T20 World Cup: ఆ స్టార్ ప్లేయర్లకు ఇదే చివరి మ్యాచ్! సెహ్వాగ్ షాకింగ్ స్టేట్మెంట్..

టీ20 వరల్డ్ కప్ 2024 ముగిసిన తర్వాత ఆ ఇద్దరు స్టార్ ప్లేయర్లు మరో ప్రపంచ కప్ లో కనిపించరని షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్. ఆ వివరాల్లోకి వెళితే..

టీ20 వరల్డ్ కప్ 2024 ముగిసిన తర్వాత ఆ ఇద్దరు స్టార్ ప్లేయర్లు మరో ప్రపంచ కప్ లో కనిపించరని షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్. ఆ వివరాల్లోకి వెళితే..

టీ20 వరల్డ్ కప్ ముగింపు దశకు చేరుకుంది. టైటిల్ కోసం టీమిండియా-సౌతాఫ్రికా జట్లు నువ్వా నేనా అన్న రీతిలో తలపడేందుకు సిద్ధం అయ్యాయి. ఎవరికి వారే కప్ ఎగరేసుకుపోవడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. ఇక ఈ మ్యాచ్ గురించి క్రికెట్ ప్రముఖులు తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా డాషింగ్ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ ఇద్దరి ప్లేయర్లకు వరల్డ్ కప్ లో ఇదే చివరి మ్యాచ్ అంటూ ఊహించని కామెంట్స్ చేశాడు. ఆ ప్లేయర్లు ఎవరంటే?

టీ20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత టీమిండియాలో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి.. అంటే అవుననే సంకేతాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే చాలా మంది క్రికెట్ దిగ్గజాలు ఈ టీ20 వరల్డ్ కప్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు చివరిదని చెప్పుకొచ్చారు. తాజాగా ఇదే విషయాన్ని మరోసారి గుర్తుచేశాడు టీమిండియా డాషింగ్ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇంతకీ సెహ్వాగ్ ఏమన్నాడంటే?

“ప్రపంచ కప్ ఆడే ఏ సీనియర్ ఆటగాడైనా ఇదే తమకు చివరి మెగాటోర్నీగా భావిస్తుంటారు. అయితే తమ వీడ్కోలును విజయంతో ముగించాలనుకుంటారు. వన్డే వరల్డ్ కప్ 2023 టీమిండియా గెలిచి ఉంటే.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరిలో ఎవరో ఒకరు ఈ టీ20 వరల్డ్ కప్ ఆడి ఉండేవారు కాదు. దాంతో కసితో ఉన్న వీరు ఫ్యాన్స్ కోసం, జట్టు కోసం ఈ పొట్టి వరల్డ్ కప్ గెలవాలనుకుంటున్నారు. భారత్ కచ్చితంగా కప్ గెలుస్తుంది. ఆ తర్వాత వచ్చే వన్డే/టీ20 వరల్డ్ కప్ లో విరాట్, రోహిత్ ఆడే అవకాశాలు ఉండకపోవచ్చు. అయితే ఫిట్ గా ఉండి, ఫామ్ లో ఉంటే మరో వరల్డ్ కప్ ఆడతారు” అంటూ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు వీరూ భాయ్. కాగా.. ప్రస్తుతం రోహిత్ శర్మకు 37 సంవత్సరాలు కాగా.. విరాట్ కోహ్లీకి 35 ఏళ్లు. వచ్చే వన్డే వరల్డ్ కప్ 2027లో జరగనుంది. పొట్టి ప్రపంచ కప్ కు ఇంకా రెండు సంవత్సరాలు ఉంది. దాంతో వీరిద్దరు నెక్ట్స్ వరల్డ్ కప్ కు అందుబాటులో ఉండటం దాదాపు అనుమానమే. మరి సెహ్వాగ్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments