నా ఆటతో అభిమానులను అలరించాలనుకున్నానే తప్ప.. దాని గురించి అస్సలు పట్టించుకోలేదని, అలాంటి ఆలోచనే నాకు రాలేదని వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
నా ఆటతో అభిమానులను అలరించాలనుకున్నానే తప్ప.. దాని గురించి అస్సలు పట్టించుకోలేదని, అలాంటి ఆలోచనే నాకు రాలేదని వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
వీరేంద్ర సెహ్వాగ్.. క్రికెట్ చరిత్రలో ఈ పేరు గట్టిగా గుర్తుంటుంది. దానికి కారణం అతడి డ్యాషింగ్ బ్యాటింగే. ఇక అతడు క్రీజ్ లో ఉంటే.. ఎంతటి బౌలర్ కైనా చమటలు పట్టాల్సిందే. అంతలా ఉంటుంది అతడి ఊచకోత. ఇదిలా ఉండగా.. వివాదాలకు దూరంగా ఉండే వీరేంద్రుడిపై అప్పట్లో కొన్ని ఆరోపణలు వచ్చాయి. వాటిని అప్పట్లో అతడు పట్టించుకోలేదు. తాజాగా ఆ ఆరోపణలపై మాట్లాడాడు. దాని గురించి నేను అస్సలు పట్టించుకోలేదని, అలాంటి ఆలోచనే రాలేదని షాకింగ్ కామెంట్స్ చేశాడు. మరి ఇంతకీ ఏ విషయంలో ఈ వ్యాఖ్యలు చేశాడో ఇప్పుడు చూద్దాం.
రాహుల్ ద్రవిడ్ కెప్టెన్సీ పదవి నుంచి తప్పుకున్నాక.. ఆ పగ్గాలు చేపట్టడానికి వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తి చూపించాడని, పైగా మహేంద్రసింగ్ ధోనిని కెప్టెన్ చేయడం సహించలేకపోయాడని అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ ఆరోపణలపై తాజాగా మరోసారి స్పందించాడు డాషింగ్ బ్యాటర్ వీరూ. జియో సినిమా షోలో సంజయ్ మంజ్రేకర్ తో మాట్లాడుతూ..”టీమిండియా కెప్టెన్ కావాలని నేను ఏనాడూ కోరుకోలేదు. ఓ ఆటగాడిగా నా బ్యాటింగ్ తో అభిమానులను అలరించడంపైనే నేను ఎక్కువగా ఫోకస్ పెట్టేవాడిని. అలాగే సీనియర్ ఆటగాడిగా ధోనిని అండగా ఉండటాన్ని ఆస్వాదించాను. నా వ్యూహాలను, పదునైన ఆలోచనలను ఆటగాళ్లతో పంచుకోవాలనుకున్నాను. అంతే తప్ప నేను అసలు కెప్టెన్సీ గురించే పట్టించుకోలేదు. అలాంటి ఆలోచన కూడా నాకు రాలేదు” అంటూ అప్పటి ఆరోపణలపై మరోసారి క్లారిటీ ఇచ్చాడు వీరేంద్రుడు. ఇక తనను సెలెక్టర్లు పక్కన పెట్టడానికి కారణం తన పూర్ ఫామ్ అని చెప్పాడు సెహ్వాగ్. ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగానే వారిని ఎంపిక చేస్తారని స్పష్టంగా చెప్పుకొచ్చాడు.