iDreamPost
android-app
ios-app

Virat Kohli: అతడ్ని చూసి గర్విస్తున్నా.. నాకు అన్న కంటే ఎక్కువ: విరాట్ కోహ్లీ

  • Published May 16, 2024 | 3:15 PMUpdated May 16, 2024 | 3:15 PM

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ టాలెంటెడ్ ప్లేయర్లను ఎంకరేజ్ చేస్తుంటాడనేది తెలిసిందే. గేమ్​తో సంబంధం లేకుండా అందరితోనూ మంచి రిలేషన్స్ మెయింటెయిన్ చేస్తుంటాడు.

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ టాలెంటెడ్ ప్లేయర్లను ఎంకరేజ్ చేస్తుంటాడనేది తెలిసిందే. గేమ్​తో సంబంధం లేకుండా అందరితోనూ మంచి రిలేషన్స్ మెయింటెయిన్ చేస్తుంటాడు.

  • Published May 16, 2024 | 3:15 PMUpdated May 16, 2024 | 3:15 PM
Virat Kohli: అతడ్ని చూసి గర్విస్తున్నా.. నాకు అన్న కంటే ఎక్కువ: విరాట్ కోహ్లీ

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ గురించి తెలిసిందే. గ్రౌండ్​లో అగ్రెసివ్​గా కనిపించినా ఆఫ్ ది ఫీల్డ్ మాత్రం అందరితోనూ చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. టాలెంటెడ్ ప్లేయర్లను ఎంకరేజ్ చేస్తుంటాడు. గేమ్​తో సంబంధం లేకుండా అందరితోనూ మంచి రిలేషన్స్ మెయింటెయిన్ చేస్తుంటాడు. ఇతర స్పోర్ట్స్ స్టార్ట్స్​తో కూడా అతడికి సత్సంబంధాలు ఉన్నాయి. టెన్నిస్ స్టార్ జొకోవిచ్​తో పాటు ఇంకా పలువురు ఇతర క్రీడా ప్రముఖులతో అతడికి మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఎప్పుడూ వాళ్లతో టచ్​లో ఉంటాడు కింగ్. గేమ్​తో పాటు ఇతర విషయాలనూ వారితో షేర్ చేసుకుంటూ ఉంటాడు. అలాంటోడు ఓ లెజెండరీ ప్లేయర్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అతడు తనకు అన్న కంటే ఎక్కువని అన్నాడు.

ఆ దిగ్గజ ఆటగాడ్ని చూసి గర్విస్తున్నానని కోహ్లీ అన్నాడు. అతడు తనకు సోదరుడి కంటే ఎక్కువని చెప్పాడు. ఇంతకీ విరాట్ ఎవరి గురించి మాట్లాడాడనే కదా మీ సందేహం.. భారత ​స్టార్ ఫుట్​బాలర్ సునీల్ ఛెత్రీని ఉద్దేశించి కింగ్ ఈ కామెంట్స్ చేశాడు. ఇవాళ ఛెత్రి తన కెరీర్​కు గుడ్​బై చెప్పేశాడు. దాదాపు రెండు దశాబ్దాల పాటు టీమిండియా తరఫున ఆడుతూ కోట్లాది మంది అభిమానాన్ని సొంతం చేసుకున్న ఛెత్రి ఆఖరిసారిగా జూన్ 6వ తేదీన కువైట్​తో మ్యాచ్ ఆడనున్నాడు. ఈ సందర్భంగా నెట్టింట వైరల్​గా మారిన ఛెత్రి రిటైర్మెంట్ వీడియోపై కోహ్లీ కామెంట్ చేశాడు. అతడి రియాక్షన్ ఇప్పుడు హైలైట్​గా మారింది.

సునీల్ ఛెత్రి తనకు సోదరుడి లాంటి వాడని.. అతడ్ని చూసి ఎంతో గర్విస్తున్నానని కోహ్లీ కామెంట్ చేశాడు. దీన్ని చూసిన ఫ్యాన్స్.. ఇద్దరు దిగ్గజాల మధ్య ఉన్న స్నేహానికి ఇది ఉదాహరణ అని అంటున్నారు. ఇక, రిటైర్మెంట్ గురించి ఓ వీడియో పోస్ట్ చేసిన ఛెత్రి ఎమోషనల్ అయ్యాడు. ఆట నుంచి తప్పుకుంటున్న విషయం తన తల్లి, భార్యకు చెప్పినప్పుడు కన్నీరు పెట్టుకున్నారని తెలిపాడు. రెండు దశాబ్దాల కెరీర్​లో ఎన్నో గొప్ప జ్ఞాపకాలు ఉన్నాయని పేర్కొన్నాడు. రెస్పాన్సిబిలిటీ, ప్రెజర్, హ్యాపీనెస్.. ఇలా అన్నింటినీ అనుభూతి చెందానన్నాడు. ఇన్నేళ్ల పాటు టీమిండియాకు ప్రాతినిధ్యం వహిస్తానని అస్సలు అనుకోలేదని.. దీన్ని గౌరవంగా భావిస్తున్నానని వివరించాడు. చివరి మ్యాచ్​కు టైమ్ వచ్చేసిందని.. ఇది ఎప్పటికీ గుర్తుండిపోతుందని వ్యాఖ్యానించాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి