iDreamPost

IND vs PAK: పాంటింగ్‌ సరసన కోహ్లీ! నెక్ట్స్‌ టార్గెట్‌ సంగక్కర, సచిన్‌

  • Published Sep 11, 2023 | 8:21 PMUpdated Sep 11, 2023 | 8:21 PM
  • Published Sep 11, 2023 | 8:21 PMUpdated Sep 11, 2023 | 8:21 PM
IND vs PAK: పాంటింగ్‌ సరసన కోహ్లీ! నెక్ట్స్‌ టార్గెట్‌ సంగక్కర, సచిన్‌

ఆసియా కప్‌ 2023లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్‌ కోహ్లీ సెంచరీతో చెలరేగాడు. ఇన్నింగ్స్‌ను నిదానంగా ఆరంభించినా.. తర్వాత దుమ్మురేపాడు. 84 బంతుల్లో సెంచరీ మార్క్‌ అందుకున్న కోహ్లీ.. సెంచరీ తర్వాత మరింత ఫైర్‌ అయ్యాడు. మొత్తం మీద 94 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సులతో 122 పరుగులు చేశాడు. ఈ సెంచరీతో వన్డేల్లో 47వ సెంచరీ, ఓవరాల్‌గా 77 సెంచరీలు పూర్తి చేసుకున్నాడు. కోహ్లీతో పాటు కేఎల్‌ రాహుల్‌ సైతం సెంచరీతో చెలరేగాడు. వీరిద్దరి సెంచరీలతో టీమిండియా భారీ స్కోర్‌​ చేసింది.

ఈ ఇన్నింగ్స్‌తో విరాట్‌ కోహ్లీ కొన్ని అరుదైన రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. 13 వేల పరుగుల మైలురాయిని చేరుకోవడం, వన్డేల్లో 47 సెంచరీలు పూర్తి చేసుకోవడంతో పాటు.. క్రికెట్‌ చరిత్రలో వన్డే క్రికెట్‌లో అత్యధిక సార్లు 50 ప్లస్‌(హాఫ్‌ సెంచరీలు, సెంచరీలు కలుపుకుని) స్కోర్‌ చేసిన క్రికెటర్‌గా కోహ్లీ మూడో స్థానంలో నిలిచాడు. ఇప్పటి వరకు కోహ్లీ 112 సార్లు 50 ప్లస్‌ స్కోర్లు చేశాడు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ సైతం వన్డేల్లో సరిగ్గా 112 సార్లు 50 ప్లస్‌ స్కోర్లు చేశాడు. ప్రస్తుతం కోహ్లీ సరసన నిలిచాడు. కోహ్లీ కంటే ముందు శ్రీలంక మాజీ కెప్టెన్‌ కుమార సంగక్కర(118), క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ టెండూల్కర్‌(145) మాత్రమే ముందున్నారు. వీళ్లను కూడా కోహ్లీ దాటేయడం ఖాయంగా కనిపిస్తుంది.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఆదివారం జరగాల్సిన మ్యాచ్‌ వర్షం కారణంగా నిలిచిపోవడంతో.. ఇవాళ రిజర్వ్‌డేలో నిర్వహిస్తున్నారు. నిన్న 24.1 ఓవర్లు ఆడిన టీమిండియా 2 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఇవాళ మిగిలిన ఓవర్లు ఆడి వికెట్లు కోల్పోకుండా 356 పరుగులు చేసింది. భారత ఓపెనర్లు రోహిత్‌ శర్మ 56, శుబ్‌మన్‌ గిల్‌ 58 పరుగులు చేసి మంచి స్టార్ట్‌ ఇచ్చారు. ఈ రోజు కూడా ఇండియన్‌ బ్యాటర్లు కేఎల్‌ రాహుల్‌, కోహ్లీ పాక్‌ బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయించి సెంచరీలతో టీమిండియాకు భారీ స్కోర్‌ అందించారు. మరి ఈ మ్యాచ్‌లో కోహ్లీ సాధించిన అరుదైన రికార్డులపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఒళ్లు గగుర్పొడిచే క్యాచ్.. ఫ్యూజులు ఎగిరిపోవడం ఖాయం! వీడియో వైరల్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి