SNP
టీమిండియా సీనియర్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ చాలా కాలం తర్వాత టీ20 క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. రీఎంట్రీ మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. అయితే.. ఈ మ్యాచ్‌లో కోహ్లీ కొట్టిన ఒక షాట్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. అదేంటో ఇప్పుడు చూద్దాం..
టీమిండియా సీనియర్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ చాలా కాలం తర్వాత టీ20 క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. రీఎంట్రీ మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. అయితే.. ఈ మ్యాచ్‌లో కోహ్లీ కొట్టిన ఒక షాట్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. అదేంటో ఇప్పుడు చూద్దాం..
SNP
టీమిండియా సూపర్‌స్టార్ విరాట్ కోహ్లీ చాలా కాలం తర్వాత టీ20 క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. అప్పుడెప్పుడో టీ20 వరల్డ్ కప్ 2022లో ఆడిన కోహ్లీ.. ఆ తర్వాత పూర్తిగా పొట్టి ఫార్మాట్‌కు దూరమయ్యాడు. వన్డే వరల్డ్ కప్ 2023 కోసం ఎక్కువ ఫోకస్ వన్డేలపై పెట్టడంతో జట్టులోని ప్రధాన ఆటగాళ్లు టీ20లకు దూరంగా ఉన్నారు. ఆ ప్రయోగం మంచి ఫలితాన్నే ఇచ్చింది. వన్డే వరల్డ్ కప్ 2023లో ఫైనల్ మినహా.. టీమిండియా ఎంత అద్భుతంగా ఆడిందో అంతా చూశారు. ఓటమి ఎవరుగని జట్టుగా.. వరుసగా 10 విజయాలు సాధించి ఫైనల్ చేరింది. కోహ్లీ, రోహిత్ శర్మతో పాటు జట్టులోని ఆటగాళ్లంతా ఎంతో అద్భుతంగా రాణించారు. కానీ, ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన ఓటమితో కప్పు చేజారింది.
ఆ ఓటమి తర్వాత.. ఇటీవల ముగిసిన సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్ విరాట్ కోహ్లీ తిరిగి గ్రౌండ్‌లోకి దిగాడు. ఆ సిరీస్‌లోనూ అద్భుతంగా ఆడాడు. అయితే.. టీ20 కెరీర్‌పై ఎన్నో అనుమానాలు వ్యక్తం అయ్యాయి. వన్డే వరల్డ్ కప్ తర్వాత.. రోహిత్, కోహ్లీ టీ20లకు పూర్తిగా దూరం అవుతారని, టెస్టులు, వన్డేల్లో మాత్రం కొనసాగుతారనే పుకార్లు భారీగా వచ్చాయి. కానీ, వాటన్నింటికీ పుల్‌స్టాప్ పెడుతూ.. బీసీసీఐ ఆఫ్ఘాన్‌తో మూడు టీ20ల సిరీస్‌కు రోహిత్, కోహ్లీలను ఎంపిక చేసింది. బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయంతో భారత క్రికెట్ అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. దీంతో.. కోహ్లీ టీ20 వరల్డ్ కప్ 2024 ఆడతాడనే విషయం స్పష్టమైంది. నిజానికి వన్డే వరల్డ్ కప్ ముందుకు కోహ్లీ టీ20ల్లోనూ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు.
ఆఫ్ఘాన్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్ కంటే ముందు టీ20 వరల్డ్ కప్ 2022లో ఇంగ్లండ్‌తో జరిగిన సెమీస్‌తో కోహ్లీ హాఫ్ సెంచరీ చేశాడు. ఆ మ్యాచ్ తర్వాత దాదాపు 14 నెలల గ్యాప్ తర్వాత తిరిగి టీ20 బరిలోకి దిగిన కోహ్లీ అక్కడి నుంచే తన బ్యాటింగ్‌ను మొదలుపెట్టినట్లు కనిపించాడు. క్రీజ్‌లోకి వచ్చీరావడంతోనే అద్బుతమైన షాట్లతో విరుచుకుపడ్డాడు. కేవలం 16 బంతుల్లోనే 5 ఫోర్లతో 29 పరుగుల అగ్రెసివ్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్ చూసిన తర్వాత.. కోహ్లీని టీ20ల్లో కొనసాగించాలా? వద్దా? అనే అనుమానం ఎవరికీ రాదు. అతను చూపించిన ఇంటెంట్‌కి క్రికెట్ ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. అయితే.. ఈ మ్యాచ్‌లో కోహ్లీ ఆడిన ఒక షాట్ మ్యాచ్ మొత్తానికి హైలెట్‌గా నిలిచింది.
నవీన్ ఉల్ హక్ వేసిన ఓవర్లో కోహ్లీ ఒక స్ట్రేయిట్ లాఫ్టెడ్ షాట్ కొట్టాడు. సిక్స్ వెళ్లాల్సిన ఆ షాట్ కాస్త మిస్ అయి.. బౌండరీ వెళ్లింది. అంత అద్భుతమైన షాట్ ఆడినా నాలుగు పరుగులు మాత్రమే రావడంతో కోహ్లీ సైతం నిరాశచెందాడు. అయితే.. ఆ షాట్ చూసిన కామెంటేటర్లు టీ20 వరల్డ్ కప్ 2022లో పాకిస్థాన్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో 8 బంతుల్లో 28 పరుగులు కావాల్సిన దశలో.. హరీస్ రౌఫ్ బౌలింగ్‌లో కోహ్లీ కొట్టిన ఐకానిక్ స్ట్రేయిట్ సిక్స్‌తో కంప్యార్ చేశారు. ఇది కూడా సేమ్ షాట్ అయిన కానీ అంత అద్భుతంగా టైమ్ కాలేదని పేర్కొన్నారు. ఇది చూసిన కోహ్లీ అభిమానులు.. టీ20 క్రికెట్‌కు 14 నెలల పాటు దూరంగా ఉన్నా.. ఒక్కసారి గ్రౌండ్‌లోకి దిగితే.. అదే పౌరుషం చూపిస్తా కోహ్లీ అంటూ సినిమా డైలాగ్స్ పేల్చుతున్నారు. మరి కోహ్లీ నవీన్ బౌలింగ్‌లో కొట్టిన స్ట్రేయిట్ ఫోర్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
KING kohli almost recreated this iconic shot against Naveen ul haq ! #INDvsAFG || #ViratKohli || #INDvAFG pic.twitter.com/WPOQTWkXfR
— Nishi 🌝 (@Nishi_45) January 14, 2024
Happy Bday Harish Rauf
From :- Virat Kohli 😂😂😂 pic.twitter.com/kbB4xlg7yx
— Hammer and Gavel (@hammer_gavel) November 7, 2023