iDreamPost
android-app
ios-app

SRHతో మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ కావాలనే అవుట్‌ అయ్యాడా? తెరపైకి సంచలన విషయం!

  • Published Apr 26, 2024 | 12:47 PM Updated Updated Apr 26, 2024 | 12:47 PM

Virat Kohli, SRH vs RCB, IPL 2024: ఆర్సీబీకి ఎట్టకేలకు ఈ సీజన్‌లో రెండో విజయం దక్కింది. అయితే.. ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ కావాలనే అవుట్‌ అయ్యాడనే టాక్‌ వినిపిస్తోంది. దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం..

Virat Kohli, SRH vs RCB, IPL 2024: ఆర్సీబీకి ఎట్టకేలకు ఈ సీజన్‌లో రెండో విజయం దక్కింది. అయితే.. ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ కావాలనే అవుట్‌ అయ్యాడనే టాక్‌ వినిపిస్తోంది. దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం..

  • Published Apr 26, 2024 | 12:47 PMUpdated Apr 26, 2024 | 12:47 PM
SRHతో మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ కావాలనే అవుట్‌ అయ్యాడా? తెరపైకి సంచలన విషయం!

పటిష్టమైన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు విజయం సాధించిన విషయం తెలిసిందే. వరుస ఓటములతో సతమతమవుతూ.. ప్లే ఆఫ్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న ఆర్సీబీ.. ఎట్టకేలకు ఈ సీజన్‌లో రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ.. ఎస్‌ఆర్‌హెచ్‌ ముందు 207 పరుగుల టార్గెట్‌ను ఉంచింది. అయితే.. ఈ టార్గెట్‌ను ఎస్‌ఆర్‌హెచ్‌ ఈజీగా ఛేజ్‌ చేస్తుందని అంతా భావించారు. కానీ, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. ఆర్సీబీ బౌలర్లు చెలరేగి ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటర్లను కేవలం 171 పరుగులకే కట్టడి చేసి.. 35 పరుగుల తేడాతో సన్‌రైజర్స్‌ను ఓడించారు. అయితే.. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ కావాలనే అవుట్‌ అయినట్లు కొంతమంది క్రికెట్‌ అభిమానులు సోసల్‌ మీడియా వేదికగా కామెంట్‌ చేస్తున్నారు.

ఈ మ్యాచ్‌లో డుప్లెసిస్‌తో కలిసి ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన విరాట్‌ కోహ్లీ ఆరంభం నుంచే ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అభిషేక్‌ శర్మ వేసిన తొలి ఓవర్‌లో అలాగే కమిన్స్‌ వేసిన మూడో ఓవర్‌, నటరాజన్‌ వేసిన ఇన్నింగ్స్‌ నాలుగో ఓవర్‌లో తొలి బంతికే బౌండరీ బాది.. బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టే ప్రయత్నం చేశాడు. కేవలం 16 బంతుల్లోనే 31 పరుగులు చేసి.. మంచి టచ్‌లో కనిపించాడు. కానీ, ఓపెనర్‌ డుప్లెసిస్‌, ఆ వెంటనే విల్‌ జాక్స్‌ అవుట్‌ కావడంతో కోహ్లీ వికెట్లు కాపాడే ప్రయత్నంలో స్లోగా ఆడాడు. మరో ఎండ్‌లో రజత్‌ పాటిదార్‌ వేగంగా ఆడుతుండటంతో అతనికి ఎక్కుకగా స్ట్రైక్‌ ఇస్తూ.. యాంకర్‌ రోల్‌ పోషిస్తూ.. సింగిల్స్‌కి పరిమితం అయ్యాడు. ఎందుకంటే ఆ టైమ్‌లో తన వికెట్‌ పడితే.. ఇన్నింగ్స్‌ కొలాప్స్‌ అవుతుందనే విషయం కోహ్లీకి బాగా తెలుసు.

అందుకే జాగ్రత్తగా ఆడాడు. కానీ, రన్‌రేట్‌ బాగా డల్‌ అయిపోవడంతో కోహ్లీ తిరిగి గేర్‌ ఛేంజ్‌ చేయాల్సిన అవసరం వచ్చింది. కానీ, ఎంత ప్రయత్నించినా భారీ షాట్లు రాకపోవడం, అప్పటికే ఎక్కువగా రన్స్‌ కోసం పరిగెత్తి బాగా అలసిపోయినా కోహ్లీ.. బాల్‌ను సరిగా టైమ్‌ చేయలేకపోతుండటంతో.. కొత్త బ్యాటర్‌ క్రీజ్‌లోకి వస్తే.. బాల్‌ను బలంగా బాదగలడని భావించి.. ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్‌ జయదేవ్‌ ఉనద్కట్‌ వేసిన ఇన్నింగ్స్‌ 15వ ఓవర్‌ ఐదో బంతికి స్లో షార్ట్‌ పిచ్‌ బాల్‌కి ఫీల్డర్‌ చేతుల్లోకి బాల్‌ ఆడేసి.. తన వికెట్‌ను కోహ్లీ త్యాగం చేసినట్లు కొంతమంది క్రికెట్‌ అభిమానులు భావిస్తున్నారు. అయితే.. కోహ్లీ అవుట్‌ అయిన తర్వాత.. అతను ఆశించనంత పెద్ద స్కోర్‌ రాకపోయినా.. 200 మార్క్‌ దాటడంతో ఆర్సీబీ పటిష్ట స్థితిలోనే నిలిచింది. మరి ఈ మ్యాచ్‌లో కోహ్లీ కావాలనే అవుట్‌ అయ్యాడని వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.