Somesekhar
T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్ గెలిచి.. అతడికి బహుమతిగా ఇవ్వాలని టీమిండియాను రిక్వెస్ట్ చేశాడు మాజీ డాషింగ్ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్. మరి వరల్డ్ కప్ ను సెహ్వాగ్ గిఫ్ట్ గా ఇవ్వమన్నది ఎవరికి?
T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్ గెలిచి.. అతడికి బహుమతిగా ఇవ్వాలని టీమిండియాను రిక్వెస్ట్ చేశాడు మాజీ డాషింగ్ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్. మరి వరల్డ్ కప్ ను సెహ్వాగ్ గిఫ్ట్ గా ఇవ్వమన్నది ఎవరికి?
Somesekhar
టీ20 వరల్డ్ కప్ గెలుచుకోవడానికి టీమిండియా ఒక్క అడుగు దూరంలో మాత్రమే ఉంది. ఫైనల్లో పటిష్టమైన సౌతాఫ్రికాతో టైటిల్ పోరులో తలపడనుంది. దాంతో 11 సంవత్సరాల ఐసీసీ ట్రోఫీ కలను నెరవేర్చుకోవడానికి టీమిండియా ఉవ్విళ్లూరుతోంది. చివరిగా టీమిండియా 2013లో ఛాంపియన్స్ ట్రోఫీని నెగ్గింది. అప్పటి నుంచి మళ్లీ ఇప్పటి వరకు ఒక్క కప్ ను కూడా గెలుచుకోలేదు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీని గెలిచే ఛాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే.. టీ20 వరల్డ్ కప్ గెలిచి.. అతడికి బహుమతిగా ఇవ్వాలని టీమిండియాను రిక్వెస్ట్ చేశాడు మాజీ డాషింగ్ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్. మరి వరల్డ్ కప్ ను సెహ్వాగ్ గిఫ్ట్ గా ఇవ్వమన్నది ఎవరికి? చూద్దాం పదండి.
2011 వరల్డ్ కప్ ని టీమిండియా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ కోసం ఆడి గెలిచింది. ఆ వరల్డ్ కప్ గెలిచి.. సచిన్ కు ఘనంగా వీడ్కోలు పలికింది. ఇక ఇప్పుడు కూడా ఓ దిగ్గజం కోసం టీ20 వరల్డ్ కప్ గెలిచి.. అతడికి గిఫ్ట్ గా ఇవ్వాలని టీమిండియా మాజీ ప్లేయర్ వీరేంద్ర సెహ్వాగ్ జట్టుకు సూచించాడు. క్రిక్ బజ్ వేదికగా మాట్లాడుతూ.. ఈ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అలాగే 11 ఏళ్ల ఐసీసీ ట్రోఫీ కరువును కూడా తీర్చుకోవాలని పేర్కొన్నాడు.
వీరేంద్ర సెహ్వాగ్ మాట్లాడుతూ..” మేము 2011 వరల్డ్ కప్ సచిన్ టెండుల్కర్ కోసం ఆడాము. దాన్ని గెలిచి అతడికి బహుమతిగా ఇచ్చాం. ఇక ఇప్పుడు మీరు ఈ టీ20 వరల్డ్ కప్ ను గెలిచి.. కోచ్ రాహుల్ ద్రవిడ్ కు గిప్ట్ గా ఇవ్వండి. అతడు కోచ్ గా వరల్డ్ కప్ విన్ అవ్వడంతో పాటుగా వరల్డ్ కప్ విన్నర్ అనే గుర్తింపును పొందుతాడు. ఇప్పుడు ఎలాగో అతడు ప్లేయర్ గా వరల్డ్ కప్ గెలవలేడు కదా. కనీసం మీరైనా పొట్టి ప్రపంచ కప్ ను గెలిచి ద్రవిడ్ కు బహుమతిగా ఇవ్వండి” టీమిండియా ప్లేయర్ కు సూచించాడు.
ఇక ఈ వరల్డ్ కప్ లో టీమిండియా అసాధారణ ప్రదర్శనపై ప్రశంసల వర్షం కురింపించాడు డాషింగ్ ప్లేయర్. ప్రస్తుతం సెహ్వాగ్ కామెంట్స్ వైరల్ కావడంతో.. నెటిజన్లు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాడు. రాహుల్ ద్రవిడ్ లాంటి దిగ్గజ ప్లేయర్ కు వరల్డ్ కప్ విన్నింగ్ మెంబర్ అనే ట్యాగ్ ఉంటే బాగుంటుంది అంటూ చెప్పుకొస్తున్నారు. మరి సెహ్వాగ్ రిక్వెస్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.