వీడియో: మ్యాచ్‌ గెలిచేశామని సంబురాలు చేసుకున్న కోహ్లీ-గంభీర్‌! ఆ వెంటనే..

వీడియో: మ్యాచ్‌ గెలిచేశామని సంబురాలు చేసుకున్న కోహ్లీ-గంభీర్‌! ఆ వెంటనే..

శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. మ్యాచ్ గెలవకముందే విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ చేసిన పని నెట్టింట వైరల్ గా మారింది. అసలేం జరిగిందంటే?

శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. మ్యాచ్ గెలవకముందే విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ చేసిన పని నెట్టింట వైరల్ గా మారింది. అసలేం జరిగిందంటే?

శ్రీలంకతో జరిగిన ఫస్ట్ వన్డేలో 15 బంతుల్లో టీమిండియా విజయానికి కావాల్సిన పరుగులు కేవలం ఒకే ఒక్క రన్ మాత్రమే. చేతిలో ఇంకా రెండు వికెట్లు ఉన్నాయి. ఈ గణాంకాలు చూసిన తర్వాత నిస్సందేహంగా భారత్ విజయం సాధిస్తుందనిపిస్తుంది. కానీ ఈ మ్యాచ్ లో అందుకు పూర్తి విరుద్దంగా ఫలితం వచ్చింది. టీమిండియా ఆటగాళ్ల నిర్లక్ష్యం కారణంగా మ్యాచ్ టై అయ్యింది. అయితే ఈ మ్యాచ్ లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. మ్యాచ్ గెలిచేశామని సంబురాలు చేసుకున్నారు విరాట్ కోహ్లీ, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్. కానీ ఆ వెంటనే జరిగింది చూసి కంగుతిన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

శ్రీలంకపై టీ20 సిరీస్ క్లీన్ స్వీప్ చేసి మంచి జోరుమీదున్న టీమిండియా.. అదే జోరును వన్డే సిరీస్ లో కూడా కొనసాగించాలని భావించింది. కానీ అనూహ్యంగా తొలి మ్యాచ్ లోనే లంక గట్టి ప్రదర్శన ఇచ్చి భారత జోరుకు అడ్డుకట్టవేసింది. కొలంబో వేదికగా జరిగిన తొలి వన్డే టైగా ముగియడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక ఈ మ్యాచ్ లో భారత్ విజయం సాధిస్తుందని ముందుగానే డ్రెస్సింగ్ రూమ్ లో సంబరాలు చేసుకున్నారు విరాట్ కోహ్లీ, కోచ్ గౌతమ్ గంభీర్. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలేం జరిగిందంటే?

టీమిండియా గెలవాలంటే 16 బంతుల్లో 5 పరుగులు చేయాలి. ఈ దశలో క్రీజ్ లో శివమ్ దూబే, మహ్మద్ సిరాజ్ ఉన్నారు. ఇక క్రమంలో అసలంక వేసిన ఓవర్లో 3వ బంతిని ఫోర్ గా మలిచాడు దూబే. దాంతో విజయానికి 15 బంతుల్లో 1 రన్ మాత్రమే అవసరం అయ్యింది. దూబే జోరుమీదున్నాడు, ఎలాగో టీమిండియా విజయం ఖాయం అనుకుని డ్రెస్సింగ్ రూమ్ లో ఉన్న విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ సంతోషంతో చప్పట్లు కొడుతూ గెలుపు సంబురాలు చేసుకున్నారు. అయితే ఆ సంతోషం ఎంతో సేపు ఉంచలేదు అసలంక. ఆ తర్వాత బాల్ కే దూబేను ఎల్బీగా బలిగొని, తర్వాత క్రీజ్ లోకి వచ్చిన అర్షదీప్ ను కూడా పెవిలియన్ కు చేర్చి.. మ్యాచ్ ను టైగా ముగించి అందరికి ఊహించని షాకిచ్చాడు. మ్యాచ్ గెలవకముందే సంబురాలు చేసుకున్న కోహ్లీ-గంభీర్ ఈ వెంటనే మెుఖం చిన్నబుచ్చుకుని, నిరాశగా కూర్చున్నారు. మరి ముందే గెలిచేశామని కోహ్లీ, గంభీర్ సంబురాలు చేసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments