ఇలా ముందే ఆడితే వరల్డ్ కప్ కు సెలెక్ట్ అయ్యేవాడివే కదా? యంగ్ ప్లేయర్ పై సెహ్వాగ్ సెటైర్లు!

ఇప్పుడు అద్భుతంగా ఆడే బదులు ఇంతకు ముందే ఇలా ఆడితే టీ20 వరల్డ్ కప్ కి సెలెక్ట్ అయ్యేవాడికి కదా? అంటూ యంగ్ ప్లేయర్ పై తనదైన శైలిలో స్పందించాడు టీమిండియా మాజీ డాషింగ్ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్. మరి ఇంతకీ ఆ ప్లేయర్ ఎవరంటే?

ఇప్పుడు అద్భుతంగా ఆడే బదులు ఇంతకు ముందే ఇలా ఆడితే టీ20 వరల్డ్ కప్ కి సెలెక్ట్ అయ్యేవాడికి కదా? అంటూ యంగ్ ప్లేయర్ పై తనదైన శైలిలో స్పందించాడు టీమిండియా మాజీ డాషింగ్ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్. మరి ఇంతకీ ఆ ప్లేయర్ ఎవరంటే?

టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీలో పాల్గొనబోయే టీమిండియా జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఐపీఎల్ సీజన్ లో ఎంతో అద్భుతంగా రాణిస్తున్న ప్లేయర్లకు కొందరికి అందులో చోటు దక్కలేదు. దీంతో టీమ్ సెలక్షన్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. శుబ్ మన్ గిల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిషేక్ శర్మ లాంటి సంచలన ప్లేయర్లకు చోటు దక్కలేదు. అయితే ఓ ప్లేయర్ వరల్డ్ కప్ టీమ్ సెలక్షన్ అయిన తర్వాత అద్భుతంగా రాణిస్తున్నాడని, ఈ పని ముందే చేస్తే వరల్డ్ కప్ టీమ్ లో ప్లేస్ దక్కేది కాదా, అంటూ టీమిండియా మాజీ ప్లేయర్ వీరేంద్ర సెహ్వాగ్ ఓ యంగ్ ప్లేయర్ పై ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

టీమిండియా మాజీ డాషింగ్ ప్లేయర్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో క్రికెట్ పై అలాగే ప్లేయర్లపై సెటైరికల్ గా స్పందిస్తూ ఉంటాడు. అతడి ప్రశంసలు సైతం వ్యంగ్యంగానే ఉంటాయన్న సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా మరోసారి తనలో ఉన్న వాక్ చాతుర్యాన్ని ఓ టీమిండియా యంగ్ పేసర్ పై ప్రయోగించాడు. ఐపీఎల్ 2024లో భాగంగా తాజాగా ముంబై ఇండియన్స్ వర్సెస్ కోల్ కత్తా మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో 18 పరుగుల తేడాతో కేేకేఆర్ విజయం సాధించింది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించాడు కేకేఆర్ బౌలర్ వరుణ్ చక్రవర్తి. అతడు 4 ఓవర్లలో కేవలం 17 రన్స్ మాత్రమే ఇచ్చి రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా లాంటి కీలక బ్యాటర్లను అవుట్ చేశాడు.

ఈ క్రమంలోనే అతడి ఫర్పామెన్స్ పై స్పందించాడు వీరేంద్ర సెహ్వాగ్..”వరుణ్ చక్రవర్తితో 4 ఓవర్లు వేయించి కేకేఆర్ గొప్ప నిర్ణయం తీసుకుంది. సునీల్ నరైన్, స్టార్క్ లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్లు ఉన్నప్పటికీ.. వరుణ్ ను ఎంచుకోవడం సాహసొపేత డెసిషన్. అయితే తనపై పెట్టుకున్న నమ్మకాన్ని అతడు నిలబెట్టుకున్నాడు. వరుణ్ ఈ మ్యాచే కాదు.. గత మ్యాచ్ ల్లో కూడా రాణించాడు. ఈ మెరుగైన ఆటతీరును ముందే ప్రదర్శించి ఉంటే.. అతడు కచ్చితంగా వరల్డ్ కప్ కి సెలెక్ట్ అయ్యేవాడే. కానీ అతడు ఆలస్యంగా రాణిస్తున్నాడు” అని వీరూ భాయ్ చెప్పుకొచ్చాడు. కాగా.. వరుణ్ చక్రవర్తి ఈ సీజన్ లో 18 వికెట్లు తీసుకున్నాడు. మరి వరుణ్ పై వీరూ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments