SNP
SNP
టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఆట గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాగే అతని ఫిట్నెస్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కోహ్లీ తన సుదీర్ఘ కెరీర్లో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా గాయపడి జట్టు నుంచి తప్పుకోలేదంటేనే అర్థం చేసుకోవచ్చు.. అతని ఫిట్నెస్ లెవెల్స్ ఏంటో. ఆటలోనే కాదు.. ఫిట్‌నెస్‌లో కూడా కోహ్లీ కింగే. ధోని టీమిండియా కెప్టెన్ అయిన తర్వాత.. జట్టులో ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టాడు. ఫిట్నెస్ సరిగా లేదని హేమాహేమీలను కూడా జట్టు నుంచి తప్పించాడు. అంతకంటే ముందు నుంచే కోహ్లీ ఫిట్‌నెస్‌కు ఐకాన్‌గా ఉన్నాడు.
అయితే.. కోహ్లీ సరిగ్గా ఇదే రోజు ఆగస్టు 18, 2008న శ్రీలంకతో వన్డే మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. నేటితో అతని కెరీర్‌కు 15 ఏళ్లు నిండాయి. ఈ 15 ఏళ్లలో కోహ్లీ ఎంతో సాధించాడు. ఇండియన్ క్రికెట్‌కు సచిన్ తర్వాత అతనే. గొప్ప గొప్ప ఇన్నింగ్స్‌లు, మ్యాచ్ విన్నింగ్ నాక్‌లతో ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్‌గా ఎదిగాడు. అయితే.. కోహ్లీ భారీ షాట్లతోనే కాదు.. వికెట్ల మధ్య పరుగులు దొంగిలించి కూడా లాంగ్ ఇన్నింగ్స్‌లు నెలకొల్పగలడు. వికెట్ల మధ్య చిరుత వేగంతో పరిగెత్తే క్రికెటర్లలో కోహ్లీ ముందు వరుసలో ఉంటాడు.
ధోని-కోహ్లీ జోడీ క్రీజ్‌లో ఉంటే సింగిల్ వచ్చే చోట రెండు, రెండు రన్స్ వచ్చే చోట మూడు పరుగులు వస్తుంటాయి. వికెట్ల మధ్య వాళ్లిద్దరూ అంత వేగంగా పరిగెత్తుతుంటారు. ధోని కెప్టెన్సీ కంటే ముందు ఉన్న టీమిండియాకు, ఆ తర్వాత భారత జట్టుకు ఉన్న ప్రధాన తేడా అదే. వికెట్ల మధ్య వేగంగా పరిగెత్తడం. గతంలో టీమిండియా ఆటగాళ్లు.. కొడితే ఫోర్, లేదంటే సింగిల్ అనే ధోరణిలో ఆడేవారు. కానీ.. ధోని కెప్టెన్ అయ్యాకా.. ఆ ధోరణి మారింది. ఫోర్లు, సిక్సులతో పాలు వికెట్ల మధ్య రన్స్ కూడా వీలైనన్ని తీయాలి, పరిగెత్తడంలో అస్సలు అలసత్వం ప్రదర్శించకుండా చేశాడు. దాంతో టీమ్ ఫీల్డింగ్ కూడా మెరుగైంది. అయితే.. ధోని కలలు కన్న ఫిట్నెస్ లెవెల్స్‌ను వందకు వందశాతం అందుకున్న ఆటగాడు విరాట్ కోహ్లీ.
బ్యాటింగ్ చేస్తుంటే.. వికెట్ల మధ్య చిరుతా పరిగెత్తుతాడు. ఫీల్డింగ్ చేస్తుంటే మెరుపు వేగంతో స్పందిస్తాడు. ఈ క్రమంలో 15 ఏళ్ల కెరీర్‌ను పూర్తి చేసుకున్న కోహ్లీ నమ్మశక్యం కానీ రికార్డు సాధించాడు. ఇప్పటి వరకు కోహ్లీ వికెట్ల మధ్య పరిగెత్తిన దూరాన్ని లెక్కిస్తే.. దాదాపు 277 కిలో మీటర్లు వచ్చింది. ఈ లెక్కలు చూసి క్రికెట్ అభిమానులు షాక్ అవుతున్నారు. కాగా, కోహ్లీ ఇప్పటి వరకు 111 టెస్ట్‌లు, 275 వన్డేలు, 115 టీ20లు ఆడిన కోహ్లీ..25582 పరుగులు చేశాడు. మరి కోహ్లీ వికెట్ల మధ్య పరిగెత్తిన దూరంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Forever grateful 🙏 pic.twitter.com/cpxoUNS0uG
— Virat Kohli (@imVkohli) August 18, 2023
ఇదీ చదవండి: టీమిండియాకి చాలా ఈజీగా ఆడేస్తున్నారు! అదే జరిగితే.. బుమ్రా ఇంటికే