iDreamPost
android-app
ios-app

IND vs AFG: ఆఫ్ఘాన్‌తో సూపర్‌ 8 మ్యాచ్‌ టీమిండియాకు భారీ గుడ్‌ న్యూస్‌!

  • Published Jun 19, 2024 | 8:15 PM Updated Updated Jun 19, 2024 | 8:15 PM

Virat Kohli, IND vs AFG, T20 World Cup 2024: టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో భాగంగా సూపర్‌ 8లో ఆఫ్ఘనిస్థాన్‌తో మ్యాచ్‌కి ముందు టీమిండియా అదిరిపోయే గుడ్‌న్యూస్‌ ఒకటి అందుతోంది. అదేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

Virat Kohli, IND vs AFG, T20 World Cup 2024: టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో భాగంగా సూపర్‌ 8లో ఆఫ్ఘనిస్థాన్‌తో మ్యాచ్‌కి ముందు టీమిండియా అదిరిపోయే గుడ్‌న్యూస్‌ ఒకటి అందుతోంది. అదేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

  • Published Jun 19, 2024 | 8:15 PMUpdated Jun 19, 2024 | 8:15 PM
IND vs AFG: ఆఫ్ఘాన్‌తో సూపర్‌ 8 మ్యాచ్‌ టీమిండియాకు భారీ గుడ్‌ న్యూస్‌!

టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో భాగంగా టీమిండియా గురువారం ఆఫ్ఘనిస్థాన్‌తో మ్యాచ్‌ ఆడనుంది. బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరగనుంది. పసికూన ఆఫ్ఘాన్‌తో మ్యాచ్‌ అయినా కూడా టీమిండియా ఎంతో సీరియస్‌గా తీసుకుంది. ఎందుకంటే.. ఈ టోర్నీలో ఆఫ్ఘాన్‌ జట్టు న్యూజిలాండ్‌ లాంటి స్ట్రాంగెస్ట్‌ టీమ్‌ను మట్టికరిపించిన సంగతి తెలిసిందే. అందుకే ఆ జట్టును తేలిగ్గా తీసుకోవడం లేదు రోహిత్‌ సేన. అయితే.. ఈ మ్యాచ్‌తో టీమిండియాకు భారీ లాభం జరిగేలా కనిపిస్తోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

ఈ మెగా టోర్నీలో టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ ఫామ్‌లో లేని విషయం తెలిసిందే. గ్రూప్‌ స్టేజ్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో కోహ్లీ.. 1, 4, 0 పరుగులు మాత్రమే చేసి చాలా నిరాశ పర్చాడు. కెనడాతో మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు కావడంతో నేరుగా టీమిండియా సూపర్‌ 8 మ్యాచ్‌లు ఆడుతోంది. అయితే.. గ్రూప్‌ స్టేజ్‌లో టీమిండియా.. ఐర్లాండ్‌, పాకిస్థాన్‌, యూఎస్‌ఏ లాంటి చిన్న టీమ్స్‌తోనే మ్యాచ్‌లు ఆడింది. పాకిస్తాన్‌ మినహా టీమిండియాకు గట్టి పోటీ ఎవరూ ఇవ్వలేదు. కానీ, సూపర్‌ 8లో అలా కాదు. ఆఫ్ఘనిస్థాన్‌, బంగ్లాదేశ్‌ చిన్న టీమ్స్‌లా కనిపిస్తున్నా.. వాటిని తక్కువ అంచనా వేయకూడదు. ఇక మనకు ట్రోఫీలు రాకుండా అడ్డుపడే ఆస్ట్రేలియా ఉండనే ఉంది.

ఇలాంటి టీమ్స్‌తో మ్యాచ్‌లకు కోహ్లీ ఫామ్‌లో లేకపోవడం టీమిండియాను ఇబ్బంది పెట్టొచ్చు. అయితే.. సూపర్‌ 8లో తొలి మ్యాచ్ ఆఫ్ఘనిస్థాన్‌తో కావడంతో కోహ్లీ కచ్చితంగా ఫామ్‌లోకి వస్తాడని క్రికెట్‌ అభిమానులు భావిస్తున్నారు. అంత నమ్మకం ఎందుకంటే.. గతంలో అంటే 2022లో కూడా కోహ్లీ ఫామ్‌ కోల్పోయి కాస్త ఇబ్బంది పడ్డాడు. ఆ టైమ్‌లోనే 2022 సెప్టెంబర్‌ 8న ఇండియా, ఆఫ్ఘనిస్థాన్‌ మధ్య టీ20 మ్యాచ్‌ జరిగింది. ఆ మ్యాచ్‌లో కోహ్లీ ఏకంగా సెంచరీతో ఫామ్‌లోకి తిరిగి వచ్చాడు. 61 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్సులతో 122 పరుగులు చేసి టీ20ల్లో తొలి సెంచరీ బాది.. ఫామ్‌ను అందిపుచ్చుకన్నాడు. ఆ తర్వాత ఈ రెండేళ్లలో ఎలాంటి విధ్వంసం సృష్టించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఐపీఎల్‌ 2023లో అదరగొట్టాడు, వన్డే వరల్డ్‌ కప్‌ 2023 టాప్‌ రన్‌ గెట్టర్‌గా నిలిచాడు, ఐపీఎల్‌ 2024లో టాప్‌ రన్‌ స్కోరర్‌గా ఆరెంజ్‌ క్యాప్‌ అందుకున్నాడు. కానీ, ఇప్పుడు టీ20 వరల్డ్‌ కప్‌లో మాత్రం ఇంకా తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. 2022లో ఫామ్‌లో లేని కోహ్లీని ఆఫ్ఘనిస్థాన్‌ ఫామ్‌లోకి తెచ్చింది.. ఇప్పుడు కూడా అదే ఆఫ్ఘాన్‌ జట్టు కోహ్లీని ఫామ్‌లోకి తెస్తుందని భారత క్రికెట్‌ అభిమానులు భావిస్తున్నారు. సూపర్‌ 8 తొలి మ్యాచ్‌తోనే కోహ్లీ ఫామ్‌లోకి వస్తే.. ఇక వరల్డ్‌ కప్‌లోని మిగతా మ్యాచ్‌ల్లో అల్లాడిస్తాడనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరి కోహ్లీ, ఆఫ్ఘాన్‌ బాండింగ్‌ మళ్లీ రిపీట్‌ కావాలని ఫ్యాన్స్‌ కోరుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.