Somesekhar
టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కు ముందు బాధపడిన విషయాన్ని ప్రధానితో జరిగిన భేటీలో వెల్లడించాడు కోహ్లీ. ఆ వ్యాఖ్యలు ప్రస్తుతం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశం అయ్యాయి.
టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కు ముందు బాధపడిన విషయాన్ని ప్రధానితో జరిగిన భేటీలో వెల్లడించాడు కోహ్లీ. ఆ వ్యాఖ్యలు ప్రస్తుతం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశం అయ్యాయి.
Somesekhar
టీ20 ప్రపంచ కప్ ను టీమిండియా ముద్దాడిన సంగతి తెలిసిందే. అయితే ఈ మెగాటోర్నీలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దారుణంగా విఫలం అయ్యాడు. దాంతో కింగ్ కోహ్లీపై కొందరు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అతడిని ఓపెనర్ గా పంపి భారత్ తప్పు చేస్తుందని కొందరు సూచించారు. ఇక తన ఫామ్ పై కోహ్లీ సైతం ఫైనల్ మ్యాచ్ కు ముందు ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఫైనల్ మ్యాచ్ కు ముందు బాధపడిన విషయాన్ని ప్రధానితో జరిగిన భేటీలో వెల్లడించాడు కోహ్లీ. ఆ వ్యాఖ్యలు ప్రస్తుతం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశం అయ్యాయి.
విరాట్ కోహ్లీ.. 2024 ఐపీఎల్ సీజన్ లో పరుగుల సునామీ సృష్టించాడు. ఈ సీజన్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా నిలిచి, ఆరెంజ్ క్యాప్ ను దక్కించుకున్నాడు. ఇక జోరును టీ20 వరల్డ్ కప్ లో కూడా చూపిస్తాడని ఫ్యాన్స్ భావించారు. కానీ అనూహ్యంగా ఈ మెగా టోర్నీలో విరాట్ దారుణంగా విఫలం అయ్యాడు. ఫైనల్ మ్యాచ్ కు ముందు ఆడిన 7 మ్యాచ్ ల్లో కేవలం 75 రన్స్ మాత్రమే చేశాడు. ఈ అంకెలు చూస్తేనే తెలుస్తోంది.. కోహ్లీ పూర్ ఫామ్ ఏ రేంజ్ లో ఉందో. అయితే తన ఫామ్ పై ఫైనల్ మ్యాచ్ కు ముందు ఆందోళనకు గురైనట్లు తాజాగా ప్రధానితో జరిగిన భేటీలో చెప్పుకొచ్చాడు.
విరాట్ కోహ్లీ మాట్లాడుతూ..”ఈ టోర్నీలో నేను దారుణంగా విఫలం అవుతుండటంతో.. జట్టుకు న్యాయం చేయలేకపోతున్నాను, దాంతో జట్టుకు భారంగా తయ్యారవుతున్నాను అని ద్రవిడ్ భాయ్ తో చెప్పాను. అందుకు అతడు కీలక సమయంలో నువ్వు తప్పకుండా ఫామ్ లోకి వస్తావు అని భరోసా ఇచ్చాడు. ఆ తర్వాత కాన్ఫిడెంట్ గా లేనని రోహిత్ తో కూడా చెప్పాను. కానీ రోహిత్ నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపాడు. ఇక ఫైనల్లో వికెట్లు కోల్పోతున్నప్పుడు పరిస్థితులకు తగ్గట్లుగా ఆడాలనుకున్నాను. అలాగే ఆడాను.. ఫలితం కూడా అలాగే వచ్చింది” అని చెప్పుకొచ్చాడు విరాట్. ఇక ఫైనల్ మ్యాచ్ లో 59 బంతుల్లో 76 పరుగులు చేసి, జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ ను అందించాడు. అయితే ఇది స్లో ఇన్నింగ్స్ అని చాలా మంది విమర్శించారు. కానీ ఆ ఇన్నింగ్సే టీమిండియాకు వరల్డ్ కప్ ను సాధించి పెట్టిందనేది కాదనలేని సత్యం. మరి ఫైనల్ మ్యాచ్ కు ముందు విరాట్ కోహ్లీ ఇంత బాధపడ్డాడా? అని ఈ విషయం తెలిసిన తర్వాత అందరూ అనుకుంటున్నారు.