IPL 2024: ముంబైవి తలతిక్క ప్రయోగాలు.. ఈ దుస్థితికి కారణం వాళ్లే: సెహ్వాగ్

ఈ ఐపీఎల్ సీజన్ లో ముంబై ఇండియన్స్ దారుణమైన ప్రదర్శన కనబర్చింది. దాంతో టోర్నీ నుంచి దాదాపు నిష్క్రమించింది. అయితే ముంబై ఈ స్థితికి కారణం వాళ్లే అంటూ ఘాటైన విమర్శలు చేశాడు టీమిండియా మాజీ ప్లేయర్ వీరేంద్ర సెహ్వాగ్.

ఈ ఐపీఎల్ సీజన్ లో ముంబై ఇండియన్స్ దారుణమైన ప్రదర్శన కనబర్చింది. దాంతో టోర్నీ నుంచి దాదాపు నిష్క్రమించింది. అయితే ముంబై ఈ స్థితికి కారణం వాళ్లే అంటూ ఘాటైన విమర్శలు చేశాడు టీమిండియా మాజీ ప్లేయర్ వీరేంద్ర సెహ్వాగ్.

ముంబై ఇండియన్స్.. ఐపీఎల్ చరిత్రలో మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్ గా పేరొందింది. ఐదు టైటిళ్లు గెలిచి అరుదైన రికార్డ్ ను కూడా తన ఖాతాలో వేసుకుంది. అలాంటి టీమ్ ఈ సీజన్ లో దారుణంగా విఫలమైంది. కెప్టెన్ గా రోహిత్ ను కాదని పాండ్యాను నియమించడంతోనే ముంబై పతనం మెుదలైందని ఫ్యాన్స్ అభిప్రాయాపడుతున్నారు. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ ఇలాంటి దారుణమైన పరిస్థితికి తలతిక్క ప్రయోగాలే కారణమని, దానికి వాళ్లే కారణమని ఘాటైన విమర్శలు చేశాడు టీమిండియా మాజీ డ్యాషింగ్ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్.

ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్ ఇలాంటి దారుణ ప్రదర్శన చేస్తుందని బహుశా ఎవ్వరూ ఊహించి ఉండరు. ఇప్పటి వరకు ఆడిన 11 మ్యాచ్ ల్లో కేవలం 3 విజయాలతో ప్లే ఆఫ్ ఆశలు లేకుండా చేసుకుంది. ఇక తాజాగా కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో 170 పరుగులను ఛేదించలేక చతికీలపడింది. కాగా.. ఈ ఓటమితో ముంబై ఇండియన్స్ పై విమర్శలతో విరుచుకుపడ్డాడు వీరేంద్ర సెహ్వాగ్. ఆండ్రీ రస్సెల్ ను ఆలస్యంగా బ్యాటింగ్ కు పంపించి కేకేఆర్ చేసిన తప్పే.. ముంబై ఇండియన్స్ కూడా చేసిందని పేర్కొన్నాడు.

సెహ్వాగ్ మాట్లాడుతూ..”కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో బ్యాటింగ్ ఆర్డర్ లో హార్దిక్ పాండ్యా, టిమ్ డేవిడ్ ఆలస్యంగా వచ్చారు. దాని వల్ల ముంబై ఇండియన్స్ కు ఏం మేలు జరిగింది? గత సీజన్ లో గుజరాత్ తరఫున 4వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన పాండ్యా మంచి సక్సెస్ అయ్యాడు. అది మర్చిపోయారా? ఇప్పుడు అతడిని బ్యాటింగ్ ఆర్డర్ లో డీమోట్ చేయడంలో అర్ధమేంటి? ఇప్పుడెందుకు లోయర్ ఆర్డర్ లో వస్తున్నాడు? ముంబై ఇండియన్స్ ఇలాంటి తలతిక్క ప్రయోగాలు చేయడం వల్లే ఈ దుస్థితి ఏర్పడింది. దీనికి కారణం కెప్టెన్ తో పాటుగా బ్యాటింగ్, బౌలింగ్ కోచ్ లతో పాటు మేనేజ్ మెంట్ కూడా ఒక కారణమే” అంటూ విమర్శించాడు వీరూ భాయ్. ఐపీఎల్ 2025 సీజన్ లో ముంబై ఇండియన్స్ మరోసారి ఇలాంటి బుర్రతక్కువ ప్రయోగాలు చేస్తుందని నేను అనుకోట్లేదని సెహ్వాగ్ పేర్కొన్నాడు. మేనేజ్ మెంట్ ఈ ప్రయోగాలపై దృష్టిసారించాలని ఈ సందర్భంగా సూచించాడు.

Show comments