SNP
Virat Kohli, Khaleel Ahmed, T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్‌లో సూపర్ 8 మ్యాచ్‌లకు ముందు టీమిండియాకు ఓ బ్యాడ్ న్యూస్ అందుతోంది. మరి అదేంటో? ఎవరి విషయంలోనో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
Virat Kohli, Khaleel Ahmed, T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్‌లో సూపర్ 8 మ్యాచ్‌లకు ముందు టీమిండియాకు ఓ బ్యాడ్ న్యూస్ అందుతోంది. మరి అదేంటో? ఎవరి విషయంలోనో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
SNP
టీ20 వరల్డ్ కప్ 2024లో టీమిండియా కీలకమైన సూపర్ 8 మ్యాచ్‌లకు సిద్ధం అవుతోంది. ఈ నెల 20, 22, 24 తేదీల్లో మూడు మ్యాచ్‌లు ఆడనుంది రోహిత్ సేన. 20న ఆఫ్ఘనిస్థాన్‌తో, 22న బంగ్లాదేశ్‌తో, అలాగే 24న ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లు ఆడుతుంది. ఈ మూడు మ్యాచ్‌ల్లో రెండు మ్యాచ్‌లు గెలిస్తే.. టీమిండియాకు సెమీస్ చేరే అవకాశం ఉంటుంది. ఆస్ట్రేలియా ఒక్కటే స్ట్రాంగ్ టీమ్, మిగతా రెండు చిన్న జట్లే కదా అని అనుకుంటే.. పొరపాటు చేసినట్లే. స్పిన్‌కు అనుకూలించే పిచ్‌లపై ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ రెండూ కూడా చాలా చాలా డేంజరస్ జట్లుగా మారొచ్చు. టీమిండియా ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. ఎదురుదెబ్బ తగిలే ప్రమాదం ఉంది.
ఇంత కీలక సమయంలో.. టీమిండియాకు ఓ బ్యాడ్ న్యూస్ అందుతోంది. అదేంటంటే.. సూపర్ 8 మ్యాచ్‌ల కోసం టీమిండియా క్రికెటర్లు నెట్ ప్రాక్టీస్‌లో మునిగి తేలుతున్నారు. ఈ క్రమంలోనే టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సైతం నెట్స్‌లో బ్యాటింగ్‌ను ప్రాక్టీస్ చేస్తున్నాడు. కానీ, ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌ను ఎదుర్కొడానికి మాత్రం కోహ్లీ చాలా ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. మిగతా బౌలర్లను బాగానే ఆడుతున్న కోహ్లీ.. ఒక్క ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో ఇబ్బంది పడుతున్నాడు. ఇదే విషయం ఇప్పుడు ఇండియన్ ఫ్యాన్స్‌ను ఆందోళనకు గురిచేస్తోంది.
విరాట్ కోహ్లీకి లెఫ్ట్ ఆర్మ్ ఫేసర్ వీక్‌నెస్ ఉన్న విషయం తెలిసిందే. ఎడమచేతి పేసర్లను ఎదుర్కొవడంలో కోహ్లీ కాస్త ఇబ్బంది పడతాడు. ఈ టీ20 వరల్డ్ కప్‌లో తన స్థాయి ఫామ్‌లో లేని కోహ్లీ.. ఫామ్‌ను అందుకోవడానికి నెట్స్ తీవ్రంగా శ్రమిస్తున్నాడు. కానీ, లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అయిన ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో మాత్రం ఇబ్బంది పడుతున్నాడు. ఇదే ఇబ్బంది మ్యాచ్‌లో కూడా పడితే.. ఆఫ్ఘనిస్థాన్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఫారూఖీ బౌలింగ్‌లో కూడా కోహ్లీ ఇబ్బంది పడే అవకాశం ఉంది. సూపర్ 8 మ్యాచ్‌ల్లో కోహ్లీ కనుక విఫలం అయితే.. ఆ ప్రభావం జట్టుపై తీవ్రంగా పడుతుంది. ఇదే విషయం ఇప్పుడు భారత క్రికెట్ అభిమానులను కంగారు పెడుతోంది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Virat Kohli – The energy in practice sessions 🇮🇳 🌟 pic.twitter.com/gYF8aPB2CK
— Johns. (@CricCrazyJohns) June 19, 2024