SNP
Virat Kohli, Chokli, IND vs SL: భారత మాజీ కెప్టెన్, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి శ్రీలంకలో ఘోర అవమానం జరిగింది. మూడు వన్డేల సిరీస్ ఆడేందుకు అక్కడికి వెళ్లిన కోహ్లీ.. తనకు జరిగిన అవమానంపై సీరియస్ కూడా అయ్యాడు. దాని గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
Virat Kohli, Chokli, IND vs SL: భారత మాజీ కెప్టెన్, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి శ్రీలంకలో ఘోర అవమానం జరిగింది. మూడు వన్డేల సిరీస్ ఆడేందుకు అక్కడికి వెళ్లిన కోహ్లీ.. తనకు జరిగిన అవమానంపై సీరియస్ కూడా అయ్యాడు. దాని గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
SNP
శ్రీలంకతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసి భారత క్రికెటర్లు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కొత్త టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో జరిగిన తొలి టీ20 సిరీస్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శన కనబర్చింది. ముఖ్యంగా మూడో మ్యాచ్‌లో అయితే.. ఆల్‌మోస్ట్ ఓడిపోయిన మ్యాచ్‌ను సూపర్ ఓవర్ వరకు తీసుకెళ్లి మరీ గెలిచి అద్భుతం చేసింది. ఇక టీ20 విజయం తర్వాత.. వన్డే సిరీస్ కోసం భారత క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి స్టార్లు లంకతో వన్డే సిరీస్ ఆడనున్నారు. ఈ సిరీస్ కోసం లంక చేరుకున్న విరాట్ కోహ్లీకి ఘోర అవమానం జరిగింది.
టీ20 వరల్డ్ కప్ 2024 విజయం తర్వాత.. కోహ్లీ తొలిసారి లంకతో వన్డే సిరీస్‌తోనే బరిలోకి దిగుతున్నాడు. ఈ క్రమంలోనే సోమవారం సాయంత్ర లంకకు చేరుకున్న విరాట్ కోహ్లీ.. మంగళవారం కొలంబో క్రికెట్ స్టేడియంలో ప్రాక్టీస్ సెషన్‌లో కూడా పాల్గొన్నాడు. స్టేడియంలోని ఓ రూమ్‌లో మిగతా భారత క్రికెటర్లతో ఉన్న సమయంలో విరాట్ కోహ్లీని ఓ వ్యక్తి ‘ఛోక్లి’ అంటూ హేళన చేస్తూ పిలిచాడు. ఆ మాట విన్న వెంటనే విరాట్ కోహ్లీ ఆ వ్యక్తివైపు తిరిగి ఏదో అన్నాడు. తోటి ఆటగాళ్ల ముందు తనను అలా అనగానే కోహ్లీకి కోపం వచ్చిన విషయం ఆ సీన్ చూస్తే అర్థం అవుతుంది. సోషల్ మీడియాలో కూడా కోహ్లీని కొంతమంది ఛోక్లి పేరుతో ట్రోల్ చేస్తూ ఉంటారు.
మరి ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్న కోహ్లీ.. అక్కడున్న సెక్యూరిటీ సిబ్బందికి అతన్ని అక్కడి నుంచి పంపించేయాలని సూచించినట్లు సమాచారం. కాగా, టీ20 వరల్డ్ కప్ 2024 తర్వాత విరాట్ కోహ్లీ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత.. మళ్లీ లంకతో వన్డే సిరీస్‌తో గ్రౌండ్‌లోకి దిగనున్నాడు. కాగా.. లంకతో మూడు వన్డేల సిరీస్ ఆగస్టు 2 నుంచి ప్రారంభం కానుంది. 2, 4, 7వ తేదీల్లో మూడు మ్యాచ్‌లు జరగనున్నాయి. మూడు కూడా కొలంబో వేదికగానే ఆడుతాయి భారత్-శ్రీలంక జట్లు. మరి ఈ సిరీస్‌కి ముందు లంకలో కోహ్లీకి జరిగిన అవమానంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Someone called Virat Kohli a chokli in front of him in the dressing room of Colombo ground in Sri Lanka, after which Virat got angry.😭😭
No way now Lankan fan’s also owning Virat Kohli 🙏😹😹😹 pic.twitter.com/ru4KbRUfBX
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) July 31, 2024