iDreamPost

ఆ ఒక్క విషయంలో కోహ్లీ కన్నా రోహిత్ బెటర్! కింగ్ జర జాగ్రత్త!

  • Published Oct 20, 2023 | 3:48 PMUpdated Oct 21, 2023 | 3:36 PM

బంగ్లాదేశ్‌పై విరాట్‌ కోహ్లీ సెంచరీతో చెలరేగినా.. ఓ పెద్ద సమస్య అతన్నే కాదు.. అతని ఫ్యాన్స్‌ను సైతం కలవరపెడుతోంది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఎందులో అయితే బెటర్‌గా ఉన్నాడో.. అదే విషయంలో కోహ్లీ ఇబ్బంది పడుతున్నాడు. మరి ఆ సమస్య ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

బంగ్లాదేశ్‌పై విరాట్‌ కోహ్లీ సెంచరీతో చెలరేగినా.. ఓ పెద్ద సమస్య అతన్నే కాదు.. అతని ఫ్యాన్స్‌ను సైతం కలవరపెడుతోంది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఎందులో అయితే బెటర్‌గా ఉన్నాడో.. అదే విషయంలో కోహ్లీ ఇబ్బంది పడుతున్నాడు. మరి ఆ సమస్య ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Oct 20, 2023 | 3:48 PMUpdated Oct 21, 2023 | 3:36 PM
ఆ ఒక్క విషయంలో కోహ్లీ కన్నా రోహిత్ బెటర్! కింగ్ జర జాగ్రత్త!

బంగ్లాదేశ్‌పై టీమిండియా బంపర్‌ విక్టరీ కొట్టింది. వరల్డ్‌ కప్‌ లో బ్రేకుల్లేని బుల్లెట్‌ బండిలా దూసుకెళ్తున్న రోహిత్‌ సేన.. గురువారం పూణెలో బంగ్లా టైగర్లను సైతం మట్టి కరిపించింది. ఈ గెలుపుతో టీమిండియా ఖాతాలో వరుసగా నాలుగో విజయం వచ్చి చేరింది. ఈ మ్యాచ్‌ లో టీమిండియా స్టార్‌ బ్యాటర్‌, రన్‌ మెషీన్‌, ఛేజ్‌ మాస్టర్‌ విరాట్‌ కోహ్లీ అద్భుత సెంచరీతో అదరగొట్టాడు. ఈ సెంచరీతో తన వన్డే సెంచరీలో సంఖ్యను 48కి పెంచుకుని, ఓవరాల్‌ గా 78వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 97 బంతుల్లోనే 6 ఫోర్లు, 4 సిక్సులతో 103 రన్స్‌ చేసి.. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డును అందుకున్నాడు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఓ విషయం మాత్రం కింగ్‌ కోహ్లీని కలవరపెడుతోంది. అదే షార్ట్‌ బాల్‌ వీక్‌ నెస్‌.

అవును.. కింగ్‌ కోహ్లీ షార్ట్‌ పిచ్‌ బంతులకు ఇబ్బంది పడుతున్నాడు. కవర్‌ డ్రైవ్‌, ఫ్లిక్‌ షాట్‌, స్ట్రేట్‌ డ్రైవ్‌ లను అద్భుతంగా ఆడే కోహ్లీకి ఇప్పటి వరకు పెద్దగా ఏ బాల్స్‌ కు ఇబ్బంది పడడు అనే నమ్మకం క్రికెట్‌ అభిమానుల్లో ఉండేది. కానీ, గడిచిన కొన్ని మ్యాచ్‌ లు గమనిస్తే.. షార్ట్‌ పిచ్‌ బంతులను సరిగ్గా పుల్‌ షాట్‌ ఆడలేక ఇబ్బంది పడుతున్నట్లు కనిపిస్తోంది. టీమిండియా ఉన్న ఆటగాళ్లలో శ్రేయస్‌ అయ్యర్‌.. షార్ట్‌ పిచ్‌ బంతులకు బాగా ఇబ్బంది పడుతుంటాడు. అతను క్రీజ్‌ లోకి వస్తే చాలు ఏ ప్రత్యర్థి టీమ్‌ అయినా.. షార్ట్‌ పిచ్‌ లను సంధిస్తూ ఉంటుంది. కానీ, టీమిండియాలోనే మరో ప్లేయర్‌ ఉన్నాడు.. అతనికి షార్ట్‌ పిచ్‌ బాల్‌ వేస్తే.. నోట్లో చక్కెర వేసినట్లే. అతనే రోహిత్‌ శర్మ.

రోహిత్‌ శర్మ అద్భుతంగా పుల్‌ షాట్‌ ఆడతాడనే విషయం అందరికీ తెలిసిందే. రోహిత్‌ శర్మతో పోల్చుకుంటే.. విరాట్‌ కోహ్లీ షార్ట్‌ పిచ్‌ బంతులను ఆడలేకపోతున్నాడు. ఈ వరల్డ్‌ కప్‌ లో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌ లోనే అద్భుతంగా ఆడిన కోహ్లీ.. 85 పరుగుల వద్ద హెజల్‌ వుడ్‌ బౌలింగ్‌ లో షార్ట్‌ బాల్‌ కు వికెట్‌ సమర్పించుకున్నాడు. అదే మ్యాచ్‌లో మిచెల్‌ మార్ష్‌ ఓ క్యాచ్‌ వదిలేసిన విషయం తెలిసిందే. అది కూడా షార్ట్‌ బాలే. అలాగే పాకిస్థాన్‌ పై కూడా షార్ట్‌ బాల్‌ కే అవుట్‌ అయ్యాడు. ఇలా కోహ్లీ షార్ట్‌ బాల్స్‌ కు బాగా ఇబ్బంది పడుతున్నాడు. మరి కోహ్లీ ఈ వీక్‌నెస్‌ ను అధిగమించకుంటే.. కోహ్లీకే కాదు టీమిండియాకి కూడా ఎంతో నష్టం కలుగుతుంది. మరి రోహిత్‌ శర్మను నుంచి టిప్స్‌ తీసుకొని అయినా.. కోహ్లీ ఈ చిన్న సమస్యను అధిగమించాలని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: బంగ్లాదేశ్‌ ఓడినా.. ఈ బౌలర్‌ గట్స్‌కి హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి