SNP
Virender Sehwag, Head Coach, Team India, IPL 2025: సెహ్వాగ్ టీమిండియా హెడ్ కోచ్ అయితే.. అతని బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటో చెప్పేశాడు. మరి అదేంటో ఇప్పుడు మనమూ తెలుసుకుందాం..
Virender Sehwag, Head Coach, Team India, IPL 2025: సెహ్వాగ్ టీమిండియా హెడ్ కోచ్ అయితే.. అతని బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటో చెప్పేశాడు. మరి అదేంటో ఇప్పుడు మనమూ తెలుసుకుందాం..
SNP
టీమిండియా మాజీ క్రికెటర్, డాషింగ్ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ గురించి క్రికెట్ అభిమానులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఒక తరం క్రికెట్ లోకాన్ని తన బ్యాటింగ్‌కు ఫిదా చేసిన స్టార్ ప్లేయర్ అతను. అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగినంత కాలం.. విధ్వంసకర బ్యాటింగ్‌కు మారుపేరులా నిలిచాడు. ప్రస్తుతం కామెంటేటర్‌గా చేస్తున్న సెహ్వాగ్.. టీమిండియాకు హెడ్ కోచ్ అనే టాపిక్‌పై స్పందిస్తూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన ఓపెనింగ్ భాగస్వామి గౌతమ్ గంభీర్ ప్రస్తుతం భారత హెడ్ కోచ్‌గా ఉన్న విషయం తెలిసిందే. అయితే.. తాను టీమిండియాకు హెడ్ కోచ్ అయితే.. తన అతిపెద్ద ఛాలెంజ్ ఏంటో సెహ్వాగ్ తెలిపాడు.
సెహ్వాగ్ మాట్లాడుతూ.. ‘నేను టీమిండియాకు హెడ్ కోచ్ అయితే.. ఏడాదిలో 8 నుంచి 9 నెలల పాటు జట్టుతో ఉండాల్సి వస్తుంది. ఆటగాడిగా నా 15 ఏళ్ల కెరీర్‌లో నేను అదే చేశాను. ఇప్పుడు కోచ్ అయితే మళ్లీ అదే రొటీన్ లైఫ్ అవుతుంది. నా కుటుంబంతో సమయం గడపలేను. నాకు ఇద్దరు కొడుకులు.. ఒకడికి 16 ఏళ్లు, ఇంకొడికి 14 ఏళ్లు. ఇద్దరూ ప్రస్తుతం ఢిల్లీ తరఫున క్రికెట్ ఆడుతున్నారు. ఈ టైమ్‌లో నా అవసరం వాళ్లకు చాలా ఉంది. ఇలాంటి టైమ్‌లో నేను కోచింగ్ అంటూ ఏడాదిలో 9 నెలలు వారికి దూరం అవ్వాలని అనుకోవడం లేదు.
వారికి క్రికెట్ భవిష్యత్తు పరంగా, అలాగే ఒక తండ్రిగా నేను ఇప్పుడు వారితో సమయం గడపాలి. ఇదే నాకు బిగ్గెస్ట్ ఛాలెంజ్ అవుతుంది. కానీ, ప్రస్తుత హెడ్ కోచ్ గంభీర్‌కు అలా కాదు.. తన కూతుర్లు చాలా చిన్న పిల్లలు.. టీమిండియాకు మూడేళ్ల హెడ్ కోచ్‌గా ఉండి.. తర్వాత అతను తన టైమ్‌ను కుటుంబానికి పూర్తిగా ఇవ్వొచ్చు. అయితే.. నేను టీమిండియా కంటే కూడా.. ఐపీఎల్‌లో ఏదో ఒక టీమ్‌కు హెడ్ కోచ్‌గా ఉండేందుకు ఇష్టపడతాను. ఎందుకంటే.. ఐపీఎల్ అయితే.. ఓ రెండు రెండున్నర నెలల్లో ముగిసిపోతంది. మహా అయితే.. ఓ మూడు నెలల పాటు కుటుంబానికి దూరంగా ఉండాల్సి ఉంటుంది. కానీ, మిగతా టైమ్ అంతా వారికి ఇవ్వొచ్చు.’ అని సెహ్వాగ్ తన మనసులోని మాటను బయటపెట్టాడు. మరి అతని వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.