iDreamPost
android-app
ios-app

నేను అలాంటి వాడ్ని కాదు! మరోసారి హేటర్స్‌కు ఇచ్చిపడేసిన కోహ్లీ!

  • Published May 10, 2024 | 1:24 PM Updated Updated May 10, 2024 | 1:24 PM

Virat Kohli, RCB vs PBKS, IPL 2024: విరాట్‌ కోహ్లీ సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. పంజాబ్‌తో మ్యాచ్‌లో కూడా అద్భుతంగా ఆడాడు. బ్యాట్‌తో పాటు మ్యాచ్‌ తర్వాత తన మాటలతో కూడా విమర్శకులకు గట్టి కౌంటర్‌ ఇచ్చాడు. ఇంతకీ కోహ్లీ ఏమన్నాడో ఇప్పుడు తెలుసుకుందాం..

Virat Kohli, RCB vs PBKS, IPL 2024: విరాట్‌ కోహ్లీ సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. పంజాబ్‌తో మ్యాచ్‌లో కూడా అద్భుతంగా ఆడాడు. బ్యాట్‌తో పాటు మ్యాచ్‌ తర్వాత తన మాటలతో కూడా విమర్శకులకు గట్టి కౌంటర్‌ ఇచ్చాడు. ఇంతకీ కోహ్లీ ఏమన్నాడో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published May 10, 2024 | 1:24 PMUpdated May 10, 2024 | 1:24 PM
నేను అలాంటి వాడ్ని కాదు! మరోసారి హేటర్స్‌కు ఇచ్చిపడేసిన కోహ్లీ!

పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో దుమ్మురేపిన కింగ్‌ కోహ్లీ.. మ్యాచ్‌ తర్వాత తన మాటలతో అదరగొట్టాడు. ఈ సీజన్‌లో కోహ్లీ అద్భుత ఫామ్‌లో నిలకడగా రన్స్‌ చేస్తున్నా.. అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల లిస్ట్‌లో నంబర్‌ వన్‌ పొజిషన్‌లో ఉన్నా.. స్ట్రైక్‌ రేట్‌ సరిగా లేదంటూ కొంతమంది కోహ్లీపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై నేరుగా కో​హ్లీనే స్పందిస్తూ.. ఒక చోటు కూర్చోని ఎవరు ఏమైనా మాట్లాడతారంటూ గట్టి కౌంటర్‌ ఇచ్చాడు. నోటితోనే కాదు.. తన బ్యాట్‌తో కూడా కోహ్లీ తన విమర్శకుల నోళ్లు మూయిస్తున్నాడు. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 195.74 స్ట్రైక్‌రేట్‌తో 47 బంతుల్లోనే 92 పరుగులు చేశాడు. అందులో 7 ఫోర్లు, 6 సిక్సులు ఉన్నాయి.

భారీ ఇన్నింగ్స్‌ ఆడటంతో పాటు అద్భుతమైన ఫీల్డింగ్‌తో ఒక రనౌట్‌ చేసి ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించిన విరాట్‌ కోహ్లీకి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. ఈ అవార్డు అందుకుంటున్న సమయంలో కోహ్లీ చేసిన వ్యాఖ్యలు మరోసారి తన హేటర్స్‌కు చెంపచెల్లు మనిపించేలా ఉన్నాయి. స్ట్రైక్‌ రేట్‌తో పాటు విరాట్‌ కోహ్లీ స్పిన్నర్లను సరిగా ఆడలేకపోతున్నాడు అని కూడా కొంతమంది విమర్శించారు. కానీ, స్పిన్నర్లను ఆడేందుకు స్లాగ్‌ స్విప్‌ షాట్లను ఈ సీజన్‌లో ఆడుతున్నానని, గతంలోనే ఇలాంటి షాట్లను ఆడే వాడినని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

‘నేను ఇలా ఆడను అలా అడను.. ఇలానే ఆడతా అంటూ ఒకే చోట కూర్చేన వ్యక్తిని కాదు. ఏ విషయంలో ఇంప్రూ అవ్వాలనిపిస్తే.. ఆ విషయంలో నన్ను నేను ఇంప్రూ చేసుకుంటాను. ఈ సీజన్‌లో నేను స్పిన్నర్లకు వ్యతిరేకంగా స్లాగ్ స్వీప్ ఆడుతున్నాను. నేను ఇంతకు ముందు రెగ్యులర్‌గా ఆడే షాటే అది’ అంటూ పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలతో తాను స్పిన్‌ బౌలింగ్‌ సరిగా ఆడటం లేదని కామెంట్స్‌ చేస్తున్న వారికి కౌంటర్‌గా కోహ్లీ మాట్లాడినట్లు క్రికెట్‌ అభిమానులు అనుకుంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.