నవీన్ ఉల్ హక్.. ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్‌కు బాగా పరిచయం ఉన్న పేరిది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ద్వారా ఇక్కడి వారికి సుపరిచితుడయ్యాడీ ఆఫ్ఘానిస్థాన్ బౌలర్. అయితే మెగా లీగ్‌లో తన పెర్ఫార్మెన్స్ ద్వారా కాకుండా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో గొడవతో పాపులారిటీ బాగా తెచ్చుకున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో నవీన్-కోహ్లీ మధ్య గొడవ జరగడం.. అందులోకి గౌతం గంభీర్ కలుగజేసుకోవడం తెలిసిందే. నవీన్‌కు మద్దతుగా వచ్చిన గంభీర్‌తో విరాట్ మాటల యుద్ధం, ఇద్దరూ ఒకరిపై ఒకరు దూసుకెళ్లడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.
కోహ్లీని గెలికిన నవీన్ ఉల్ హక్‌ను ఇండియన్ ఫ్యాన్స్ మ్యాంగో మ్యాన్ అని పిలుస్తూ ట్రోలింగ్ మొదలుపెట్టారు. ఐపీఎల్ పూర్తయ్యే వరకు అతడిపై గ్రౌండ్లోనూ, సోషల్ మీడియాలోనూ ట్రోలింగ్ చేస్తూ వచ్చారు. అయితే బుధవారం టీమిండియా-ఆఫ్ఘానిస్థాన్ మధ్య జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్‌లోనూ తొలుత నవీన్ మీద ట్రోలింగ్ జరిగింది. కానీ కింగ్ ముందు మ్యాంగో మ్యాన్ తలవంచాడు. నవీన్-కోహ్లీ కలసిపోయారు. దీంతో ఇద్దరూ ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. అలాగే పరస్పరం మద్దతు తెలుపుకుంటూ కనిపించారు.
కాంట్రవర్సీ మరిచి కోహ్లీ-నవీన్ నవ్వుకుంటూ, మాట్లాడుకుంటూ కనిపించారు. నవీన్ ఉల్ హక్‌ను ప్రేక్షకులు ట్రోల్ చేస్తున్నప్పుడు విరాట్ కలుగజేసుకున్నాడు. విరాట్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ‘కోహ్లీ.. కోహ్లీ..’ అంటూ సపోర్ట్ చేసిన ఫ్యాన్స్.. నవీన్ బౌలింగ్ చేస్తున్నప్పుడు కూడా ‘కోహ్లీ.. కోహ్లీ..’ అంటూ అతడ్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు. దీంతో కలుగజేసుకున్న విరాట్.. నవీన్‌కు వ్యతిరేకంగా అలా అరవొద్దంటూ సైగ చేశాడు. దీన్ని ఆపేయండంటూ అభిమానులకు సూచించాడు కోహ్లీ.
నవీన్‌కు వ్యతిరేకంగా అరవొద్దని కోహ్లీ అనడంతో ఒక్కసారిగా ఆడియెన్స్ సైలెంట్ అయిపోయారు. దీంతో కోహ్లీ మంచి మనసును అందరూ ప్రశంసిస్తున్నారు. కోహ్లీ ప్రేక్షకులకు సైగలు చేస్తున్న వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. నవీన్ కోసం కోహ్లీ నిలబడటం, అతడిపై ఫ్యాన్స్‌లో వ్యతిరేకతను తగ్గించేందుకు ప్రయత్నించడాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. ఇక నెక్స్ట్ ఐపీఎల్లో నవీన్‌పై ట్రోలింగ్ ఉండకపోవచ్చని నెటిజన్స్ అంటున్నారు. ఇక ఈ కాంట్రవర్సీకి ఫుల్స్టాప్ పడినట్లేనని చెబుతున్నారు. మరి.. నవీన్ కోసం కోహ్లీ చేసిన పనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: IND vs AFG: పసికూనపై గెలిచాము! కానీ.. ఆ విషయంలో అట్టర్ ఫ్లాప్ అయ్యాము!
Virat Kohli asking the Delhi crowd to stop mocking Naveen Ul Haq.pic.twitter.com/Dq482rPsFU
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 11, 2023