T20 World Cup: పాకిస్థాన్‌ను ఓడించడానికి ఆ భారత క్రికెటర్‌ ఒక్కడు చాలు: మిస్బా

T20 World Cup: పాకిస్థాన్‌ను ఓడించడానికి ఆ భారత క్రికెటర్‌ ఒక్కడు చాలు: మిస్బా

T20 World Cup 2024, IND vs PAK, Misbah ul Haq: టీ20 వరల్డ్‌ కప్‌లో పాకిస్థాన్‌ను ఓడించడానికి టీమిండియాలోని ఆ ఒక్క ప్లేయర్‌ చాలంటూ.. అతని దమ్ము అంతుందని పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ అన్నాడు. మరి ఆ ఒక్కడు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

T20 World Cup 2024, IND vs PAK, Misbah ul Haq: టీ20 వరల్డ్‌ కప్‌లో పాకిస్థాన్‌ను ఓడించడానికి టీమిండియాలోని ఆ ఒక్క ప్లేయర్‌ చాలంటూ.. అతని దమ్ము అంతుందని పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ అన్నాడు. మరి ఆ ఒక్కడు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

టీ20 వరల్డ్‌ కప్‌ 2024 మ్యాచ్‌ల కోసం అంతా ఎదురుచూస్తున్నా.. అన్ని మ్యాచ్‌ల కంటే ఎక్కువగా ఎదురుచూసేది మాత్రం ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌ గురించే. ఈ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు లేకపోవడంతో.. ఐసీసీ ఈవెంట్స్‌లో మాత్రమే భారత్‌-పాక్‌ జట్లు తలపడుతున్నాయి. దీంతో ఇండియా వర్సెస్‌ పాకిస్థాన్‌ మ్యాచ్‌ అంటే ఉండే క్రేజ్‌ మరింత పెరిగింది. ఈ టీ20 వరల్డ్‌ కప్‌లో జూన్‌ 9న న్యూయార్క్‌ వేదికగా ఈ రెండు జట్లు పోటీ పడుతున్నాయి. అయితే.. ఈ మ్యాచ్‌లో తమ టీమ్‌ గెలుస్తుందంటే.. తమ జట్టు గెలుస్తుందంటూ.. రెండు దేశాల క్రికెట్‌ అభిమానులు చెబుతున్నారు. కానీ, వరల్డ్‌ కప్స్‌లో పాకిస్థాన్‌పై టీమిండియాకు తిరుగులేని రికార్డ్‌ ఉంది. అయితే.. ఇదే విషయంపై పాకిస్థాన్‌ దిగ్గజ మాజీ కెప్టెన్‌ మిస్బా ఉల్‌ హక్‌ స్పందిస్తూ.. పాకిస్థాన్‌ను అడ్డుకోవడానికి అతనొక్కడు చాలంటూ పేర్కొన్నాడు.

టీమిండియాలోని ఆ ఒక్క ఆటగాడు చాలా పాకిస్థాన్‌కు విజయానికి మధ్య అడ్డుపడేందుకు అని తెలిపాడు. ఇంతకీ మిస్బా ఉల్‌ హక్‌ ఈ రేంజ్‌ ఎలివేషన్‌ ఇచ్చింది ఎవరికో తెలుసా? టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ గురించి. పాకిస్థాన్‌కు ఉన్న అతి పెద్ద ముప్పు విరాట్‌ కోహ్లీ అని మిస్బా పేర్కొన్నాడు. ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌లో ప్రెజర్‌ను ఎవరైతే బాగా హ్యాండిల్‌ చేయగలరో వాళ్లే గెలుస్తారని అతను స్పష్టం చేశాడు. ఆ విషయంలో కోహ్లీ ముందుంటాడని.. ఎంత ఒత్తిడి ఉంటే అంత బాగా ఆడే ప్లేయర్‌ కోహ్లీని అన్నాడు. గత టీ20 వరల్డ్‌ కప్‌లో ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌లో జరిగింది అదే కదా.. పాకిస్థాన్‌ చేతుల్లో ఉన్న మ్యాచ్‌ను విరాట్‌ కోహ్లీ ఎంతో అద్భుతంగా లాక్కున్నాడు అని మిస్బా గుర్తుచేశాడు.

విరాట్‌ కోహ్లీతో పాటు టీమిండియాలోని మరో స్టార్‌ బౌలర్‌ జస్ప్రీత్‌ బుమ్రా కూడా పాకిస్థాన్‌కు డేంజర్‌గా మారొచ్చని అన్నాడు. కొత్త బంతితో అలాగే పాత బంతితో కూడా బుమ్రా అద్భుతంగా బౌలింగ్‌ చేయగలడని, బుమ్రాను ఒక బౌలర్‌గా ఎంతో ఇష్టపడతానని మిస్బా తెలిపాడు. ఈ టోర్నీలో బుమ్రా లాంటి ఒక ఎక్స్‌పీరియన్స్‌ బౌలర్‌.. ఎంతో డేంజరస్‌గా మారడం ఖాయం అని పేర్కొన్నాడు. మరి టీమిండియా స్టార్‌ ప్లేయర్‌ విరాట్‌ కోహ్లీ, జస్ప్రీత్‌ బుమ్రా గురించి పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ మిస్బా ఉల్‌ హక్‌ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments