iDreamPost
android-app
ios-app

డొమెస్టిక్ క్రికెట్​కు కోహ్లీ గ్రీన్ సిగ్నల్! ఏ టోర్నీలో ఆడనున్నాడంటే..?

  • Published Sep 25, 2024 | 2:52 PM Updated Updated Sep 25, 2024 | 2:52 PM

Virat Kohli To Play In Ranji Trophy 2024: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇంటర్నేషనల్ క్రికెట్​తో ఫుల్ బిజీగా ఉన్నాడు. నిన్న మొన్నటి వరకు రెస్ట్ మోడ్​లో ఉన్న కింగ్.. బంగ్లాదేశ్​ సిరీస్​తో బిజీ అయిపోయాడు. నెక్స్ట్ సుదీర్ఘ టెస్ట్ సీజన్ ఉండటంతో అతడ్ని రెగ్యులర్​గా యాక్షన్​లో చూడొచ్చు.

Virat Kohli To Play In Ranji Trophy 2024: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇంటర్నేషనల్ క్రికెట్​తో ఫుల్ బిజీగా ఉన్నాడు. నిన్న మొన్నటి వరకు రెస్ట్ మోడ్​లో ఉన్న కింగ్.. బంగ్లాదేశ్​ సిరీస్​తో బిజీ అయిపోయాడు. నెక్స్ట్ సుదీర్ఘ టెస్ట్ సీజన్ ఉండటంతో అతడ్ని రెగ్యులర్​గా యాక్షన్​లో చూడొచ్చు.

  • Published Sep 25, 2024 | 2:52 PMUpdated Sep 25, 2024 | 2:52 PM
డొమెస్టిక్ క్రికెట్​కు కోహ్లీ గ్రీన్ సిగ్నల్! ఏ టోర్నీలో ఆడనున్నాడంటే..?

టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇంటర్నేషనల్ క్రికెట్​తో ఫుల్ బిజీగా ఉన్నాడు. నిన్న మొన్నటి వరకు రెస్ట్ మోడ్​లో ఉన్న కింగ్.. బంగ్లాదేశ్​ సిరీస్​తో బిజీ అయిపోయాడు. అంతకుముందు వరుసగా ఐపీఎల్, టీ20 వరల్డ్ కప్​లో ఆడి బాగా అలసిపోవడంతో కొన్నాళ్లు విశ్రాంతి తీసుకున్నాడు విరాట్. ఆ తర్వాత శ్రీలంకతో వన్డే సిరీస్​లో ఆడాడు. ఆ సిరీస్ ముగిశాక ఏడు వారాల రెస్ట్ దొరకడంతో ఫ్యామిలీతో కలసి లండన్​లో వెకేషన్​ను ఎంజాయ్ చేశాడు. మళ్లీ బంగ్లాదేశ్​ సిరీస్ కోసం స్వదేశానికి వచ్చిన కోహ్లీ.. ఇప్పుడు వరుస సిరీస్​లతో ఫుల్ బిజీ అయిపోయాడు. బంగ్లా సిరీస్ పూర్తయిన తర్వాత రెండు వారాల గ్యాప్​లో న్యూజిలాండ్ సిరీస్​లో ఆడనున్నాడు. అది కంప్లీట్ అయ్యాక ఇంకొంత గ్యాప్ తీసుకొని బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియాకు పయనం కానున్నాడు. ఇలాంటి తరుణంలో కోహ్లీ మరో కీలక నిర్ణయం తీసుకున్నాడు. డొమెస్టిక్ క్రికెట్​లో ఆడాలని అతడు డిసైడ్ అయ్యాడు.

రంజీ ట్రోఫీ-2024 సీజన్​తో డొమెస్టిక్ క్రికెట్​లోకి కోహ్లీ కమ్​బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు. ఢిల్లీ తరఫున ఆడాలని అనుకుంటున్నాడు. ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) వచ్చే రంజీ సీజన్ కోసం 84 మంది ప్లేయర్లతో కూడిన ప్రాబబుల్స్​ను ఇవాళ ప్రకటించింది. ఇందులో కోహ్లీతో పాటు మరో టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ పేరు కూడా ఉంది. వీరితో పాటు వెటరన్ పేసర్లు నవ్​దీప్ సైనీ, ఇషాంత్ శర్మ కూడా ఈ ప్రాబబుల్స్​లో చోటు దక్కించుకున్నారు. అక్టోబర్ 11 నుంచి రంజీ ట్రోఫీ మొదలవనుంది. అయితే ఇదే నెలలో కివీస్​తో టీమిండియా సిరీస్ ఉంది. దీంతో కోహ్లీ రంజీ ట్రోఫీలో ఆడతాడా? లేదా? అనేది అనుమానంగా మారింది. అక్టోబర్ 16 నుంచి భారత్-న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ మొదలవనుంది. ఈ సిరీస్ ముగిశాక డొమెస్టిక్ క్రికెట్​లో కోహ్లీ ఆడే అవకాశాలు ఉన్నాయని క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది.

నేషనల్ డ్యూటీ లేని టైమ్​లో ప్రతి ప్లేయర్ దేశవాళీ టోర్నీల్లో ఆడాల్సిందేనని ఇటీవల బీసీసీఐ రూల్ తీసుకొచ్చిన సంగతి తెలిసింది. ఇందులో భాగంగానే రీసెంట్​గా ముగిసిన దులీప్ ట్రోఫీలో శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ సహా దాదాపుగా అందరు టీమిండియా స్టార్లు ఆడారు. అయితే రోహిత్, కోహ్లీ, బుమ్రా, అశ్విన్ మాత్రం దూరంగా ఉన్నారు. భవిష్యత్తులో వీళ్లు కూడా డొమెస్టిక్​లో ఆడే అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్న తరుణంలో ఢిల్లీ రంజీ ప్రాబబుల్స్​ టీమ్​లో విరాట్ పేరు రావడంతో అతడు ఆడేందుకు డిసైడ్ అయ్యాడని ఎక్స్​పర్ట్స్ అంటున్నారు. ఏడాది చివర్లో ఆసీస్ టూర్ ఉన్న నేపథ్యంలో ఫామ్, ఫిట్​నెస్​ను మెరుగుపర్చుకునేందుకు దేశవాళీల్లో ఆడాలని అతడు భావిస్తున్నాడని చెబుతున్నారు. ఒకవేళ అదే జరిగితే దాదాపు 12 ఏళ్ల తర్వాత రంజీ టోర్నీలోకి కింగ్ అడుగు పెట్టినట్లవుతుంది. అతడి రాకతో టోర్నీ వైపు ఫ్యాన్స్ చూపు మరలుతుంది. టోర్నీకి క్రేజ్ మరింత పెరుగుతుంది. మరి.. కోహ్లీ రంజీల్లో ఆడితే చూడాలని ఉందా? మీ ఒపీనియన్​ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.