్సాహంతో వెళ్లాలని భావిస్తోంది.
ఆ ప్రణాళికలో భాగంగా హసరంగా సైతం తన కెరీర్‌ను పూర్తిగా పరిమిత ఓవర్ల క్రికెట్‌కు కేటాయించాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే.. టెస్టులతో పోల్చుకుంటే.. హసరంగా టీ20, వన్డేల్లోనే మంచి రికార్డులు కలిగి ఉన్నాడు. 2017లో జింబాబ్వేతో జరిగిన వన్డేతో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన హసరంగా.. మూడేళ్ల తర్వాత టెస్ట్ టీమ్‌లోకి వచ్చాడు. అయితే.. ఇప్పటి వరకు హసరంగా 48 వన్డేలే, 58 టీ20లు ఆడాడు. వన్డేల్లో 832 పరుగులు, 67 వికెట్లు, టీ20ల్లో 533 రన్స్, 91 వికెట్లు ఉన్నాయి. ఇక ఐపీఎల్‌లోనూ హసరంగా ఆడుతున్న విషయం తెలిసిందే. ఆర్సీబీకి ఆడుతున్న హసరంగా ఇప్పటి వరకు 26 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 72 పరుగులు, 35 వికెట్లు సాధించాడు. మరి హసరంగా టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Wanindu Hasaranga…
.
. #WaninduHasaranga #TestCricket #retirement pic.twitter.com/pzuBU0Pzt7— RVCJ Sports (@RVCJ_Sports) August 15, 2023
ఇదీ చదవండి: వన్డే క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డ్! 450 పరుగల తేడాతో భారీ విజయం