SNP
Virat Kohli, Rohit Sharma, KL Rahul, Hardik Pandya: ఐపీఎల్ 2024లో భారత సీనియర్ క్రికెటర్ల హవా కనిపిస్తోంది. టాప్ రన్ స్కోరర్స్ లిస్ట్‌లో ముగ్గురు టీమిండియా సీనియర్ క్రికెటర్లు ఉన్నారు. కానీ, ఓ సీనియర్ క్రికెటర్ మాత్రం చెత్త ఫామ్‌తో ఇబ్బంది పడుతున్నాడు. దాని గురించి వివరంగా తెలుసుకుందాం..
Virat Kohli, Rohit Sharma, KL Rahul, Hardik Pandya: ఐపీఎల్ 2024లో భారత సీనియర్ క్రికెటర్ల హవా కనిపిస్తోంది. టాప్ రన్ స్కోరర్స్ లిస్ట్‌లో ముగ్గురు టీమిండియా సీనియర్ క్రికెటర్లు ఉన్నారు. కానీ, ఓ సీనియర్ క్రికెటర్ మాత్రం చెత్త ఫామ్‌తో ఇబ్బంది పడుతున్నాడు. దాని గురించి వివరంగా తెలుసుకుందాం..
SNP
టీ20 క్రికెట్ అంటేనే చాలా మంది కుర్రాళ్ల ఆట అని అనుకుంటారు. నిజానికి అది కరెక్టే. టీ20 క్రికెట్ ఫాస్ట్ ఫుడ్ లాంటి ఆట.. ఇందులో మైండ్ పాదరసంలా, శరీరం మెరుపులా కదలాలి. వేగం, ధైర్యం, తెగువ ఉంటేనే టీ20 క్రికెట్‌లో రాణించడం సాధ్యం అవుతుంది. కానీ, ఐపీఎల్ 2024 సీజన్‌లో మాత్రం.. కుర్రాళ్లతో పోటీ పడుతూ.. ఒక విధంగా చెప్పాలంటే కుర్రాళ్లను వెనక్కి నెడుతూ.. సీనియర్ స్టార్ క్రికెటర్లు దుమ్మురేపుతున్నారు. ముఖ్యంగా టీమిండియా సీనియర్ క్రికెటర్లు ఈ సీజన్‌లో మంచి టచ్‌లో కనిపిస్తున్నారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అయితే.. తన కెరీర్ పీక్స్‌లో ఉన్న టైమ్‌లో ఆడినట్లు రెట్టించిన ఉత్సాహంతో ఆడుతున్నారు.
ప్రస్తుతం విరాట్ కోహ్లీ అందర కంటే ఎక్కువ రన్స్‌తో ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా ఉన్నాడు. కోహ్లీ 7 మ్యాచ్‌ల్లో 72.20 యావరేజ్‌తో 147.34 స్ట్రైక్ రేట్‌తో 361 పరుగులు చేసి టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. కోహ్లీ తర్వాత రియాన్ పరాగ్ 318 రన్స్‌తో రెండో ప్లేస్‌లో, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 297 రన్స్‌తో మూడో స్థానంలో, టీమిండియా సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ 286 పరుగులతో నాలుగో స్థానంలో ఉన్నారు. ఇలా టాప్ 4లో ముగ్గురు టీమిండియా సీనియర్లు బ్యాటర్లు ఉన్నారు. వీరి ముగ్గురు టీ20 వరల్డ్ కప్ 2024లో టీమిండియాకు కీలకమైన బ్యాటర్లే. అలాంటిది వీరు ముగ్గురు ఇంత మంచి ఫామ్‌లో ఉండటం టీమిండియాకు ఎంతగానో కలిసొచ్చే అంశం. అయితే.. ఒక వైపు కోహ్లీ, రోహిత్, రాహుల్.. టీ20 వరల్డ్ కప్‌లో సత్తా చాటాలనే లక్ష్యంతో ఐపీఎల్‌లో రాణిస్తుంటే.. మరోవైపు ఓ సీనియర్ క్రికెటర్ మాత్రం దారుణంగా విఫలం అవుతున్నాడు.
సీనియర్లతో పాటు అతను కూడా టీ20 వరల్డ్ కప్ టీమ్‌లో ఉంటాడనే చాలా మంది భావిస్తున్నారు. అతనే హార్ధిక్ పాండ్యా. ఇతను ప్రస్తుతం ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు. రోహిత్ శర్మ లేని సమయంలో టీమిండియాకు టీ20ల్లో కెప్టెన్‌గా వ్యవహరించాడు. కానీ, ప్రస్తుతం బ్యాడ్ ఫామ్‌లో కొనసాగుతున్నాడు. హార్ధిక్ పాండ్యా 7 మ్యాచ్‌ల్లో 23.50 యావరేజ్, 141 స్ట్రైక్‌రేట్‌తో 141 పరుగులు మాత్రమే చేశాడు. అలాగే బౌలింగ్‌లోనూ పెద్దగా రాణించడం లేదు. ఒక ఆల్‌రౌండర్‌గా పాండ్యా టీమిండియాకు ఎంతో కీలకం కానీ, ప్రస్తుతం ఐపీఎల్‌లో పాండ్యా ఫామ్ చూస్తే అతను టీ20 వరల్డ్ కప్ కోసం అసలు టీమిండియాలో ఉంటాడా? అనే అనుమానం వ్యక్తం అవుతుంది. అయితే.. ముంబైకి కెప్టెన్సీ చేయడంతోనే పాండ్యా రాణించలేకపోతున్నాడని, ఆ కెప్టెన్సీ భారం అతనిపై తీవ్ర ప్రభావం చూపుతుందని కూడా క్రికెట్ నిపుణులు భావిస్తున్నారు. మరి కోహ్లీ, రోహిత్, రాహుల్ లాంటి సీనియర్లు తమ స్థాయికి తగ్గట్లు రాణిస్తుంటే.. పాండ్యా ఒక్కడే ఎందుకు విఫలం అవుతున్నాడని మీరు భావిస్తున్నారో? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
indian senior cricketers doing well pic.twitter.com/0qvcN8jhHZ
— Sayyad Nag Pasha (@nag_pasha) April 20, 2024