ధోనిని టార్గెట్‌ చేసిన సెహ్వాగ్‌, యువరాజ్‌! సంచలన వ్యాఖ్యలు

2011లో టీమిండియా గెలిచిన వరల్డ్‌ కప్‌ టీమ్‌లో చాలా మంది స్టార్‌ ఆటగాళ్లు ఉన్నారు. సచిన్‌ టెండూల్కర్‌, వీరేంద్ర సెహ్వాగ్‌, యువరాజ్‌ సింగ్‌, గౌతమ్‌ గంభీర్‌, హర్భజన్‌ సింగ్‌, జహీర్‌ ఖాన్‌, విరాట్‌ కోహ్లీ.. వీళ్లలో కొంతమందికి సరైన గుర్తింపు దక్కలేదనే వాదన ఉంది. ముఖ్యంగా వరల్డ్‌ కప్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నీగా నిలిచిన యువరాజ్‌ సింగ్‌, అద్భుత ఓపెనింగ్స్‌ ఇచ్చిన సెహ్వాగ్‌, ఫైనల్‌లో టాప్‌ స్కోరర్‌గా కీలక ఇన్నింగ్స్‌ ఆడిన గంభీర్‌కు క్రెడిట్‌ దక్కలేదని చాలా మంది క్రికెట్‌ అభిమానులు ఫీల్‌ అవుతుంటారు. దీనిపై గంభీర్‌ అనేకసార్లు బహిరంగంగానే విమర్శలు చేశాడు. ధోని ఒక్కడి వల్లే వరల్డ్‌ కప్‌ రాలేదని, టీమ్‌ అంతా కష్టపడితే వచ్చిందని చెప్పేవాడు. భజ్జీ కూడా గంభీర్‌ వ్యాఖ్యను సమర్ధించేవాడు.

వీరిద్దరు తప్పితే.. మిగతా వారేవరూ కూడా ధోనికి దక్కిన క్రెడిట్‌ గురించి ఎలాంటి కామెంట్లు చేయలేదు. కానీ, తాజాగా మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరేందర్‌ సెహ్వాగ్‌ చేసిన ఓ కామెంట్‌ తీవ్ర దుమారం రేపింది. దానికి యువరాజ్‌ సింగ్‌ వత్తాసు పలకడంతో మరింత చర్చనీయాంశంగా మారింది. అయితే.. సెహ్వాగ్‌, యువీ.. ధోనిని టార్గెట్‌ చేస్తూనే ఈ వ్యాఖ్యలు చేశారంటూ చాలా మంది నెటిజన్లు భావిస్తున్నారు. ఇంతకీ సెహ్వాగ్‌ ఏం అన్నాడు, దానికి యువీ ఎలా మద్దతు తెలిపాడో ఇప్పుడు తెలుసుకుందాం..

కొన్ని రోజుల క్రితం సెహ్వాగ్‌ తన ఇన్‌స్టా అకౌంట్‌లో ‘కొంత మంది ఎన్ని రకాల మొఖాలు మారుస్తారంటే.. వాళ్ల ఫేస్ వాష్ చాలా త్వరగా అయిపోతుంది’ అని పోస్ట్‌ చేశాడు.’ఇలా రెండు మొఖాలతో ఉండే వాళ్లు చాలా డేంజర్‌. మీరు ఎప్పుడైనా ఇలాంటి వాళ్లను కలిశారా? వాళ్లని ఎలా డీల్ చేశారు? మీ అనుభవాలు చెప్పండి ప్లీజ్’ అని సెహ్వాగ్ కోరాడు. దీంతో సెహ్వాగ్ ఎవరిని ఉద్దేశించి ఈ కామెంట్స్ చేశాడో అని నెటిజన్లు, క్రికెట్‌ అభిమానులు తెగ ఆలోచనలో పడిపోయారు.

సెహ్వాగ్‌ పోస్టుకు యవరాజ్ సింగ్.. ‘గ 20 ఏళ్లలో ఇలాంటి వాళ్లను చాలా మందిని మనమే చూశాం కదా’ అని బదులు ఇవ్వడంతో సెహ్వాగ్‌ పోస్టు మరింత ఇంట్రస్టింగ్‌గా మారింది. ఈ కామెంట్లు టీమిండియా మాజీ కెప్టెన్‌ ధోనిని ఉద్దేశించి అంటున్నారని చాలా మంది సోషల్‌ మీడియాలో పేర్కొంటున్నారు. తమకు క్రెడిట్‌ దక్కకుండా చేశాడనే కోపంతో ఇలా చెబుతున్నారంటూ కొంతమంది అంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: వన్డేల్లో ప్రపంచ నంబర్‌ వన్‌గా పాకిస్థాన్‌! మరి భారత్‌?

Show comments