SNP
టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్.. మరోసారి బరిలోకి దిగేందుకు సిద్ధం అవుతున్నాడు. అది కూడా ముంబై టీమ్ తరఫున. క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగ లాంటి ఈ విషయం గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్.. మరోసారి బరిలోకి దిగేందుకు సిద్ధం అవుతున్నాడు. అది కూడా ముంబై టీమ్ తరఫున. క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగ లాంటి ఈ విషయం గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
SNP
వీరేందర్ సెహ్వాగ్.. భారత క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. ఒక జనరేషన్‌ను తన అగ్రెసివ్ బ్యాటింగ్‌తో కేకలు పెట్టించిన బ్యాటర్. వామ్మో.. ఇతనికి బౌలింగ్ చేయడం చాలా కష్టం అంటూ.. శత్రుదేశంలోని గొప్ప గొప్ప బౌలర్లు చేతులెత్తి దండం పెట్టేవారు. అది సెహ్వాగ్ రేంజ్. అతని స్టైల్ ఆఫ్ అగ్రెసివ్ బ్యాటింగ్‌కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. క్రికెట్ దేవుడు సచిన్‌కి జోడీగా.. ప్రపంచ క్రికెట్‌లోనే అత్యుత్తమ ఓపెనర్‌గా నిలిచి, ఇండియన్ క్రికెట్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వీరు భాయ్.. మరోసారి మైదానంలోకి దిగనున్నాడు. చాలా కాలంగా తమ అభిమాన క్రికెటర్ ఆటను మిస్ అవుతున్న వారికి ఇది పండుగ లాంటి వార్త. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఇప్పటికే ఐపీఎల్ క్రికెట్ అభిమానులను దశాబ్దకాలంగా ఊపేస్తోంది. మరికొన్ని రోజుల్లోనే ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభం కానుంది. దీని కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే.. అంతకంటే ముందే మరో మెగా లీగ్ క్రికెట్ ఫ్యాన్స్‌కు కావాల్సినంత వినోదాన్ని అందించనుంది. అదే.. ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్. ఈ ఏడాది ఐవీపీఎల్ తొలి సీజన్ లాంచ్ కానుంది. ఈ నెల 23 నుంచి మార్చ్ 3వ తేదీ వరకు ఈ లీగ్ జరగనుంది. లీగ్‌లో ముంబై జట్టు తరఫున సెహ్వాగ్ బరిలోకి దిగనున్నాడు. అతనే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు.
‘ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్‌లో భాగమైనందుకు సంతోషంగా ఉంది. ముంబై ఛాంపియన్స్ తరఫున బరిలోకి దిగుతున్నాను. ముంబై ఛాంపియన్స్‌కు మద్దతు తెలపండి. డెహ్రాడూన్‌లో కలుద్దాం’ అంటూ వీరూ ఓ ప్రకటనలో తెలిపాడు. అయితే.. ముంబై టీమ్ కెప్టెన్సీ బాధ్యతలు కూడా సెహ్వాగ్‌కే అప్పగించారు. ఈ లీగ్‌లో సురేష్ రైనా, క్రిస్ గేల్ వంటి దిగ్గజ క్రికెటర్లు సైతం పాల్గొంటున్నారు. లీగ్‌లో రాజస్థాన్ లెజెండ్స్, రెడ్ కార్పెట్ ఢిల్లీ, ఛత్తీస్‌గడ్ వారియర్స్, తెలంగాణ టైగర్స్, ముంబై ఛాంపియన్స్ మొత్తం ఆరు టీమ్స్ పాల్గొనబోతున్నాయి. మరి ఈ లీగ్‌లో సెహ్వాగ్ ముంబై తరఫున బరిలోకి దిగడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Virender Sehwag, takes charge as Captain for ‘Mumbai Champions’ in the Indian Veteran Premier League! 🏏 Get ready for explosive strokes and masterful captaincy as the cricket maestro graces the field again. @virendersehwag#bvci #ivpl #t20 #cricket #VirenderSehwag pic.twitter.com/tys04NFW8M
— Indian Veteran Premier League (@ivplt20) February 2, 2024