SNP
Virat Kohli, Will Jacks, RCB vs GT: గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ బాల్‌కు సిక్స్ కొట్టకుండా ఉన్నందుకు కోహ్లీ దేవుడికి థ్యాంక్స్ చెప్పాడు. ఇంతకీ సిక్స్ కొట్టకుండా ఉన్నందుకు కోహ్లీ ఎందుకు సంతోషంగా ఉన్నాడో ఇప్పుడు చూద్దాం..
Virat Kohli, Will Jacks, RCB vs GT: గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ బాల్‌కు సిక్స్ కొట్టకుండా ఉన్నందుకు కోహ్లీ దేవుడికి థ్యాంక్స్ చెప్పాడు. ఇంతకీ సిక్స్ కొట్టకుండా ఉన్నందుకు కోహ్లీ ఎందుకు సంతోషంగా ఉన్నాడో ఇప్పుడు చూద్దాం..
SNP
గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. ఆదివారం అహ్మాదాబాద్‌లోని నరేంద్ర మోదీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో ఆర్సీబీ ఈ సీజన్‌లో మూడో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. ఈ విజయంతో ఫ్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పై గుజరాత్ టైటాన్స్‌ను 200 పరుగులకే పరిమితం చేశారు ఆర్సీబీ బౌలర్లు.. తర్వాత ఆర్సీబీ టాపార్డర్ కేవలం 16 ఓవర్లలోనే ఈ టార్గెట్‌ను ఛేజ్ చేసిన రికార్డు సృష్టించింది. అయితే.. మీ మ్యాచ్ తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో కోహ్లీ కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ బౌలర్లను కోహ్లీ-విల్ జాక్స్ జోడీ ఊచకోత కోసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా విల్ జాక్స్ అయితే ఏకంగా 10 సిక్సులతో విరుచుకుపడ్డాడు. కానీ, తాను ఇన్నింగ్స్ 16వ ఓవర్ తొలి బంతికి సిక్స్ కొట్టాలని అనుకున్నానని, కానీ, కొట్టకుండా మంచి పనిచేశాననంటూ కోహ్లీ పేర్కొన్నాడు. ఆ బాల్‌కు కోహ్లీ సిక్స్ కొట్టకపోవడం ఎందుకు మంచిదైంది, ఆ విషయాన్ని స్వయంగా కోహ్లీనే ఎందుకు చెప్పుకొచ్చాడంటూ.. ఈ మ్యాచ్‌లో విల్ జాక్స్ ఎలాంటి విధ్వంసం సృష్టించాడో అందరికీ తెలిసిందే. కేవలం 41 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తొలి 31 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన జాక్స్.. సెంచరీ మార్క్ అందుకోవాడానికి కేవలం 10 బంతులు మాత్రమే తీసుకున్నాడు.
అయితే.. మ్యాచ్ ముగిసిన చివరి ఓవర్ అయిన 16వ ఓవర్‌లో కోహ్లీ వద్ద స్ట్రైక్ ఉంది. ఆ సమయంలో కోహ్లీ 69 పరుగుల వద్ద ఉన్నాడు. విల్ జాక్స్ 72 రన్స్‌తో నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్నాడు. రషీద్ ఖాన్ వేసిన 16వ ఓవర్ తొలి బంతికి కోహ్లీ సింగిల్ తీసి.. స్ట్రైక్ జాక్స్‌కి ఇచ్చాడు. ఆ తర్వాత జాక్స్.. 6, 6, 4, 6, 6తో మ్యాచ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. విచిత్రం ఏంటంటే.. 25 బంతుల్లో విజయానికి ఒక్క పరుగు అవసరమైన సమయంలో జాక్స్.. 94 రన్స్‌తో సెంచరీకి సరిగ్గా ఆరు పరుగుల దూరంలో ఉన్నాడు. దాంతో రషీద్ వేసిన చివరి బాల్‌కు కూడా సిక్స్ బాది సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీనిపై కోహ్లీ స్పందిస్తూ.. తాను తొలి బాల్‌కు సిక్స్ కొట్టకపోవడం మంచిదైంది. ఒక రన్ అవసరమైన సమయంలో జాక్స్ సిక్స్‌తో సెంచరీ కంప్లీట్ చేసుకోగలిగాడు అని సరదాగా చెప్పుకొచ్చాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Virat Kohli said, “I was pissed off when I didn’t hit a six on the first ball of the over, but when I saw Will Jacks on 94* and 1 run was still remaining, I said ‘Thank God, I didn’t hit a six'”.
– King Kohli, a gem always. ❤️💎 pic.twitter.com/u2g4Zm8xr6
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 28, 2024