Nidhan
Virender Sehwag Eyeing Coaching Role In IPL 2025: టీమిండియా లెజెండ్ వీరేంద్ర సెహ్వాగ్ రిటైర్మెంట్ తర్వాత కామెంట్రీ చేస్తూనే కోచ్‌గానూ వర్క్ చేశాడు. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్‌కు కోచ్‌గా ఉన్నాడు. అలాంటోడు తాజాగా కోచింగ్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
Virender Sehwag Eyeing Coaching Role In IPL 2025: టీమిండియా లెజెండ్ వీరేంద్ర సెహ్వాగ్ రిటైర్మెంట్ తర్వాత కామెంట్రీ చేస్తూనే కోచ్‌గానూ వర్క్ చేశాడు. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్‌కు కోచ్‌గా ఉన్నాడు. అలాంటోడు తాజాగా కోచింగ్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
Nidhan
వరల్డ్ క్రికెట్లో టాప్ టీమ్‌గా భారత జట్టును చెప్పొచ్చు. అన్ని ఫార్మాట్లలోనూ మెన్ ఇన్ బ్లూ హవా నడుస్తోంది. అలాంటి జట్టుకు కోచింగ్ ఇచ్చే అవకాశం వస్తే ఎవరూ వదిలిపెట్టరు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్ లాంటి దిగ్గజ ప్లేయర్లతో డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకునే ఛాన్స్, వాళ్లకు సరైన గైడెన్స్ ఇస్తూ టీమ్‌ను విజయాల బాటలో కొనసాగించే అవకాశం వస్తే ఎవరూ కాదనరు. అందునా టీమిండియా తరఫున వర్క్ చేస్తే ఊహించనంత పారితోషికం, ఫుల్ క్రేజ్ దక్కుతుంది. అందుకే భారత కోచ్ పదవి కోసం మాజీ క్రికెటర్లు ఎగబడతారు. అయితే లెజెండ్ వీరేంద్ర సెహ్వాగ్ మాత్రం భారత జట్టుకు కోచ్‌గా పని చేయడం కంటే ఐపీఎల్ టీమ్‌కు కోచింగ్ ఇవ్వడమే తనకు ఇష్టమని అంటున్నాడు. వీరూ అలా ఎందుకు అన్నాడో ఇప్పుడు చూద్దాం..
‘టీమిండియా కోచింగ్ మీద నాకు ఇంట్రెస్ట్ లేదు. అదే ఓ ఐపీఎల్ టీమ్‌కు కోచ్‌గా రమ్మంటే మాత్రం ఆ ఛాన్స్‌ను అస్సలు వదలను. ఎందుకంటే ఇండియా టీమ్‌కు కోచ్‌గా వెళ్తే 8 నెలల పాటు ఇంటికి దూరంగా ఉండాల్సి వస్తుంది. దాదాపు 15 ఏళ్ల పాటు భారత జట్టుకు ఆడుతూ నేను చేసిందిదే. మళ్లీ ఇంటికి దూరమవ్వాలని నేను అనుకోవడం లేదు. నాకు ఇద్దరు పిల్లలు. ఒకడికి 14 ఏళ్లు, ఇంకొకడికి 16 ఏళ్లు. ఇద్దరూ క్రికెటర్సే. ఒకడు ఆఫ్ స్పిన్నర్, మరొకడు బ్యాట్స్‌మన్. నేను వాళ్లతో టైమ్ స్పెండ్ చేయాలని అనుకుంటున్నా. వాళ్లకు చాలా విషయాలు నేర్పించాల్సి ఉంది. ఈ తరుణంలో భారత జట్టుకు కోచ్‌గా వెళ్తే నాకు టైమే ఉండదు’ అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ టీమ్‌కు అయితే నెలన్నర నుంచి రెండు నెలల పాటు కోచ్‌గా వెళ్తే సరిపోతుంది. అందుకే వీరూ ఆ ఆప్షన్ బెటర్ అని అంటున్నాడు.
ఐపీఎల్-2025లో ఏదైనా జట్టుకు కోచింగ్ ఇచ్చే ఛాన్స్ వస్తే తప్పకుండా ఆ ఆఫర్‌ను పరిశీలిస్తానని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. ఇక, రిటైర్మెంట్ అనంతరం ఒకవైపు కామెంట్రీ చేస్తూనే మరోవైపు కోచ్‌గానూ కొనసాగాడు వీరూ. ఐపీఎల్-2016లో పంజాబ్ కింగ్స్ టీమ్‌కు మెంటార్‌గా వర్క్ చేశాడు. ఆ తర్వాత ఆ ఫ్రాంచైజీకి డైరెక్టర్ ఆఫ్ క్రికెట్గానూ సేవలు అందించాడు. ఐపీఎల్-2018 వరకు పంజాబ్ కింగ్స్‌తో అతడు ట్రావెల్ అయ్యాడు. 2017లో టీమిండియా హెడ్ కోచ్ పోస్ట్ కోసం అతడు దరఖాస్తు చేశాడు. కానీ అప్పట్లో మిస్ అయింది. మరో వెటరన్ ప్లేయర్ రవిశాస్త్రికి ఈ పోస్ట్ దక్కింది. దీంతో నెక్స్ట్ టీమిండియా కోచ్‌గా రావాలని అనుకుంటున్నారా అనే ప్రశ్నకు అతడు పైవిధంగా సమాధానం ఇచ్చాడు. భారత జట్టుకు కోచింగ్ ఇవ్వాలనే ఆసక్తి లేదని.. ఏడెనిమిది నెలలు ఇంటికి దూరంగా ఉండటం తన వల్ల కాదని, పిల్లల ఫ్యూచర్ దృష్ట్యా వాళ్లతో ఎక్కువ సేపు గడపాలని భావిస్తున్నానని స్పష్టం చేశాడు.