iDreamPost

గంభీర్‌, రామన్‌ కాదు.. టీమిండియా హెడ్‌ కోచ్‌గా తెరపైకి కొత్త పేరు!

బీసీసీఐ వర్గాల నుంచి వచ్చిన ఓ సమాచారం క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. టీమిండియా హెడ్ కోచ్ గా ఓ కొత్త పేరు తెరపైకి వచ్చింది. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. అదేంటంటే?

బీసీసీఐ వర్గాల నుంచి వచ్చిన ఓ సమాచారం క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. టీమిండియా హెడ్ కోచ్ గా ఓ కొత్త పేరు తెరపైకి వచ్చింది. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. అదేంటంటే?

గంభీర్‌, రామన్‌ కాదు.. టీమిండియా హెడ్‌ కోచ్‌గా తెరపైకి కొత్త పేరు!

టీ20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత టీమిండియా హెడ్ కోచ్ పదవి నుంచి వైదొలగనున్నాడు రాహుల్ ద్రవిడ్. దీంతో భారత జట్టుకు తదుపరి కోచ్ ఎవరు? అన్న ప్రశ్నకు ఇప్పటికీ సమాధానం దొరకలేదు. అయితే టీమిండియా నెక్ట్స్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పేరు దాదాపుగా ఖరారు అయినట్లు వార్తలు వస్తున్నాయి. గంభీర్ ఇంటర్వ్యూకు కూడా హాజరైయ్యాడు. అయితే ఈ నేపథ్యంలో బీసీసీఐ వర్గాల నుంచి వచ్చిన ఓ సమాచారం క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. గంభీర్, రామన్ కాదు.. ఇప్పుడు టీమిండియా హెడ్ కోచ్ గా తెరపైకి కొత్త పేరు వచ్చింది. అయితే ఇందులో ఓ ట్విస్ట్ ఉంది.

టీ20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత టీమిండియా జింబాబ్వే టూర్ కు వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా జింబాబ్వేతో 5 టీ20 మ్యాచ్ ల సిరీస్ ఆడనుంది. జూలై 6 నుంచి 14 వరకు మ్యాచ్ లు జరగనున్నాయి. ఇక ఈ టూర్ కు సీనియర్లు అయిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, బుమ్రాలతో పాటుగా మరికొంత మందికి విశ్రాంతి ఇవ్వనున్నారు. వారి ప్లేస్ లో ఐపీఎల్ స్టార్లకు ఛాన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, మయాంక్ యాదవ్, హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి, విజయ్ కుమార్ వైశాఖ్, యశ్ దయాళ్ లకు అవకాశం ఇస్తారని తెలుస్తోంది. శుబ్ మన్ గిల్, రింకూ సింగ్, ఆవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్ కూడా జింబాబ్వే టూర్ కు ఎంపిక అయ్యే అవకాశాలు ఉన్నాయి.

కాగా.. టీ20 వరల్డ్ కప్ తర్వాత రాహుల్ ద్రవిడ్ పదవి కాలం ముగియనుండటంతో.. జింబాబ్వే టూర్ కు ఎన్సీఏ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ ను తాత్కాలికంగా హెడ్ కోచ్ గా నియమించాలని బీసీసీఐ ఆలోచనలు చేస్తోందట. పూర్తి స్థాయి కోచ్ గా బాధ్యతలు చేపట్టేందుకు గౌతమ్ గంభీర్ కాస్త సమయం అడిగినట్లు తెలుస్తోంది. దాంతో తన ఎన్సీఏ బృందంతో కలిసి లక్ష్మణ్ జింబాబ్వే టూర్ కు వెళ్తాడని సమాచారం. మరి ఈ విషయంపై లక్ష్మణ్ ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి