iDreamPost
android-app
ios-app

క్రికెట్ లోకి టీమిండియా దిగ్గజ బ్యాటర్ కొడుకు! రెండో మ్యాచ్ లోనే సెంచరీ..

  • Author Soma Sekhar Published - 11:37 AM, Thu - 29 June 23
  • Author Soma Sekhar Published - 11:37 AM, Thu - 29 June 23
క్రికెట్ లోకి టీమిండియా దిగ్గజ బ్యాటర్ కొడుకు! రెండో మ్యాచ్ లోనే సెంచరీ..

క్రికెట్ లోకి మరో వారసుడు వచ్చేస్తున్నాడు. ఇప్పటికే ఎంతో మంది ఆటగాళ్ల వారసులు క్రికెట్ లోకి అడుగుపెట్టారు. అయితే వారిలో టీమిండియాలో నిలదొక్కున్న ఆటగాళ్ల సంఖ్య చాలా తక్కువనే చెప్పాలి. తాజాగా టీమిండియా దిగ్గజ ఆటగాడి కొడుకు క్రికెట్ లోకి అడుగుపెట్టాడు. ఎంట్రీ ఇవ్వడమే కాకుండా.. రెండో మ్యాచ్ లోనే సెంచరీ బాదీ తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకున్నాడు. మరి ఆడిన రెండో మ్యాచ్ లోనే సెంచరీ బాదిన ఆ దిగ్గజ బ్యాటర్ వారసుడు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఎంతో మంది ఆటగాళ్ల వారసులు క్రికెట్ లోకి అడుగుపెట్టారు. అయితో వారిలో తండ్రి వారసత్వాన్ని కొనసాగించిన వారు తక్కువనే చెప్పాలి. ఇక ఇప్పటికే టీమిండియా క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్ కొడుకు అర్జున్ టెండుల్కర్ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. 2023 ఐపీఎల్ సీజన్ లో ముంబై ఇండియన్స్ తరపున అర్జున్ బరిలోకి దిగాడు. తాజాగా మరో టీమిండియా దిగ్గజ బ్యాటర్ కొడుకు క్రికెట్ లోకి అడుగుపెట్టాడు. అతడే సర్వజిత్ సన్ ఆఫ్ వీవీఎస్ లక్ష్మణ్. అవును టీమిండియా దిగ్గజ ఆటగాడు లక్ష్మణ్ కొడుకు సర్వజిత్ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు.

హైదరాబాద్ క్రికెట్ సంఘం లీగుల్లో అతడు తన తొలి సీజన్ ను ఘనంగా ప్రారంభించాడు. ఈ క్రమంలోనే రెండు రోజుల లీగ్ లో భాగంగా.. సికింద్రాబాద్ నవాబ్స్ కు అతడు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. తొలి మ్యాచ్ లో 30 పరుగులు చేసిన సర్వజిత్.. రెండో మ్యాచ్ లో శతకంతో మెరిశాడు. తాజాగా ఫ్యూచర్ స్టార్ తో బుధవారం జరిగిన మ్యాచ్ లో 209 బంతులు ఎదుర్కొన్న అతడు 12 ఫోర్లు, ఓ సిక్స్ తో 104 పరుగులు చేశాడు. తన తండ్రిలాగే చూడముచ్చటైన షాట్లతో సర్వజిత్ అలరించాడు. కానీ అతడు సెంచరీ చేసినా జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు. 191 పరుగుల తేడాతో సికింద్రాబాద్ నవాబ్స్ ఓటమిపాలైంది.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఫ్యూచర్ స్టార్స్ జట్టు 70.5 ఓవర్లలో 427 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అనంతరం సికింద్రాబాద్ నవాబ్స్ 236 రన్స్ కే ఆలౌట్ అయ్యింది. జట్టులో సర్వజిత్ మినహా.. ఎవరూ రాణించలేదు. ఇక తండ్రి అడుగుజాడల్లో సాగుతున్న సర్వజిత్.. ఎడమ చేతి వాటం బ్యాటర్ కావడం గమనార్హం.