SNP
Virender Sehwag, Virat Kohli, KL Rahul, World Cup 2023: వన్దే వరల్డ్ కప్ 2023 ఫైనల్‌లో టీమిండియా ఓటమిని ఎవరు మర్చిపోగలరు. అయితే.. ఆ ఓటమికి కోహ్లీ, కేఎల్ రాహుల్ కారణం అంటూ సెహ్వాగ్ పరోక్షంగా షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆయన ఏమన్నాడో పూర్తిగా తెలుసుకుందాం..
Virender Sehwag, Virat Kohli, KL Rahul, World Cup 2023: వన్దే వరల్డ్ కప్ 2023 ఫైనల్‌లో టీమిండియా ఓటమిని ఎవరు మర్చిపోగలరు. అయితే.. ఆ ఓటమికి కోహ్లీ, కేఎల్ రాహుల్ కారణం అంటూ సెహ్వాగ్ పరోక్షంగా షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆయన ఏమన్నాడో పూర్తిగా తెలుసుకుందాం..
SNP
100 కోట్ల మందికి పైగా భారత క్రికెట్ అభిమానుల హృదయాలను ముక్కలు చేసిన ఘటన.. 2023 నవంబర్ 19న జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి. స్వదేశంలో జరిగిన వన్డే వరల్డ్ కప్ 2023లో టీమిండియా అద్భుతంగా ఆడిన విషయం తెలిసిందే. ఒక్క ఓటమి కూడా లేకుండా.. వరుసగా 10 మ్యాచ్‌లు గెలిచి ఫైనల్ వరకు దూసుకెళ్లింది. లీగ్ దశలో ఏ జట్టునైతే తొలి మ్యాచ్‌లోనే ఓడించి వరల్డ్ కప్ వేటను మొదలు పెట్టిందో అదే ఆస్ట్రేలియాతో నవంబర్ 19న ఫైనల్‌కు సిద్ధమైంది. కానీ, అప్పటి వరకు ఆడిన టీమిండియాకు పూర్తి భిన్నంగా ఆడింది. 100 కోట్ల మంది భారత క్రికెట్ అభిమానుల ఆశలపై నీళ్ల చల్లుతూ.. ఆ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలైంది. అయితే.. ఆ ఫైనల్‌లో టీమిండియా ఓటమికి గల కారణంపై భారత మాజీ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 11వ ఓవర్ నుంచి 40వ ఓవర్ మధ్య అస్సలు ఫియర్ లెస్ క్రికెట్ ఆడలేదని అదే ఓటమి ప్రధాన కారణం అయిందంటూ.. సెహ్వాగ్ పరోక్షంగా విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ స్లో బ్యాటింగ్ చేశారంటూ విమర్శలు గుప్పించాడు. 2007 నుంచి 2011 మధ్య తాము ప్రతి మ్యాచ్‌ను నాకౌట్ మ్యాచ్ అనుకుంటూ.. ఆడే వాళ్లం అని, అందుకే 2011 వన్డే వరల్డ్ కప్ గెలిచాం అని, ప్రస్తుతం ఉన్న టీమిండియా కూడా అలానే ప్రతి మ్యాచ్‌ను నాకౌట్ మ్యాచ్ అని భావిస్తే కప్పు గెలుస్తుందని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.
వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్‌లో టాస్ ఓడి టీమిండియా తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్ శుబ్‌మన్ గిల్ 7 బంతుల్లో 4 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 31 బంతుల్లో 47 పరుగులు చేసి టోర్నీ మొత్తం ఎలా అగ్రెసివ్‌గా ఆడాడో అలానే ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ, దురదృష్టవశాత్తు 47 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ వెంటనే శ్రేయస్ అయ్యర్ కూడా అవుట్ కావడంతో కేఎల్ రాహుల్‌తో కలిసి కోహ్లీ ఇన్నింగ్స్‌ను నిర్మించే బాధ్యత తీసుకున్నాడు. ఈ క్రమంలోనే కోహ్లీ, రాహుల్ కాస్త నెమ్మదిగా ఆడారు. కోహ్లీ 63 బంతుల్లో 54, కేఎల్ రాహుల్ 107 బంతుల్లో 66 రన్స్ చేసి అవుట్ అయ్యారు. మిడిల్ ఓవర్స్‌లో చాలా స్లోగా బ్యాటింగ్ చేసిన కోహ్లీ-రాహుల్ జోడీ.. సరిగ్గా ఇన్నింగ్స్‌ను ఎక్స్‌లరేట్ చేసే టైమ్‌లో అవుట్ కావడం, ఆ తర్వాత జడేజా, సూర్యకుమార్ యాదవ్ సైతం విఫలం కావడంతో టీమిండియా కేవలం 240 పరుగులు మాత్రమే చేసింది. ఆ స్కోర్‌ను ఆస్ట్రేలియా 43 ఓవర్లలో ఛేజ్ చేసి.. మూడో సారి వరల్డ్ కప్ గెలుద్దాం అనుకున్న టీమిండియా ఆశలపై నీళ్లు చల్లింది. మరి వరల్డ్ కప్ ఓటమిపై సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Sehwag slammed Timid approach of Virat Kohli and KL Rahul b/w 11 to 40 overs in wc final as they didn’t wanted Rohit Sharma to win the WC💔 pic.twitter.com/SDZwSTRZ7z
— 🔔 (@ArrestPandya) May 8, 2024