iDreamPost
android-app
ios-app

టీమిండియాకు కోచ్ కావడం లక్ష్మణ్ కు ఇష్టం లేదా? ఎందుకు అప్లై చేసుకోట్లేదు?

  • Published May 15, 2024 | 1:01 PM Updated Updated May 15, 2024 | 1:01 PM

టీమిండియా లెజెండ్ వీవీఎస్ లక్ష్మణ్ సైతం అప్లై చేసుకునేందుకు విముఖత చూపుతున్నాడని సమాచారం. దాంతో కోచ్ పదవి లక్ష్మణ్ కు ఇష్టం లేదా? కారణం ఏంటి? పూర్తి వివరాల్లోకి వెళితే..

టీమిండియా లెజెండ్ వీవీఎస్ లక్ష్మణ్ సైతం అప్లై చేసుకునేందుకు విముఖత చూపుతున్నాడని సమాచారం. దాంతో కోచ్ పదవి లక్ష్మణ్ కు ఇష్టం లేదా? కారణం ఏంటి? పూర్తి వివరాల్లోకి వెళితే..

టీమిండియాకు కోచ్ కావడం లక్ష్మణ్ కు ఇష్టం లేదా? ఎందుకు అప్లై చేసుకోట్లేదు?

టీ20 వరల్డ్ కప్ 2024 తర్వాత.. ప్రస్తుతం టీమిండియాకు హెడ్ కోచ్ గా వ్యవహరిస్తున్న రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగుస్తుంది. ఈ నేపథ్యంలో భారత జట్టుకు కొత్త కోచ్ ను వెతికే పనిలో పడింది బీసీసీఐ. అందులో భాగంగానే హెడ్ కోచ్ పదవికి దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రకటన కూడా జారీ చేసింది. అయితే ఈ పదవి కోసం మళ్లీ ద్రవిడ్ అప్లై చేసుకునే ఉద్దేశంలో లేడని తెలుస్తోంది. దాంతో కోత్త కోచ్ గా ఎవరు వస్తారు? అన్న ఆసక్తి అందరిలో నెలకొంది. అయితే హెడ్ కోచ్ పదవికి టీమిండియా లెజెండ్ వీవీఎస్ లక్ష్మణ్ సైతం అప్లై చేసుకునేందుకు విముఖత చూపుతున్నాడని సమాచారం. దాంతో కోచ్ పదవి లక్ష్మణ్ కు ఇష్టం లేదా? కారణం ఏంటి? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

రాహుల్ ద్రవిడ్ తర్వాత అతడి వారసత్వాన్ని కొనసాగిస్తూ.. టీమిండియాకు కొత్త కోచ్ గా ఎవరొస్తారా? అని అందరూ ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు. ఈ క్రమంలో తెరపైకి పలువురి దిగ్గజాల పేర్లు వస్తున్నాయి. అందులో ప్రధానంగా గౌతమ్ గంభీర్, ఆశిష్ నెహ్రా, సౌరవ్ గంగూలీ, స్టీఫెన్ ఫ్లెమింగ్, వీవీఎస్ లక్ష్మణ్, జస్టిన్ లాంగర్ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే వీరిలో బీసీసీఐ మాత్రం కివీస్ లెజెండ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. హెడ్ కోచ్ కోసం బీసీసీఐ ప్రకటన విడుదల చేసినప్పటికీ.. భారత దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్ మాత్రం ఇంకా అప్లై చేసుకోలేదు. దాంతో అతడికి కోచ్ పదవి అంటే ఇష్టం లేదేమో అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Laxman does not want to be the coach of Team India

టీమిండియా హెడ్ కోచ్ పదవికి ఫుల్ డిమాండ్ ఉంటుందని అంతా భావించారు. కానీ పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. కోచ్ పదవికి అప్లై చేసుకోవడానికి టీమిండియా మాజీలు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. దరఖాస్తులు చేసుకునే విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు. కాగా.. టీమిండియా హెడ్ కోచ్ పదవిపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు భారత దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్. అందుకే ఇంకా అప్లై చేసుకోలేదు. అతడు దరఖాస్తు చేసుకునేందుకు ఇష్టపడటం లేదని తెలుస్తోంది. అయితే ఈ హైదరాబాదీ కోచ్ పదవిపై విముఖత చూపడానికి ప్రత్యేక కారణాలు అంటూ ఏవీ తెలియరావడం లేదు. బహుశా వ్యక్తిగత కారణాలు, ఒత్తిడిని తట్టుకోవడం ఎందుకు? ప్రస్తుతం ఒక పదవి ఉంది కదా.. ఇంకో పదవి ఎందుకు? అని లక్ష్మణ్ అనుకుని ఉంటాడని ప్రముఖులు తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. కాగా.. గతంలో టీమిండియాకు తాత్కాలిక హెడ్ కోచ్ గా వ్యవహరించిన అనుభవం వీవీఎస్ సొంతం. ఇక ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ అకాడమీ చీఫ్ గా వ్యవహరిస్తోన్నాడు. మరి లక్ష్మణ్ హెడ్ కోచ్ పదవికి అప్లై చేసుకోకపోవడానికి కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.