2023 వరల్డ్ కప్.. ఇప్పుడు ప్రపంచం మెుత్తం ఈ మెగా టోర్నీ కోసమే ఎదురుచూస్తోంది. ఇక ఈ టోర్నీలో అందరి దృష్టి భారత్ పైనే ఉంది. దానికి ప్రధాన కారణం.. 2011 తర్వాత 12 ఏళ్లకు వరల్డ్ కప్ కు మళ్లీ భారత్ ఆతిథ్యం ఇవ్వడమే. ప్రస్తుతం టీమిండియా కూడా వరల్డ్ కప్ కు అనుగుణంగానే ఆటగాళ్లను సెలక్షన్ చేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే టీమిండియా డ్యాషింగ్ బ్యాటర్, మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2011 వరల్డ్ కప్ సచిన్ గెలిచాం.. 2023 వరల్డ్ కప్ అతడి కోసం గెలవాలి అంటూ చెప్పుకొచ్చాడు.
2011 వరల్డ్ కప్.. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టీమిండియా కల నెరవేరింది. ఇక ఈ వరల్డ్ కప్ టీమిండియా దిగ్గజం సచిన్ కు చివరిది కావడంతో.. ఎలాగైనా వరల్డ్ కప్ గెలిచి, సచిన్ కు బహుమతిగా ఇవ్వాలని టీమిండియాతో పాటుగా యావత్ భారతదేశం మెుత్తం అనుకుంది. అనుకున్నట్లుగానే 2011 వరల్డ్ కప్ గెలిచి సచిన్ కు బహుమతిగా ఇచ్చింది టీమిండియా. ఈ నేపథ్యంలో 2023 వరల్డ్ కప్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. దాంతో మాజీలు పలు వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. తాజాగా టీమిండియా డ్యాషింగ్ బ్యాటర్, మాజీ ప్లేయర్ వీరేంద్ర సెహ్వాగ్.. విరాట్ కోహ్లీపై పలు ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
2011 వరల్డ్ కప్ సచిన్ టెండుల్కర్ కోసం ఆడాం.. ఆ వరల్డ్ కప్ తో సచిన్ కు ఘనమైన వీడ్కోలు ఇచ్చామని సెహ్వాగ్ తెలిపాడు. ఇప్పుడు ఇది విరాట్ కోహ్లీకి వర్తిస్తుందని సెహ్వాగ్ పేర్కొన్నాడు. టీమ్ లో ఉన్న ప్రతీ ఒక్కరు విరాట్ కోహ్లీ కోసం ఈ వరల్డ్ కప్ గెలిచి తీరాలి. అతను ప్రతీసారి టీమ్ కు 100కు 200 శాతం తన ఆటను ఇచ్చాడని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. అదీకాక విరాట్ సైతం 2023 వరల్డ్ కప్ కోసం ఎన్నో ఆశలు పెట్టుకున్నాడన్నాడు. అహ్మదాబాద్ పిచ్ ఎలా ఉంటుందో విరాట్ కు బాగా తెలుసని, ఈసారి వరల్డ్ కప్ లో విరాట్ చెయ్యాల్సిందంతా చేస్తాడని తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు సెహ్వాగ్.