iDreamPost
android-app
ios-app

కొలంబో కింగ్ కోహ్లీ! 4 మ్యాచ్ ల్లో 4 సెంచరీలు!

  • Author Soma Sekhar Published - 08:05 PM, Mon - 11 September 23
  • Author Soma Sekhar Published - 08:05 PM, Mon - 11 September 23
కొలంబో కింగ్ కోహ్లీ! 4 మ్యాచ్ ల్లో 4 సెంచరీలు!

ఆసియా కప్ లో భాగంగా జరుగుతున్న గ్రూప్ 4 మ్యాచ్ లో టీమిండియా భారీ స్కోర్ చేసింది. పాకిస్థాన్ బౌలర్లను ఊచకోతకోస్తూ.. కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 356 పరుగుల భారీ స్కోర్ చేసింది. జట్టులో ఓపెనర్లు రోహిత్(56), గిల్(58) పరుగులు చేయగా.. టీమిండియా రన్ మెషిన్ కింగ్ విరాట్ కోహ్లీ తన 47వ సెంచరీని నమోదు చేసుకున్నాడు. 94 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్ లతో 122 రన్స్ తో అజేయంగా నిలిచాడు. అతడికి తోడు క్లాస్ బ్యాటర్, రీ ఎంట్రీ హీరో కేఎల్ రాహుల్ శతకంతో చెలరేగాడు. 106 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్ లతో 111 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అయితే కొలంబో గడ్డ అనగానే విరాట్ కోహ్లీకి పూనకం వస్తుందని మరోసారి రుజువైంది. కొలంబో గడ్డ.. విరాట్ అడ్డా అని మరోసారి నిరూపించాడు. ఈ గ్రౌండ్ లో విరాట్ 4 మ్యాచ్ ల్లో 4 సెంచరీలు బాది ఔరా అనిపించాడు.

పాకిస్థాన్ తో మ్యాచ్ అంటే చాలు రెచ్చిపోవడం కోహ్లీకి వెన్నతో పెట్టిన విద్య. మరి అలాంటి కోహ్లీకి అచ్చొచ్చిన గ్రౌండ్ లో పాక్ తో మ్యాచ్ అంటే.. ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కొలంబో వేదికగా ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఈమ్యాచ్ లో శతకంతో కదంతొక్కాడు రన్ మెషిన్ కింగ్ కోహ్లీ. 94 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్ లతో 122 రన్స్ తో అజేయంగా నిలిచాడు. వరల్డ్ క్లాస్ బౌలర్లు గా పేరుగాంచిన పాక్ పేస్ దళాన్ని దీటుగా ఎదుర్కొంటూ.. పరుగుల వరదపారించాడు. ఇక తనకు అచ్చొచ్చిన కొలంబో గ్రౌండ్ లో పాక్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.

ఈ గ్రౌండ్ లో కోహ్లీ ఆడిన నాలుగు మ్యాచ్ ల్లో నాలుగు సెంచరీలు చేయడం విశేషం. మూడు సెంచరీలు శ్రీలంకపై చేయగా.. తాజాగా పాక్ తో మ్యాచ్ లో నాలుగో శతకం బాది.. కొలంబో గడ్డ కోహ్లీ అడ్డాగా మార్చాడు. గత మూడు మ్యాచ్ ల్లో వరుసగా 128*, 131, 110* రన్స్ చేయగా.. తాజా మ్యాచ్ లో 122 పరుగులతో అజేయంగా నిలిచాడు. కాగా.. ఈ సెంచరీతో కింగ్ కోహ్లీ పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. మరి కొలంబో కింగ్ విరాట్ కోహ్లీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.