వీడియో: బంగ్లాదేశ్ పరువు తీసిన కోహ్లీ.. వాళ్ల స్టైల్​లోనే ఇచ్చిపడేశాడు!

Virat Kohli Unleashes Iconic Snake Pose: టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ తనను ఎవరైనా గెలికితే అస్సలు ఊరుకోడు. వాళ్ల అంతు చూసే దాకా వదలడు. రెచ్చగొడితే వాళ్ల కెరీర్ ఫినిష్ చేసేస్తాడు.

Virat Kohli Unleashes Iconic Snake Pose: టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ తనను ఎవరైనా గెలికితే అస్సలు ఊరుకోడు. వాళ్ల అంతు చూసే దాకా వదలడు. రెచ్చగొడితే వాళ్ల కెరీర్ ఫినిష్ చేసేస్తాడు.

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో పెట్టుకోవాలంటేనే అపోజిషన్ టీమ్స్ వణుకుతాయి. ఇతడితో ఎందుకొచ్చిన తంటా అని సైలెంట్ అయిపోతాయి. అతడ్ని గెలికితే తమ పని పడతాడని.. అంతు చూసేదాకా వదలడని ప్రత్యర్థి ఆటగాళ్లకు తెలుసు. అందుకే కింగ్​ను రెచ్చగొట్టేంత ధైర్యం చేయరు. ఎక్కడ భారీ ఇన్నింగ్స్​లతో తమ మీద పిడుగులా పడతాడోనని ముందు జాగ్రత్త పడతారు. అయితే అవతలి జట్టు ఏమనకపోయినా కోహ్లీనే వాళ్లను గెలికిన సందర్భాలు కూడా ఉన్నాయి. పాత శత్రుత్వాన్ని మనసులో పెట్టుకొని స్లెడ్సింగ్​కు దిగడం చూసే ఉంటారు. తాజాగా అలాంటి పనే చేశాడు విరాట్. బంగ్లాదేశ్​ పరువు తీశాడతను. వాళ్ల స్టైల్​లోనే గట్టిగా ఇచ్చిపడేశాడు. అసలు కోహ్లీ ఏం చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం..

చెన్నై టెస్ట్​లో బంగ్లాదేశ్ గాలి తీసేశాడు కోహ్లీ. ఆ టీమ్ బ్యాటింగ్ టైమ్​లో ఫీల్డింగ్ చేస్తున్న విరాట్.. స్నేక్ పోజ్​తో విజిటింగ్ టీమ్ పరువు తీసేశాడు. స్నేక్ పోజ్​ను బంగ్లా జట్టు ఐకానిక్ పోజ్​గా మార్చేసింది. ఆ టీమ్ విన్నింగ్ టైమ్​లో దీన్ని బాగా వాడుతూ ఉంటుంది. భారత్​ మీద గెలిచిన కొన్ని సందర్భాల్లో కూడా దీన్ని వాళ్లు రిపీట్ చేశారు. ఇటీవల బంగ్లా కెప్టెన్ షంటో భారత్​ను ఓడిస్తామంటూ కాస్త అతి చేశాడు. ఇవన్నీ మనసులో పెట్టుకున్నాడేమో.. ఫస్ట్ టెస్ట్​లో స్నేక్ టీమ్ పనైపోయిందనే అర్థంలో తన చేతులతో పోజు ఇచ్చాడు కోహ్లీ. ఆడియెన్స్ వైపు చూపిస్తూ బంగ్లా ఖేల్ ఖతం అనేలా గాలి తీసేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్స్.. ప్రత్యర్థి జట్టుకు గట్టిగా ఇచ్చిపడేశాడని అంటున్నారు. మనతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుందని చెబుతున్నారు.

టెస్ట్ సిరీస్ మొదలవక ముందు పలు సందర్భాల్లో టీమిండియాను రెచ్చగొడుతూ బంగ్లాదేశ్ ఓవరాక్షన్ చేసింది. ఇటీవల పాకిస్థాన్​ను వాళ్ల సొంతగడ్డపై వైట్​వాష్​ చేయడంతో బంగ్లాలో ఓవర్ కాన్ఫిడెన్స్​ పెరిగింది. దీంతో టీమిండియాను కూడా ఓడిస్తామంటూ ఆ జట్టు కెప్టెన్ నజ్ముల్ హసన్ షంటో అతి చేశాడు. సీన్ కట్ చేస్తే తొలి టెస్టులో ఆ టీమ్ ఓటమి ముంగిట నిలిచింది. బంగ్లా విజయానికి ఇంకా 357 పరుగులు కావాలి. చేతిలో 6 వికెట్లు ఉన్నాయి. షంటో, షకీబ్ క్రీజులో ఉన్నారు. ఇంకా లిటన్ దాస్ రూపంలో మరో ప్రధాన బ్యాటర్ మాత్రమే మిగిలాడు. వీళ్లలో ఏ ఇద్దరు ఔట్ అయినా మ్యాచ్ రేపు లంచ్ లోపే ముగుస్తుంది. ఒకవేళ పోరాడితే డే-4 మూడో సెషన్ వరకు వెళ్లొచ్చు. కానీ బుమ్రా, అశ్విన్ జోరు చూస్తుంటే రేపు తొలి గంటలోనే బంగ్లా కథ ముగిసేలా ఉంది. మరి.. ఈ మొత్తం వ్యవహారంపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

Show comments